• తాజా వార్తలు

కంప్యూటర్ విజ్ఞానం. నెట్ వెబ్ సైట్ – ఒక పరిచయం

కంప్యూటర్ విజ్ఞానం. నెట్  ....ఈ పదాన్ని ఉచ్చరించడానికి ఒకింత ఉద్వేగంగా ఉన్నది.అంత ఉద్వేగం చెందవలసిన అవసరం ఏమిటి?అని  మీరు అనుకోవచ్చు.కానీ ఈ సైట్ ను మీ ముందుకు తీసుకురావడానికి గత కొద్ది  నెలలుగా మేము పడ్డ కష్టాన్ని తలచుకుంటే ఆ భావన నిజమే కదా!అనిపిస్తుంది.కానీ ఈ సైట్ నిర్మాణం కొనసాగినన్ని రోజులూ పాఠకులు మాపై చూపిన అభిమానం, నమ్మకం ముందు, అలాగే ఆ సైట్ ను లాంచ్ చేసిన తర్వాత వస్తున్న స్పందన ముందు ఎలాంటి కష్ట మైనా దిగదుడుపే అనిపిస్తుంది.ఆ విధంగా కూడా ఉద్వేగం చెందవలసిన అవసరం ఉన్నది.మమ్మల్ని ఎంతగానో అభిమానించే విజ్ఞులైన పాఠకులకు మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు తెలుపుకుంటూ ఒకసారి మా ఈ వెబ్ సైట్ గురించి కూలంకషo గా వివరించడానికే ఈ సంపాదకీయం .

 అసలు మాములుగా సాంకేతిక సాహిత్యం అంటే ఎలా ఉంటుంది?సాంకేతిక పరిజ్ఞానం లో కొత్తగా వస్తున్న మార్పులు ,కొత్త ఉత్పత్తులూ,సరికొత్త పోకడలు ,సాఫ్ట్ వేర్ లూ,హార్డ్ వేర్ లూ ఇంతేనా!నిజంగా సాంకేతిక సాహిత్యం అంటే ఇదేనా? లేక మనమే సాంకేతిక సాహిత్యాన్ని ఇలా పరిమితం చేశామా?ఈ నాడు హైదరాబాద్ లోని అమీర్ పేట్ అలాగే బెంగుళూరు లోని కోరమంగల  లో కంప్యూటర్ కోర్సులలో  శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులకు గానీ ,హైటెక్ సిటీ లోని చిన్నా ,పెద్ద కంపెనీ లలో పనిచేస్తున్న ఉద్యోగులకు గానీ అవసరమైన సాంకేతిక సాహిత్యం అందుబాటులో ఉంటుందా?ఖచ్చితంగా లేదు.ఎందుకంటే మేము ఆయా ప్రాంతాలలో తిరిగి అక్కడి ఉద్యోగుల విద్యార్థులు సాధక బాధకాలను తెలుసుకున్నాము గనుక మేము ఖచ్చితంగా చెప్పగలము.కాబట్టి నేడు ప్రాంతీయ భాషలలో  సాంకేతిక సాహిత్య పోకడలను పునః సమీక్షించవలసిన అవసరం ఉన్నది. సాంకేతిక సాహిత్యాన్ని పునర్ నిర్వచించి దానికి ఒక దశ,దిశ చూపించవలసిన అవసరం ఉన్నది.ఇలాంటి పరి స్థితి లో ఉన్న సాంకేతిక సాహిత్యాన్ని చూస్తే కొంచెం బాధ కలిగినప్పటికీ దానిని పునర్ నిర్వచించే భాగ్యం నాకు కలిగినందుకు  చాలా సంతోషం గా ఉన్నది.

