ముకేశ్ అంబానీ.. రిలయన్స్ గ్రూప్ అధినేత.. ఒక్కో రంగంలో అడుగు పెట్టి దానిలో టాప్ లెవెల్‌కు తన సంస్థను తీసుకుపోవడంలో సిద్ధహస్తుడైన పారిశ్రామికవేత్త. జియోతో భారతీయ టెలికం రంగ రూపురేఖలనే మార్చేసిన అంబానీ ఇప్పుడు చిల్లర కిరాణా వ్యాపారంపై కన్నేశారు. జియోమార్ట్ పేరుతో ఆన్‌లైన్ గ్రాసరీ సేవలను మొదలుపెట్టారు. నవీ ముంబయి, థానే సహా మూడు ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించి సక్సస్ అవడంతో ఇప్పుడు పలు రాష్ట్రాల్లో జియో మార్ట్ సేవలను తీసుకొస్తున్నారు.
200కి పైగా పట్టణాల్లోకి ఎంట్రీ
జియో మార్ట్ దేశవ్యాప్తంగా 200కి పైగా పట్టణాల్లో కిరాణా సామాగ్రిని పంపిణీ చేయనుందని రిలయన్స్ స్మార్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ దామోదర్ మాల్ ప్రకటించారు. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి రెండే పట్టణాలున్నాయి. ఒకటిఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లాలో వాణిజ్య కేంద్రంగా పేరొందిన తాడేపల్లిగూడెం. రెండోది తెలంగాణలోని బోధన్
ఎక్కడెక్కడ కొత్తగా సేవలు
* నోఖా, రాజస్థాన్
* బోధన్, తెలంగాణ
* తాడేపల్లిగూడెం, ఆంధ్రప్రదేశ్
* నాగర్‌కోయిల్, తమిళనాడు
* రాయగఢ్ , ఒడిశా
* డార్జిలింగ్, పశ్చిమబెంగాల్
ఇంకా ఇతర పట్టణాలు
త్వరలో యాప్
జియోమార్ట్. కొత్తగా ప్రారంభించిన ఇ-కామర్స్ పోర్టల్, జియోమార్ట్.కామ్ ద్వారా కిరాణా, పండ్లు, కూరగాయలు లాంటివి ఆర్డర్ చేయొచ్చు.
వినియోగదారులకు సులువుగా ఉండేందుకు, స్మార్ట్‌ఫోన్ నుంచే ఆర్డర్ చేసేలా త్వరలో జియోమార్ట్ యాప్‌ను రిలయన్స్ లాంచ్ చేయబోతోంది.