ఇప్పుడు నడుస్తున్నదంతా ఆన్‌లైన్ పేమెంట్ యుగమే. ఎక్కడ చూసినా పేటీఎం, గూగుల్ పే బోర్డులే దర్శనమిస్తున్నాయి. క్యూఆర్ కోడ్స్ ద్వారా మనం సులభంగా పేమెంట్స్ చేసేస్తున్నాం. అయితే ప్రతి చోటా మనం ఒకటికి మించి క్యూఆర్ కోడ్స్ కనిపిస్తున్నాయి. మరి ఇలా కనిపించడం వెనుక మర్మమేంటి?
ఫీల్డ్ ఏజెంట్ ఇన్‌సెన్సిటివ్
ప్రతి క్యూఆర్ కోడ్ యాక్టివేట్ అయినప్పుడు ఫీల్డ్ ఏజెంట్లకు కమిషన్ వస్తుంది. అంతేకాదు స్టోర్ ఓనర్‌కు కూడా క్యాష్ బ్యాక్ లభిస్తుంది. అందుకే స్టోర్ ఓనర్, ఫీల్డ్ ఏజెంట్లకు డబ్బులు కమిషన్ రూపంలో ఇచ్చేందుకే ఒకటికి మించి క్యూఆర్ కోడ్స్ ప్రతి షాపులో ఉంటాయి.
మల్టీపుల్ బ్యాంక్ అకౌంట్స్
చాలామంది చిన్న వ్యాపారులకు ఒకటికి మించి బ్యాంకు ఖాతాలు ఉంటాయి. సేవింగ్స్ బ్యాంకు అకౌంట్ వేరు బిజినెస్ అకౌంట్ వేరుగా ఉంటాయి. ఇన్‌కమింగ్ ట్రాన్సాక్షన్లు ఎక్కువగా ఉంటే ఈ ట్రాన్సాక్షన్లను కరెంట్ అకౌంట్‌కు మళ్లించమని రిటైలర్ కోరితే భిన్నమైన అకౌంట్లతో ఇలా క్యూఆర్ కోడ్స్‌ను ఇస్తారు.
పీక్ అవర్స్ మేనేజ్‌మెంట్
చాలా కిరాణా షాపులను ఒకే పర్సన్ నడుపుతుంటారు. పీక్ అవర్స్‌లో కస్టమర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మల్టీపుల్ క్యూఆర్ కోడ్స్ ఉండడం వల్ల వేగంగా వ్యాపారం జరుగుతుంది. కస్టమర్లకు కూడా ఇలాంటి ఇబ్బంది ఉండదు. చిల్లర కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా రాదు. ప్రస్తుతం హైదరాబాద్ లాంటి నగరాల్లో ఈ తరహా వ్యాపారాలే చాలా ఎక్కువగా కనబడుతున్నాయి.
మేనేజ్ డౌన్‌టైమ్
కొన్ని సందర్భాల్లో బ్యాంకులు డౌన్ అవుతాయి. ఈ సమయంలో చేసే ట్రాన్సాక్షన్లు సక్సెస్ కావు. ఈ సమయంలోనే మల్టీపుల్ క్యూఆర్ కోడ్స్ ఉంటే ఒక బ్యాంకు పని చేయకపోయినా.. ఇంకో బ్యాంకు ద్వారా ట్రాన్సాక్షన్లు చేసుకోవచ్చు. దీని వల్ల వ్యాపారానికి ఎలాంటి ఆటంకం కలగదు.