ఈ సందర్భంగా నా జీవితం లో నన్ను ప్రేరణ కు గురిచేసిన రెండు వాక్యాలను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను.ప్రముఖ మీడియా దిగ్గజమైన NDTV యొక్క ప్రారంభోత్సవానికి ముందు  ముంబై లో జరిగిన ఓ అవార్డు కార్యక్రమానికి  నేను హాజరు అవ్వడం జరిగింది.దాని వ్యవస్థాపకుడైన ప్రణ య్ రాయ్ ఆ రోజు అన్న మాట ఇప్పటికీ నా మదిలో మెదలుతూ ఉంటుంది.న్యూస్ ఛానల్ లు ఇకపై ఎలా ఉండబోతున్నాయి అని అడిగిన ప్రశ్నకు ఆయన ఆసక్తి కరమైన సమాధానం ఇచ్చారు. అదేoటంటే “మీరు ఇప్పటి వరకూ ఏమీ చూడలేదు.”మొదటిసారి ఈ మాట విన్నప్పుడు కొంచెం అతిశయోక్తి గా అనిపించినా NDTV ఆవిర్భావం తర్వాత దేశం లోని మీడియా రంగం లో వచ్చిన గణనీయమైన మార్పులను గమనిస్తున్నప్పుడు అప్పుడు నేను విన్న మాట ఎంత సమంజసమో అర్థం అయింది.అలాగే ప్రముఖ సాఫ్ట్ వేర్ దిగ్గజమైన ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి గారు  నాస్ కాం సదస్సు లో పలికిన మాట కూడా నా జీవితాన్ని ఎంతో ప్రభావితం చేసింది.అదేంటంటే “మీరు ఏం ప్రారంభించినా అది సెక్సీ గా ఉండేట్లు చూసుకోండి.” ఈ మాట వింటున్నప్పుడు నేను ఒక్కసారి షాక్ కు గురయ్యాను.అరే!నారాయణ మూర్తి గారు గాంధేయ వాది కదా!తన బాత్ రూమ్ తానే శుభ్రం చేసుకునేటంత నిరాడంబరుడు కదా! అలాంటి మూర్తి గారు  ఏంటీ సెక్సీ అనే పదం వాడుతున్నారు అని అనిపించింది.కానీ నిశితం గా అలోచించి దానిలో ఉన్న నిగూఢ మైన సత్యాన్ని గ్రహించినపుడు వావ్ అనిపించింది.ఎందుకంటే ఏ కొత్త ఉత్పాదన అయినా సెక్సీ గా ఉన్నపుడు అంటే ఆకర్షణీయంగా ఉన్నప్పుడు మాత్రమే కదా వినియోగ దారుల ఆదరణ, అభిమానాలకు  నోచుకునేది!ఏవైనా కొత్త అన్వేషణలు ఆవిష్కరించ బడేటప్పుడు ఈ రెండు విషయాలూ కీలక పాత్రను పోషిస్తాయని నా అనుభవం లో తెలుసుకున్నాను.  ఈ రెండు మాటలను మనం సాంకేతిక సాహిత్యానికి అన్వయించుకుంటే ఇప్పటి వరకూ మనం సాంకేతిక సాహిత్యం లో ఏమీ చూడలేదు.మనం చూసిన దానినే సాంకేతిక సాహిత్యం అని భ్రమిస్తున్నాము.కాబట్టి ప్రాంతీయ భాషలలో సాంకేతిక సాహిత్యాన్ని ఇప్పటి వరకూ మనం చూడని రీతిలో పునర్ నిర్వచించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.అలాగే సాంకేతిక సాహిత్య పోకడలను అత్యంత సెక్సీ గా అంటే  ఆకర్షణీయంగా మార్చుకోవలసిన భాద్యత కూడా ఉన్నది.                                           

