• తాజా వార్తలు

నిముషాల్లో లోన్ లు ఇప్పిస్తున్న స్టార్ట్ అప్ - రుపీ లెండ్... క్రెడిట్ వర్తీ నెస్ ను - సోషల్ మీడియా,

నిముషాల్లో లోన్ లు ఇప్పిస్తున్న స్టార్ట్ అప్ - రుపీ లెండ్
క్రెడిట్ వర్తీ నెస్ ను - సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అంచనా
లోన్ రంగంలో ఓ విద్వంసక ఆవిష్కరణ
 

రుణాలు ఇవ్వడం లో ఒక సరికొత్త ఆలోచన. ఇన్ స్టంట్ రుణాలు మంజూరు చేయడం లో ఒక విద్వంసక ఆవిష్కరణ. ఇంతకు ముందు భారత ఆర్థిక చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ అవసరం లో ఉన్న వారికి అత్యంత తొందరగా రుణాలు ఇవ్వాలి అనే ఒకే ఒక ఆశయం. అదే రూపీ లెండ్ . ఇది ఢిల్లీ కి చెందిన ఒక స్టార్ట్ అప్ కంపెనీ. సిద్దార్థ రవీంద్రన్ దీని సృష్టి కర్త.

నేపథ్యం:-

“2013వ సంవత్సరంలో రవీంద్రన్ యొక్క కుటుంబంలో ఒక మెడికల్ అత్యవసర పరిస్థితి వచ్చింది. అంటే వాళ్ళ కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం చాలా డబ్బులు ఖర్చు పెట్టవలసి వచ్చింది. ఆ సమయం లో ఆయనకు కొన్ని సేవింగ్ లూ మరియు ఆరోగ్య భీమా లాంటివి ఉన్నాయి కాబట్టి ఎలాగోలాగా బయట పడగలిగారు. అయితే ఆ సమయం లోనే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. తానంటే ఏదో ఒక విధంగా డబ్బు సమకూర్చుకోగలిగాడు. మరి అలా చేయలేని వారి పరిస్థితి ఏమిటి? ఎవరో ఒకరు ఆఖరి క్షణాల్లో ఉంటారు, వారి కుటుంబం డబ్బు కోసం ఎక్కడెక్కడో తిరుగుతారు, బ్యాంకుల చుట్టూ  తిరిగినా అది చాలా సుదీర్ఘమైన ప్రక్రియ. వెంటనే అప్పు పుట్టే పరిస్థితి లేదు. ప్రతీ రోజూ ఇలాంటి సందర్భాలను ఎదుర్కొనేవారు కొన్ని లక్షల సంఖ్య లో ఉంటారు. కాబట్టి వారికి ఏదో ఒక విధంగా సాయ పడాలి.”

ఇలా అనుకున్నదే తడవుగా బాగా అలోచించి మంచి ప్రణాళిక తో 2015 లో  సిద్దార్థ రవీంద్రన్ రూపీ లెండ్ ను స్థాపించారు. రూపీ లెండ్  అనేది ఒక డిజిటల్ ఫైనాన్సు కంపెనీ. కస్టమర్ లకు స్వల్ప కాలిక రుణాలను అందిస్తుంది.

ఋణం పొందడానికి ఎంత సమయం పడుతుంది?

బ్యాంకు నుండి మనం ఋణం పొందాలంటే కనీసం 7 నుండి 10 రోజులు పడుతుంది. అదే రూపీ లెండ్ లోనైతే కేవలం రెండు గంటలలోపే మీకు అప్పు లభిస్తుంది. మీరు అప్పటికే ఈ కంపెనీ యొక్క కస్టమర్ అయితే మీకు కేవలం పది నిమిషాలలో ఋణం లభిస్తుంది.

వావ్, నిజంగా అప్పులు ఇవ్వడం లో ఇది ఒక విద్వంసక ఆవిష్కరణ కదా!

ఇది ఎలా పనిచేస్తుంది?

