మూడున్నర శతాబ్దాల క్రితం కృష్ణా తీర ప్రాంతాన్ని పరిపాలించిన జమీందార్ శ్రీ వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు పేరు ప్రతిబింబించేలా శ్రీ వాసిరెడ్డి విద్యా సాగర్ గారిచే అదే ప్రాంతంలో ఏర్పాటు చేసిన కళాశాల వాసిరెడ్డి వేంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ .అదే VVIT .నవ్యాంధ్ర రాజధాని గుంటూరు నగరానికి అతి సమీపంలో నంబూరు గ్రామంలో 9 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయబడింది ఈ కళాశాల. అనతి కాలం లోనే రాష్ట్రం లోని ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలల్లో ఒకటిగా నిలిచింది. ఇక్కడ తమ పిల్లలను చదివించడం ఎంతో భద్రమైన అంశం గా తలిదండ్రులు భావిస్తారంటే కళాశాల యాజమాన్యం నేటి విద్యా పోకడలపై ఎంత ఎరుక తో ఉందొ తెలిసి పోతుంది.అంతెందుకు గుంటూరు,మంగళగిరి పరిసర ప్రాంతాల లోని విద్యార్థినుల తలిదండ్రులకు బెస్ట్ ఛాయస్ VVIT అంటే దాని ప్రత్యేకత ఏంటో అర్థం చేసుకోవచ్చు.అది మాత్రమే కాదు ఇక్కడ చదివిన చాలా మంది విద్యార్థులు ప్రముఖ బహుళ జాతి కంపెనీ లలో లక్షల వేతనాలతో ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ కళాశాల గురించి, అక్కడ ఉన్న కోర్సుల గురించి,సాంకేతిక విద్యకు సంబంధించి అక్కడ జరిగే అంశాల గురించీ మనం తర్వాతి వ్యాసాలలో చర్చిద్దాం. అక్కడ ఉన్న మన కంప్యూటర్ విజ్ఞానం ప్రతినిధులకు ఆల్ ది బెస్ట్ చెబుతూ .......................................కంప్యూటర్ విజ్ఞానం. T.భావన C.V.R |