నేటి ప్రపంచం లో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించని రంగం అంటూ  ఏదీ లేదు.అలాంటప్పుడు సాంకేతిక సాహిత్యాన్ని కొన్ని అంశాల వరకే పరిమితం చేయడం ఎంత వరకూ న్యాయమో విజ్ఞులైన పాఠకులు ఆలోచించుకోవాలి.ప్రాంతీయ భాషలలో సాంకేతిక సాహిత్యం తనంతట తానే కొన్ని సరిహద్దులను లిఖించుకుంది.దీనికి కారణాలు అనేకం.సాంకేతిక సాహిత్య సరిహద్దులను సమూలంగా చెరిపి వేసి ప్రాంతీయ భాషలలో మాత్రమే కాక అసలు మొత్తం సాంకేతిక సాహిత్యాన్ని పునర్ నిర్వచించడానికి మేము కృత నిశ్చయం తో ఉన్నాము.అందుకే సాంకేతిక సాహిత్యాన్ని సమూలంగా పునర్నిర్వచిoచడం లో తొలి అడుగుగా  ఈ వెబ్ సైట్ ను మీ ముందుకు తీసుకు రావడం జరిగింది.సాంకేతిక సాహిత్యాన్ని పునర్ నిర్వచించే దిశగా మా ఈ తొలి అడుగు ఒక గేమ్ చేంజర్ (Game Changer)గానూ ,ఒక విద్వంసక ఆవిష్కరణ (Destructive Innovation)గానూ మారబోతోందని మేము కృత నిశ్చయం తో ఉన్నాము. అసలు ఈ కంప్యూటర్ విజ్ఞానం.నెట్ వెబ్ సైట్ లో ఏమేమి ఉంటాయో ఒక్కసారి పరిశీలిద్దాం.

విజ్ఞానం బార్ :-

అత్యంత అందంగా డిజైన్ చేయబడిన మా వెబ్ సైట్ హోమ్ పేజి కి సమాంతరం గా ఉండే విభాగాన్ని విజ్ఞానం బార్ అని పిలుస్తాము.దీనిలో ప్రస్తుతానికి 4 కేటగరీ లు ఉంటాయి.మరికొద్ది రోజుల్లో మరిన్ని ఆకర్షణీయమైన అంశాలను పాఠకుల ముందుకు మేము తీసుకు రాబోతున్నాము.ఇక ఇక్కడ ఉన్న నాలుగు కేటగరీ ల  విషయానికొస్తే అవి 1.క్యాంపస్ విజ్ఞానం. 2.అమీర్ పేట్ విజ్ఞానం. 3.ఉద్యోగ విజ్ఞానం. 4.టెక్ జీవన విజ్ఞానం.

1.క్యాంపస్ విజ్ఞానం :-

ఇందులో ప్రస్తుతానికి  మొత్తం నాలుగు  సబ్ కేటగరీ లు ఉంటాయి.మన దేశం లో ఉన్న ప్రముఖ I.I.T. లకు సంబందించిన సమస్త సమాచారం,అక్కడి విద్యార్థుల అనుభవాలు ఈ సబ్ కేటగరీ  లో ఉంటాయి.అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాలలోని ఇంజనీరింగ్ కళాశాలలు,వాటికి సంబందించిన లేటెస్ట్ అప్ డేట్ లూ, అక్కడి విద్యార్థుల అనుభవాలు ఇంజినీరింగ్ కళాశాలలు అనే అంశం లో ఉంటాయి.అలాగే మన తెలుగు రాష్రాల లోని ప్రముఖ విద్యా సంస్థలైన ట్రిపుల్ ఐటి ల గురించిన సమాచారం,లేటెస్ట్ అప్ డేట్ లూ,అక్కడి విద్యార్థులు భావాలూ ఈ అంశం లో ఉంటాయి.అలాగే దేశంలోని వివిధ యూనివర్సిటీ ల లో జరుగుతున్న అంశాలు అక్కడి విద్యార్థులు అనుభవాలు కూడా ఈ అంశం లో ఇవ్వడం జరుగుతుంది.ఈ సందర్భంగా C.V.R. ల గురించి ఇక్కడ ప్రస్తావించుకోవాలి.

