• తాజా వార్తలు

ఈ-ఫార్మసీపైనా రిల‌య‌న్స్ క‌న్ను.. నెట్‌మెడ్స్‌ను కొనేందుకు ప్రయ‌త్నాలు 

జియో మార్ట్‌తో  కిరాణా వ్యాపారంలోకి ప్ర‌వేశించిన రిల‌య‌న్స్ ఇప్పుడు  ఈ-కామర్స్  బిజినెస్‌లోని అన్ని వ్యాపారాల మీదా దృష్టి పెట్టింది.  ఆన్‌లైన్‌లో ఆర్డ‌ర్ చేస్తే ఔష‌ధాలు అందించే ఈ-ఫార్మ‌సీ వ్యాపారంపై క‌న్నేసింది. ఈ-ఫార్మ‌సీ బిజినెస్‌లో దూసుకెళుతున్న స్టార్ట‌ప్‌ల లిస్ట్ తీస్తోంది. ఇందులో ముందున్న నెట్‌మెడ్స్ ను కొనేందుకు రిల‌య‌న్స్ సిద్ధ‌మైంద‌ని స‌మాచారం.

అమెజాన్ బాట‌లోనే..
ఈ-కామ‌ర్స్ దిగ్గజం అమెజాన్ గత వారం బెంగళూరులో ఈ-ఫార్మసీ సేవలను ఆరంభించింది. దీన్ని క్రమంగా దేశ‌మంతా విస్త‌రింబోతోంది.  జియోమార్ట్‌తో గ్రాస‌రీస్ విభాగంలో ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ల‌కు పోటీకి దిగిన రిల‌య‌న్స్ ఇప్పుడు ఈ-ఫార్మ‌సీలోనూ అమోజాన్‌కు గ‌ట్టి  పోటీకి సిద్ధ‌మైంది.  తన స్మార్ట్‌ పాయింట్‌ కేంద్రాల ద్వారా ఫార్మసీ స‌ర్వీస్‌ను అందించాల‌ని భావిస్తోంది.  

900 కోట్ల‌తో కొనుగోలు!
చెన్నైకి చెందిన ఆన్‌లైన్‌ ఫార్మసీ స్టార్టప్‌ నెట్‌మెడ్స్  ఈ-ఫార్మ‌సీలో ఇండియాలో బాగా పాపుల‌ర‌యిన పేరు. దీన్ని  సుమారు రూ.900 కోట్ల‌తో కొనేందుకు రిల‌య‌న్స్ ప్ర‌య‌త్నిస్తోంది.   

జన రంజకమైన వార్తలు