• తాజా వార్తలు

రెడ్ మి 4 ఏ ఫ్లాష్ సేల్ 13న


ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ షియామి నుండి వచ్చిన రెడ్‌ మి 4 ఏ మరోసారి విక్రయానికి రానుంది. ఈ నెల 13న ఫ్లాష్‌ సేల్‌ నిర్వహిస్తున్నారు. దాదాపు హై ఎండ్‌ స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లతో కేవలం రూ. 5,999లకే అందిస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ పై చాలామంది మక్కువ చూపించారు..విడుదలైన కొద్దీ సేపటికే హాట్ కేకుల్లా అమ్మడూయినా ఈ ఫోన్ డార్క్‌ గ్రే , గోల్డ్‌ అండ్‌ రోజ్‌ గోల్డ్‌ కలర్స్‌ లో ఏప్రిల్‌ 13 మూడోసారి విక్రయించబోతోంది. మధ్యాహ్నం 12 గంటలనుంచి, ఎంఐ.కామ్, అమెజాన్‌ ద్వారా ఆన్‌లైన్ లో కొనుగోలు చేయవచ్చని షియామి ప్రకటించింది.
కాగా, గత నెలలో ఈ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేశారు. ఫోన్ లాంచ్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు రెండు సార్లు ఫ్లాష్ సేల్ ద్వారా అమ్మకాలు జరిపారు. మార్చి 30న జరిపిన విక్రయాల్లో 2 నిమిషాల్లోనే మొత్తం సరకంతా సేల్ అయిపోయింది.
రెడ్‌ మీ 4 ఏ లాంచ్‌ ఫీచర్లు
* 5 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే
* 720×1280 పిక్సెల్ రిజల్యూషన్‌,
* 6.0 ఆండ్రాయిడ్‌ మార్షమల్లౌ, క్వాడ్-కోర్ క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 425 చిప్సెట్
* 2 జీబీ ర్యామ్‌,
* 16 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
13ఎంపీ రియర్‌ కెమెరా,
* 5 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా,
* 3,120 ఎంఏహెచ్‌బ్యాటరీ

జన రంజకమైన వార్తలు