• తాజా వార్తలు

నెట్‌ఫ్లిక్స్ నెల‌కు రూ.5కే... ఇది నిజ‌మా!

ఆన్‌లైన్‌లో సినిమాలు చూసేవాళ్లు క‌చ్చితంగా నెట్‌ఫిక్స్ బాట‌ని ఎంచుకుంటారు. ఎందుకంటే భిన్న‌మైన సినిమాల‌కు ఈ యాప్ ఆవాసం. ముఖ్యంగా ఇంగ్లిష్ సినిమాల‌ను ఇష్ట‌ప‌డే వాళ్లు నెట్‌ఫ్లిక్స్‌నే ప్రిఫ‌ర్ చేస్తారు. అంతేకాక ప్రిమియ‌ర్ మూవీస్ అన్నీ ఈ యాప్‌లో ఉంటాయి. అయితే నెట్‌ఫ్లిక్స్ స‌బ్‌స్క్రిప్ష‌న్ కాస్త ఖ‌రీదు. అందుకే ఈ స‌బ్‌స్క్రిప్ష‌న్ తీసుకోవ‌డానికి కాస్త వెన‌కాడ‌తారు. మ‌రి 5 రూపాయిల‌కే నెల‌కు స‌బ్‌స్క్రిప్ష‌న్ దొరికితే భ‌లే ఉంటుంది క‌దా! మ‌రి ఆ ప్లాన్ ఏమిటి...ఎలా పొందాలి.. ష‌ర‌తులు ఏమైనా ఉన్నాయా? అవేంటో చూద్దామా..!

రూ.5 కే స‌బ్‌స్క్రిప్ష‌న్‌
ఎక్కువ‌మంది స‌బ్‌స్క్రైబ‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు నెట్‌ఫ్లిక్స్ కొత్త‌గా నెల‌కు రూ.5 స‌బ్‌స్క్రిప్ష‌న్ అనే ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టింది.  ఇది కేవ‌లం కొత్త యూజ‌ర్ల‌కు మాత్ర‌మే వ‌ర్తిస్తుంది.  కొత్త‌గా నెట్‌ఫ్లిక్స్‌లోకి వ‌చ్చిన వాళ్లు మాత్ర‌మే ఈ ప‌థ‌కాన్ని ఉప‌యోగించుకునే అవ‌కాశం ఉంటుంది. అందులోనూ సెల‌క్టెడ్ క‌స్ట‌మ‌ర్ల‌కు మాత్ర‌మే ఈ ఆఫ‌ర్ అని ఈ కంపెనీ ప్ర‌కటించింది.  

ఎన్నిరోజులు ఉంటుంది!
రూ.5 ఆఫ‌ర్ కేవ‌లం ఒక నెల మాత్ర‌మే ఉంటుంది. ఇది సెల‌క్ట‌డ్ న్యూ యూజ‌ర్ల కోసం ట్ర‌య‌ల్ ఆఫ‌ర్‌గా ప్ర‌వేశ‌పెట్టారు. ఇందుకోసం ఆ సెల‌క్టెడ్ క‌స్ట‌మ‌ర్లు రూ.5 చెల్లిస్తే చాలు. దీని ద్వారా నెట్‌ఫ్లిక్స్‌లో అన్ని షోలు చూసేందుకు యాక్సెస్ ల‌భిస్తుంది. ట్ర‌య‌ల్ మంత్ అయిపోయిన త‌ర్వాత పుత్ మంత్ రెంట్ చెల్లించాల్సిందిగా మీకో మెసేజ్ వ‌స్తుంది. మీ ఇష్టం ఉంటే కంటిన్యూ చేయ‌చ్చు. 

ఏ ఫ్లాట్‌ఫామ్‌లో చూడొచ్చు?
రూ.5 చెల్లించ‌డం ద్వారా నెట్‌ఫ్లిక్స్ స‌బ్‌స్క్రైబ‌ర్‌గా మారిన మీరు ఈ ప్రొగ్రామ్స్ అన్నిటిని మొబైల్‌, డెస్క్‌టాప్ దేనిలో అయినా చూసే  అవ‌కాశం ఉంది. ఒక‌వేళ యూజ‌ర్లు మొబైల్‌కే అని పెట్ట‌కుంటే మొబైల్‌కే ప‌రిమితం అవుతుంది. ఎక్కువ ప్లాన్స్ ఉన్న‌వాళ్లు అంటే రూ.499, రూ.799 ఉన్న‌వాళ్లు డెస్క్‌టాప్‌లో కూడా ప్రొగ్రామ్స్ చూసే అవ‌కాశం ఉంటుంది. 

జన రంజకమైన వార్తలు