C.V.R(కంప్యూటర్ విజ్ఞానం రిప్రజెంటేటివ్):-      

ఈ పై విషయాల కోసం ఇప్పటివరకూ   612 మంది C.V.R.(Computer Vignanam Representative) లు సుశిక్షితులై ఉన్నారని తెలియచేయడానికి మేము చాలా సంతోషిస్తున్నాము.వీరు మా ప్రతినిధులుగా పైన పేర్కొన్న విద్యాసంస్థల లో ఉంటారు.అక్కడి విశేషాలను,వారి అనుభవాలను ఈ అంశం లో వారు పంచుకుంటారు.ఈ క్యాంపస్ విజ్ఞానం అనే అంశం లో వచ్చే సమాచారమంతా మా C.V.R. లే రాస్తారు.మా ఎడిటోరియల్ బోర్డు వీటిని పర్యవేక్షిస్తుంది.ప్రస్తుతానికి ఈ C.V.R. లు వారి అనుభవాలను మరియు విశేషాలను మాత్రమే అందిస్తారు.ముందు ముందు ఈ CVR లు సాంకేతిక సాహిత్యాన్ని పునర్ నిర్వచించే ప్రక్రియలో కీలక పాత్ర పోషించ బోతున్నారు.ఈ CVR  ల ద్వారా సాంకేతిక సాహిత్యం లో వచ్చే మార్పులను చూస్తే ఎవరైనా వావ్ అని అనాల్సిందే!ప్రస్తుతానికి వీరి గురించి ఇంతకు మించి మేము చెప్పదలచుకోలేదు.   

2. అమీర్ పేట్ విజ్ఞానం:-

ఈ విభాగం గురించి మేము ప్రత్యేకంగా చెప్పుకోవాలి.మన తెలుగు రాష్ట్రాల లో ఇంజినీరింగ్ లేదా డిగ్రీలేదా పిజి  పూర్తి చేసిన విద్యార్థులు గమ్యం హైదరాబాద్ లోని అమీర్ పేట్.పోటీ పరీక్షల కోచింగ్ కోసం అలాగే సరికొత్త కంప్యూటర్ కోర్సు లు నేర్చుకొని తద్వారా ప్రముఖ బహుళ జాతి కంపెనీ లలో ఉద్యోగం సంపాదించడానికి కొన్ని వేల మంది విద్యార్థులు అమీర్ పేట్ ను తమ గమ్యం గా చేసుకుంటున్నారు.ఇక్కడ కొన్ని వందల వరకూ కంప్యూటర్ సంస్థలు ఉన్నాయి.వాటిలో విద్యార్థులు టెక్నాలజీ యందలి సరికొత్త పోకడలను నేర్చుకుంటూ ఉంటారు.అయితే వాటిలో ఎన్ని సంస్థలు విద్యార్థులకు న్యాయం చేయ గలుగుతున్నాయి?అది సరే మరి అక్కడ ఉన్న అన్ని వేల మంది విద్యార్థులు యొక్క వసతి ఎలా ఉంటుంది?అక్కడి హాస్టల్ లు,భోజన వసతి ఎలా ఉంటుంది?మోసగాళ్ళు ఎలా ఉంటారు?ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తో పాటు అక్కడి విద్యార్థులు అనుభవాలను ఈ అంశం లో పొందుపరచడం జరిగింది.అమీర్ పేట్ లో కూడా మా C.V.R. లు మొత్తం 24 మంది ఉన్నారు.ఇక్కడి సమాచారమంతా మా C.V.R. లే ఇస్తారు.మా ఎడిటోరియల్ బోర్డు కేవలం పర్యవేక్షణ మాత్రమే చేస్తుంది.  

విద్యాభ్యాసాన్ని పూర్తి  చేసుకొని కొత్తగా అమీర్ పేట్ లోనికి అడుగు పెట్ట బోయే విద్యార్ధి మా ఈ అమీర్ పేట్ కాలమ్ చూస్తే చాలు.అతనికున్న సందేహాలన్నీ పటాపంచలు అయిపోవాలి.