రూ 1.3/- కోట్ల రూపాయల మూల ధనం తో ప్రారంభించబడిన ఈ కంపెనీ రుణాలు మంజూరుకు టెక్నాలజీని ఉపయోగించుకుంటుంది. వినియోగదారుల అవసరాలకు, సేల్స్కు, మేనేజ్మెంట్కు, మరియు తన కార్యకలాపాలను విస్తరించుకోవడానికి ఇది క్లౌడ్ ఆధారిత వ్యవస్థను ఉపయోగించుకుంటుంది. కస్టమర్ల సమీకరణం, రుణాలు మంజూరు అన్ని వెరిఫికేషన్ లతో సహా 100 శాతం ఆన్ లైన్ లో జరుగుతుంది. దీనికి కృత్రిమ మేధస్సు ( Artificial intelligence)  ను కూడా ఉపయోగించుకుంటారు. ఈ కంపెనీ NBFC(నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సు కంపెనీ) తో ఒప్పందం కుదుర్చుకుంది. గత 12 నెలలలో స్వల్ప కాలిక రుణాల ద్వారా సుమారు 3 కోట్ల రూపాయలను వీరు వెచ్చించారు.

రుణ గ్రహీతలు అర్హులా కాదా ఎలా తెలుసుకుంటారు?

అప్పు తీసుకుంటున్న వారు సమర్థంగా అప్పు చెల్లిస్తారా లేదా అనేది వీరికి ఎలా తెలుస్తుంది? అది కూడా నిమిషాల లేదా గంటల వ్యవధి లోనే ఎలా తెలుస్తుంది? అనే సందేహాలు చాలా మందికి ఉండవచ్చు. ఋణ గ్రహీత యొక్క ఆర్థిక సామర్థ్యాన్ని అంచనా వేయడానికి వీరు అల్గరిథంలను ఉపయోగించుకుంటారు. సోషల్ మీడియా లో వీరి కార్యకలాపాలు, వీరి స్నేహితుల యొక్క సామర్థ్యం తదితర అంశాలను లోతుగా అధ్యయనం చేసి గంటల వ్యవధి లోనే వెరిఫికేషన్ పూర్తి చేసి కేవలం రెండు గంటల్లో మీకు అప్పు ఇచ్చేస్తారు.

ఎంత అప్పు ఇస్తారు?

ప్రస్తుతానికి ఈ కంపెనీ రూ 10,000/- ల నుండి రూ 1,00,000/- వరకూ అప్పు రూపం లో ఇస్తుంది. దీనిని 30 రోజులలో చెల్లించాల్సి ఉంటుంది. అయితే భవిష్యత్ లో ఈ ఋణ పరిమితి ని రూ 50,000/- ల నుండీ రూ 10,00,000/- ల వరకూ పెంచే యోచనలో ఉంది. కాల పరిమితి కూడా రెండు నెలల నుండి ఒక సంవత్సరానికి మార్చే యోచనలో కూడా ఉంది.

వడ్డీ ఎంత ఉంటుంది?

కొత్త కస్టమర్లకు ఇది 1 శాతం వడ్డీని వసూలు చేస్తుంది, అదే రిపీటెడ్ కస్టమర్ల కైతే 0.1 శాతం వరకూ వడ్డీని ఛార్జ్ చేస్తుంది. ఈ వడ్డీ అనేది మీరు తీసుకున్న అప్పు మొత్తం మరియు కాల పరిమితి పై ఆధారపడి ఉంటుంది.

ఇది మనప్రాంతం లో అందుబాటులో ఉందా?

ఇది ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీ, ముంబై మరియు బెంగళూరు నగరాలలో మాత్రమే అందుబాటులో ఉంది. అతి త్వరలో దీనిని పూణే, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్, మరియు కోల్ కతా నగరాలకు విస్తరించే యోచనలో కంపెనీ ఉంది.

 

జన రంజకమైన వార్తలు