• తాజా వార్తలు

లాక్‌డౌన్ వేళ మీ చిన్నారుల‌ను అల‌రించే ఫేస్‌బుక్ మెసెంజ‌ర్ కిడ్స్‌

క‌రోనా లాక్‌డౌన్‌తో పిల్ల‌ల‌కు స్కూళ్లు లేవు. బ‌య‌టికెళ్లే ఛాన్స్ లేదు కాబ‌ట్టి ఫ్రెండ్స్‌ను క‌లిసే వీలూ లేదు. ఇలాంటి పిల్ల‌ల‌ను అల‌రించడానికి, వారిని ఫ్రెండ్స్‌తో టీచ‌ర్ల‌తో క‌నెక్ట్ చేయ‌డానికి  సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ఫేస్‌బుక్.. మెసెంజర్‌ కిడ్స్‌ను గురువారం ప్రవేశపెట్టింది. 

పూర్తిగా పిల్ల‌ల కోసమే
ఫేస్‌బుక్ అనేది ఓ స‌ముద్రం. అందులో మంచీ చెడూ రెండూ ఉంటాయి. పెద్ద‌వాళ్లు వాడే మెసెంజ‌ర్ యాప్‌నే పిల్ల‌లు వాడితే  వారిని మానిట‌ర్ చేసే అవ‌కాశాలు త‌క్కువ‌.  అందుకే పిల్ల‌ల‌ను ఎడ్యుకేట్ చేస్తూనే వాళ్ల‌ను త‌ప్పుదోవ ప‌ట్ట‌కుండా చూసే అద‌న‌పు ఫీచ‌ర్ల‌తో ఈ ఫేస్‌బుక్ మెసెంజ‌ర్ కిడ్స్‌ను తీసుకొచ్చిన‌ట్లు సోష‌ల్ మీడియాం లెజెండ్ ప్ర‌క‌టించింది.  

పిల్ల‌ల్ని మానిట‌ర్ చేయొచ్చు
అందుకే తల్లిదండ్రుల పర్యవేక్షణలో మెసెంజర్‌ యాప్‌ ద్వారా పిల్లలు తమ స్నేహితులతో కనెక్ట్‌ కావడానికి ఇది ఉపయోగపడుతుందని ఫేస్‌బుక్‌ తెలిపింది. లాక్‌డౌన్‌తో స్కూళ్లు, ఆఫీస్‌లు క్లోజ్ అవ‌డంతో డిజిట‌ల్ ఫ్లాట్‌ఫామ్‌ల మీద ఇన్ఫ‌ర్మేష‌న్ షేర్ చేసుకోవ‌డం పెరిగింద‌ని, ఈ ప‌రిస్థితుల్లో  పిల్లలు కూడా స్నేహితులు, టీచ‌ర్ల‌తో కనెక్ట్‌ అయ్యేందుకు మెసెంజర్‌ కిడ్స్‌ ఉపయోగపడుతుందని వివరించింది. ఇందులో పిల్ల‌లు మెసెంజ‌ర్‌లో ఏం చేస్తున్నారో త‌ల్లిదండ్రులు ప‌ర్య‌వేక్షించే అవ‌కాశం ఉంద‌ని ఫేస్‌బుక్ చెప్పింది.  

సూప‌ర్‌వైజ‌ర్ ఫ్రెండింగ్‌
ఈ ఫీచ‌ర్‌ను ప్ర‌స్తుతం  అమెరికాలో స్టార్ట్ చేసింది. ఇందులో విశేష‌మేమిటంటే పిల్ల‌లు త‌మ‌కు మెసెంజ‌ర్‌లో వ‌చ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్‌, కాంటాక్ట్స్‌ను అంగీక‌రించాలంటే పేరెంట్స్ అనుమ‌తి త‌ప్ప‌నిస‌రి. పేరెంట్ డాష్‌బోర్డు యాక్సెప్ట్‌, రిజెక్ట్‌, రిమూవ్ కాంటాక్ట్స్ అనే మూడు ఆప్ష‌న్లు ఉంటాయి. మ‌న పిల్ల‌ల‌కు అవ‌స‌రమా లేదా తేల్చుకుని త‌ల్లిదండ్రులే ఏదో ఆప్ష‌న్ ఇవ్వ‌చ్చు. 

అప్రూవ్ అద‌ర్ అడ‌ల్ట్స్‌
ఇక రెండ్ కొత్త ఫీచ‌ర్ ఏమిటంటే పేరెంట్స్ ఇత‌ర అడ‌ల్ట్స్ అంటే టీచ‌ర్ల‌ను పిల్లల గ్రూప్ చాట్‌లోకి అనుమ‌తించ‌డం. ఇక మూడో ఫీచ‌ర్ ప్ర‌స్తుతానికి యూఎస్‌, కెనడా, లాటిన్ అమెరికా దేశాల్లో వ‌చ్చింది. దీనిలో మీ పిల్ల‌ల పేరు, ఫొటో ఆ స‌ర్కిల్‌లో ఉన్న ఇత‌ర కాంటాక్ట్‌ల‌కు కనిపించాలా లేదా అనేది త‌ల్లిదండ్రులే డిసైడ్ చేయొచ్చ‌. 

 ఇప్ప‌టికైతే ఐవోఎస్‌లోనే
యువ స‌లహాదారులు, స‌ల‌హాదారుల మండ‌లి, చైల్డ్ డెవ‌ల‌ప్‌మెంట్‌, మీడియా, ఆన్‌లైన్ సేఫ్టీ నిపుణుల స‌ల‌హాలు తీసుకుని దీన్ని రూపొందించిన‌ట్లు ఫేస్‌బుక్ ప్ర‌కటించింది. ప్రస్తుతం ఈ ఫేస్‌బుక్ మెసెంజ‌ర్ కిడ్స్ యాప్‌ను యాపిల్‌ యాప్‌ స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ యూజ‌ర్లు మాత్రం వీకెండ్ వ‌ర‌కూ ఆగాల్సిందే. 

జన రంజకమైన వార్తలు