షియోమి ఇండియా బ్లాక్ ఫ్రైడే సేల్ ప్రకటించింది. ఈ రోజు నుంచి ఈ నెల 29వ తేదీ వరకు ఫోన్లు, యాక్సెసరీలు కొన్నవారికి భారీగా డిస్కౌంట్‌లు ఇవ్వనుంది. |షియెమి అఫీషియల్ వెబ్‌సైట్ (ఎంఐ.కామ్) తోపాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ట్‌లోనూ ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. అవేమిటో చూద్దాం.
రెడ్‌మీ 8ఏ
ఈ ఫోన్ ధర 8,999 రూపాయలు. బ్లాక్ ఫ్రైడే సేల్‌లో 2వేలు తగ్గించి 6,999కు ఇస్తుంది.
రెడ్‌మీ 9ఐ
4జీబీ ర్యామ్, 128 జీబి ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ ధర 10,999 రూపాయలు. బ్లాక్ ఫ్రైడే సేల్‌లో 2వేలు తగ్గించి 8,999కు ఇస్తుంది.
రెడ్‌మీ నోట్ 8
4జీబీ ర్యామ్, 64 జీబి ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ ధర 12,999 రూపాయలు. బ్లాక్ ఫ్రైడే సేల్‌లో 4వేలు తగ్గించి 8,999కు ఇస్తుంది.
రెడ్‌మీ 9 ప్రైమ్
4జీబీ ర్యామ్, 128 జీబి ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ ధర 13,999 రూపాయలు. బ్లాక్ ఫ్రైడే సేల్‌లో 3వేలు తగ్గించి 10,999కు ఇస్తుంది.
రెడ్‌మీ నోట్ 9 ప్రైమ్
4జీబీ ర్యామ్, 128 జీబి ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ ధర 17,999 రూపాయలు. బ్లాక్ ఫ్రైడే సేల్‌లో 3వేలు తగ్గించి 14,999కు ఇస్తుంది.
యాక్సెసరీస్
* రెడ్‌మీ 10,000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ ఈ సేల్‌లో 699 రూపాయలకే లభిస్తుంది.
* రెడ్‌మీ బాండ్4 స్మార్ట్ బ్యాండ్ ధర 2,499. ఈ సేల్‌లో 1,999కే దొరుకుతుంది.
* ఎంఐ ఫ్లెక్స్ ఫోన్ గ్రిప్ అండ్ స్టాండ్ ధర 199 రూపాయలు. ఈ సేల్లో 149కి కొనుక్కోవచ్చు.
ఆడియో యాక్సెసరీలు
* ఎంఐ ట్రూవైర్‌లెస్ ఇయర్ ఫోన్స్ 2సీ ధర 3,499 రూపాయలు. ఈ సేల్‌లో 1200 తగ్గించి 2,299కి అమ్ముతోంది.
* ఎంఐ ట్రూవైర్‌లెస్ ఇయర్ ఫోన్స్ 2 ధర 5,499 రూపాయలు. ఈ సేల్‌లో 3వేలు తగ్గించి 2,499కి అమ్ముతోంది.
* రెడ్‌మీ ఇయర్‌బడ్స్ 2సీ 1,299కి లభిస్తాయి
* రెడ్‌మీ ఇయర్‌బడ్స్ ఎస్‌సీ 1,699కి లభిస్తాయి.