3. ఉద్యోగ విజ్ఞానం:-

ప్రముఖ దేశీయ, బహుళ జాతీయ కంపెనీ ల యొక్క ఉద్యోగులు మాకు C.V.R. లుగా మా వెబ్ సైట్ కు ప్రతినిధులుగా ఉంటూ మా వెబ్ సైట్ కు సమాచారం ఇస్తూ ఉంటారు.అక్కడ జరిగే ముఖ్య అంశాలను  ,వారి అనుభవాలను ఈ అంశం లో ఇవ్వడం జరుగుతుంది.క్యాంపస్ విజ్ఞానం లాగే అమీర్ పేట్ విజ్ఞానం లో కూడా మా ఎడిటోరియల్ బోర్డు కేవలం పర్యవేక్షణ మాత్రమే చేస్తుంది.ఇక్కడి వార్తలూ,అనుభవాలూ ఆయా కంపెనీ లలో పనిచేస్తున్న మా C.V.R. లే రాస్తారు.మొత్తం 98 మంది C.V.R. లు ఈ విభాగం లో మాకు ప్రతినిధులుగా ఉంటారు.

4. టెక్ జీవన విజ్ఞానం:-

మన దైనందిన జీవితం లో టెక్నాలజీ ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది?ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే ఒక  పుస్తకం కూడా సరిపోదు.అంతటి బహుళ ప్రయోజనాలను సాంకేతిక పరిజ్ఞానం నేటి ప్రజల జీవనానికి అందిస్తున్నది.నేటి సమకాలీన ప్రపంచం లో టెక్నాలజీ ఉపయోగ పడుతున్న తీరునూ,అదే విధం గా ఆయా రంగాలలో విశేష  సేవలు అందించి విజయవంతం అయిన వ్యక్తుల జీవిత సాంకేతిక అనుభవాలను, వారి అభిప్రాయాలను  ఈ అంశం లో ప్రస్తావించడం జరుగుతుంది.సమకాలీన సాంకేతిక పోకడలపై మా ప్రధాన సంపాదకులు మరియు మిగతా ఎడిటోరియల్ బోర్డు సభ్యులు యొక్క అభిప్రాయాలను కూడా ఈ అంశం లో ఇవ్వడం జరుగుతుంది.

స్లైడర్ :-  హోం పేజి లో విజ్ఞానం బార్ కు సమాంతరం గా ఒక స్లైడర్ ఉంటుంది.ఎప్పటికప్పుడు ప్రాచుర్యం లో ఉన్న వార్తలు ,లేటెస్ట్ అప్ డేట్ లు ఈ స్లైడర్ లో  కనిపిస్తాయి.

వార్తలు :-

ప్రభుత్వాల సమాచారం :-

సైట్ లో అత్యంత ప్రాముఖ్య మైన అంశాలు హోమ్ పేజ్ లో నిలువుగా ఉండే  11 అంశాలు (కాలమ్స్) ఉంటాయి.వీటిలో మొదటి నాలుగు అంశాలు వరుసగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, జాతీయం, అంతర్జాతీయం. రెండు తెలుగు రాష్ట్రాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాయి? ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు సమర్థ వంతంగా చేరవేయడానికి టెక్నాలజీ ఒక్కటే సరైన మార్గం అని మన ప్రభుత్వాలు విశ్వసిస్తున్నాయి.ఈ నేపథ్యం లో వీటికి సంబందించిన అన్ని విషయాలను ఇక్కడ పొందుపరచడం జరుగుతుంది.అలాగే జాతీయ అంతర్జాతీయ టెక్నాలజీ సంబందిత విషయాలు,జాతీయ అంతర్జాతీయ స్థాయిలలో ప్రభుత్వాలు ఏ విధంగా టెక్నాలజీ ని తమ పరిపాలనలో అమలు చేస్తున్నాయో కూడా ఈ విభాగం లో ఇవ్వడం జరుగుతుంది.

