ఇండియాలో నెంబర్ వన్ బ్యాంక్ ఎస్‌బీఐ.. డెబిట్ కార్డు యూజర్ల కోసం కొత్త రూల్ తెచ్చింది. ఏటీఎం నుంచి క్యాష్ విత్‌డ్రా చేసుకోవాలంటే ఓటీపీ నమోదు చేయాలన్నది ఆ రూల్. శుక్రవారం అంటే ఎల్లుండి నుంచే ఈ కొత్త రూల్ అమల్లోకి వస్తుంది.
ఒకవేళ మీ కార్డును ఎవరైనా దొంగిలించి లేదా ఎవరికైనా దొరికినప్పుడు వారు దాన్నుంచి పెద్ద అమౌంట్ డ్రా చేయడానికి వీల్లేకుండా ఈ ఓటీపీ ప్రొటెక్షన్ తీసుకొచ్చింది.
రూ.10వేలు దాటితేనే
అయితే ఈ రూల్ అన్ని విత్‌డ్రాయల్స్‌కు వర్తించదు. రూ.10 వేలు, అంత కంటే ఎక్కువ క్యాష్ విత్‌డ్రా చేసుకునేవారికే ఈ రూల్.
జనవరి1 నుంచి రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల మధ్యలో 10 వేల కంటే ఎక్కువ నగదు నగదు విత్‌డ్రా చేయాలంటే ఈ ఓటీపీ విధానాన్ని ఎస్‌బీఐ ప్రవేశపెట్టింది. దాన్ని ఇప్పుడు రోజంతా విస్తరిస్తున్నట్టు ఎస్‌బీఐ ఎండీ సీఎస్ శెట్టి చెప్పారు. ఎస్‌బీఐ ఏటీఎంల్లో నగదు తీసుకునేవారికే ఈ ఓటీపీ అవసరం.
ఎలా పనిచేస్తుందంటే?
* ఎస్‌బీఐ కస్టమర్లు తమ డెబిట్ కార్డ్‌తో 10 వేలు, అంతకంటే ఎక్కువ విత్‌డ్రా చేయాలనుకుని ఆ అమౌంట్ ఎంటర్ చేస్తే రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది.
* ఓటీపీ ఎంటర్ చేసి, ఆ తర్వాత డెబిట్‌కార్డ్ పిన్ నంబర్ ఎంటర్ చేయాలి.
* అప్పుడే మీకు క్యాష్ వస్తుంది.