• తాజా వార్తలు

డెబ్భై సంవత్సరాల స్వతంత్ర భారతం..... ఇరవై సంవత్సరాల కంప్యూటర్ విజ్ఞానం.....

 

డెబ్భై సంవత్సరాల స్వతంత్ర భారతం

ఇరవై సంవత్సరాల కంప్యూటర్ విజ్ఞానం

మనిషి యొక్క జీవితం లో ఉండే దశలలో దేనికుండే ప్రత్యేకత దానికి ఉన్నది. అయితే టీనేజి మరియు టీనేజి తర్వాత వచ్చే దశలకు మాత్రం ఎంతో ప్రత్యేకత ఉందనేది అందరూ ఒప్పుకోవలసిన విషయం. ఒక మనిషి తన జీవిత కాలమంతటిలో టీనేజి అంటే 13 నుండి 19 సంవత్సరాల వయసులో చాలా ఉత్సాహంగా ఉంటూ తన జీవితం లో ముందు ముందు జరగబోయే మార్పులకు కావలసిన శక్తీని కూడదీసుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత వచ్చేది యుక్త వయసు. ఈ దశ లో తన భావి జీవితానికి బాటలు వేసుకుంటాడు. అసలు ఇదంతా ఎందుకు చెబుతున్నాము అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం మనందరికీ ఎంతో ఇష్టమైన కంప్యూటర్ విజ్ఞానం కూడా నేటితో టీనేజి దాటి యుక్త వయసు లోనికి అడుగు పెట్టింది. అవును సరిగ్గా ఇరవై సంవత్సరాల క్రితం ఇదే రోజు అంటే 1997 వ సంవత్సరం ఆగష్టు 15 వ తేదీన ప్రారంభమైన మన కంప్యూటర్ విజ్ఞానం అశేష తెలుగు సాంకేతిక పాఠకుల ఆదరాభిమానాలను గత పందొమ్మిది సంవత్సరాలుగా చూరగొంటూ నేడు ఇరవయ్యో పడి లోనికి అడుగు పెట్టింది.

ఒక సాంకేతిక పత్రిక ఇరవై ఏళ్ల పాటు నిలబడడం అంటే అది మామూలు విషయం కాదు అనే విషయం మనందరికీ తెలుసు. ఒక వ్యక్తి తన బాల్య దశలో ఎంత చురుగ్గా ఉంటూ ఆసక్తి తో ప్రకృతి లోని ప్రతి విషయాన్నీ పరిశీలన చేస్తాడో అలాగే కంప్యూటర్ విజ్ఞానం కూడా తన మొదటి రోజుల్లో సాంకేతిక ప్రపంచం లో వస్తున్న పెను మార్పులను నిశితం గా పరిశీలన చేస్తూ ఎప్పటికప్పుడు తెలుగు సాంకేతిక పాఠకులకు వాటిని చేరవేస్తూ వచ్చింది. ఒక వ్యక్తి తన టీనేజి లో ఎలా ఉంటాడో అలాగే మన కంప్యూటర్ విజ్ఞానం కూడా తన టీనేజి లో సాంకేతిక ప్రపంచ పోకడలలో చాలా ఉత్సాహంగా పాల్గొంటూ తన తర్వాతి దశకు కావలసిన శక్తిని అంతటినీ కూడదీసుకుని తనలో ఇముడ్చుకుని ఉన్నది. ఒక్క మాటలో చెప్పాలంటే మా కంప్యూటర్ విజ్ఞానం ఇప్పుడు మంచి విలుకాని చేతిలో ఉన్న బాణం లాగా ఉన్నది.

ఇన్నాళ్ళ పాటు మా కంప్యూటర్ విజ్ఞానాన్ని ఆదరించిన తెలుగు సాంకేతిక పాఠకులకు మా ప్రత్యేక కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నాము. సరిగ్గా ఈ రోజుతో మన కంప్యూటర్ విజ్ఞానం యుక్త వయసు లోనికి అడుగు పెట్టింది. గురి తప్పని బాణం లా ముస్తాబై సరికొత్త హంగులతో మరెంతో విలువైన సాంకేతిక సమాచారం తో పాఠకులను అలరించడానికి సిద్దం గా ఉన్నది. మా వెబ్ సైట్ కు లభిస్తున్న ఆదరణే దీనికి నిదర్శనం. సాంకేతిక పాఠకులకు ఎప్పటికప్పుడు టెక్నాలజీ అప్ డేట్ లను అందించడం లోనూ, మరియు సాంకేతిక సాహిత్యాన్ని ఒక సరికొత్త కోణం లో అందించడం లోనూ కంప్యూటర్ విజ్ఞానం ఎప్పుడూ ముందు ఉంటుంది. ఇకముందు కూడా మమ్మల్ని ఇలాగే ఆదరిస్తారని ఆశిస్తూ

“ఇన్నాళ్ళూ మమ్మల్ని ఆదరించిన అశేష తెలుగు సాంకేతిక సాహిత్య పాఠకులకు మా ఇరవయ్యో వార్షికోత్సవ కానుకగా 

మా మొదటి అంటే 1997 ఆగష్టు సంచిక ను మరియు 19వ వార్షికోత్సవ సంచికను ఉచితంగా గా అందిస్తున్నాం."

మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే డౌన్ లోడ్ చేసుకోండి

మొదటి అంటే 1997 ఆగష్టు సంచిక - Download 19వ వార్షికోత్సవ సంచిక - Download