కొత్త ఉత్పత్తులు :-   

సరి కొత్త కంప్యూటర్ లూ,లాప్ టాప్ లూ,సెల్ ఫోన్ లూ,ట్యాబు లూ,ఫీచర్ లూ,సరికొత్త కంప్యూటర్ అప్లికేషన్ లకు సంబందించిన విషయాలు ఈ విభాగం లో ఉంటాయి.

సాంకేతిక విద్య,ఉపాధి,స్వయం ఉపాధి :-

సాంకేతిక విద్య కు సంబంధించి వివిధరకాల కోర్సుల వివరాలూ  వాటిని  అందించే కళాశాలల వివరాలూ వాటిపై సమగ్ర విశ్లేషణ సాంకేతిక విద్య అనే అంశం లో ఉంటాయి.సాంకేతిక విద్య ను అభ్యసించిన విద్యార్థులకు ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయి?అలాగే వివిధ కళాశాల లో జరిగే క్యాంపస్ రిక్రూట్మెంట్లు యొక్క వివరాలు సాంకేతిక ఉపాధి అనే అంశంలో ఉంటాయి.సాంకేతిక విద్య ను అభ్యసించిన అభ్యర్థులు కేవలం ఉద్యోగం మీద మాత్రమే ఆధారపడకుండా ,సాంకేతిక విద్య ద్వారా ఎటువంటి ఉద్యోగ అవసరం లేకుండా స్వయం ఉపాధి ఎలా పొంద వచ్చు?వాటి వివరాలు ఏమిటి?దీని కి బ్యాంకు లు ఏమైనా రుణాలు ఇస్తాయా?ఆదాయo ఎలా వస్తుంది?తదితర వివరాలన్నీ సాంకేతిక స్వయం ఉపాధి అనే అంశం లో ఉంటాయి.

ఈ వాణిజ్యం,సోషల్ మీడియా :-

ఈ రోజుల్లో బహుళ ప్రాచుర్యం లో ఉన్న విషయాలు ఈ వాణిజ్యం,సోషల్ మీడియా .గుండు పిన్ను దగ్గర నుండీ కార్ వరకూ అన్నీ ఆన్ లైన్ లోనే దొరుకుతున్న ఈ రోజులలో ఈ అంశానికి సంబందించిన వార్తలు ప్రచురించడం ఎంతో సమంజసం.అలాగే సోషల్ మీడియా .దీని గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏమంటుంది?టెన్త్ క్లాసు లోపు చదివే పిల్లల దగ్గరనుండీ టెర్రరిస్ట్ ల వరకూ అందరూ ఉపయోగించుకుంటున్న ఏకైక సాంకేతిక సాధనం సోషల్ మీడియా.కాబట్టి సోషల్ మీడియా సంగతులన్నీ ఇక్కడ ఉంటాయి.

సైబర్ క్రైమ్ :-

ఎక్కడ అభివృద్ది ఉంటుందో డానికి సమాంతరంగా నేరాలు కూడా పెరుగుతాయి.ఇది చారిత్రక వాస్తవం.నేటి యువత అలాగే టెక్నాలజీ వినియోగ దారులు ఎంతో సులభంగా ఆన్ లైన్ మోసగాళ్ళ బారిన పడుతున్నారు.అంతే గాక టెక్నాలజీ ని ఉపయోగించి విద్వంసకరమైన అంశాలు కూడా జరగడం నేడు మనం చూస్తూనే ఉన్నాము. వీటన్నింటి నీ సైబర్ క్రైమ్ అనే అంశం కింద ప్రస్తావిస్తే వాటికి సంబందించిన విషయాలు ఇక్కడ ఉంటాయి.సైబర్ క్రైమ్ కి సంబందించిన విషయాలు ప్రస్తావించేటప్పుడు మా మనసులో ఎక్కడో ఒక చిన్న భయం దాగి ఉన్నది.ఎందుకంటే ఏ  విషయం లోనైనా మంచికంటే చెడే ఎక్కువ ప్