ఫాల్స్ న్యూస్, ద్వేషభావంతో కూడిన పోస్ట్‌లు, ట్రాల్ పేరిట ఒకరినొకరు దుమ్మెత్తిపోసుకోవడం, హీరోలు, పొలిటికల్ పార్టీల అభిమానులు అవతలి పార్టీ లేదా హీరో ఫ్యాన్స్‌ను ట్రాల్ చేయడానికి అంటూ ఎలాంటి కంటెంట్ పడితే అలాంటి దాన్ని పోస్ట్ చేయడం ఫేస్బుక్లో ఇప్పుడు అందరూ చూస్తున్నారు. దీనికితోడు లేడీస్‌ను హెరాస్ చేసేలా, ఏదైనా ఒక వర్గం మనోభావాలు దెబ్బతీసేలా పోస్ట్‌లు పెట్టడం, కామెంట్లు, షేర్లు చేయడం అన్నీ ఇకపై ప్రమాదకరం కాబోతున్నాయి. ఎందుకంటే ఫేస్బుక్లో ఎలాంటి కంటెంట్ పోస్ట్ చేయకూడదో ఫేస్బుక్ కొన్ని రూల్స్ పెట్టింది.
ఫేస్బుక్లో ఎలాంటి పోస్ట్‌లు పెట్టకూడదంటే..
పిల్లల నగ్నచిత్రాలు
పిల్లల నగ్నచిత్రాలను ఫేస్బుక్లో పోస్ట్ చేయకూడదు. వాళ్లు ఎంత చిన్నవాళ్లయినా, ఆఖరికి మీ పిల్లల ఫొటోలయినా సరే వంటి మీద బట్టలు లేకుండా ఉన్న ఫొటోలుపోస్ట్ చేయకూడదు. ఎందుకంటే వాటిని ఎవరైనా మిస్యూజ్ చేసే ప్రమాదం ఉంది.
ఆడవారి చనుమొనలు కనిపించే ఫొటోలు, వీడియోలు
ఆడవారి చనుమొనలు (నిపిల్స్) కనిపించే ఫొటోలుగానీ వీడియోలుగానీ అస్సలు పోస్ట్ చేయకూడదు. మూడేళ్ల వయసు దాటిన అమ్మాయిల నుంచి ఎవరికైనా ఇది వర్తిస్తుంది. కానీ తల్లిపాలివ్వడాన్ని ప్రోత్సహించే చిత్రాలకు వెసులుబాటు ఇచ్చారు.
అనవసర నిందారోపణలు వద్దు
ఎవరినీ అబద్దాలకోరుగా చిత్రీకరించొద్దు. ఏదైనా విషాదంలో బాధితుడు డబ్బులు తీసుకుని నిజాన్ని చెప్పకపోతే దాన్ని ఫేస్బుక్లో పోస్ట్ చేయకూడదు.
నేరాంగీకారం చేయకండి
ఏదైనా క్రిమినల్ యాక్టివిటీ జరిగితే దాని గురించి చర్చింవచ్చు. కానీ ఆ నేరం ఫలానా వాళ్లే చేశారని మీరు నిర్ధారించేలా పోస్ట్‌లు పెట్టకండి.
డ్రగ్స్ వ్యవహారాలు వద్దు
మత్తుపదార్థాలు (డ్రగ్స్) కొనుగోలు, అమ్మకాలకు ఫేస్‌బుక్‌ను ఫ్లాట్‌ఫారంగా వాడుకోకండి. అసలు డ్రగ్స్ అమ్మేవాళ్ల గురించి కొనేవాళ్ల గురించి కానీ అడుగుతూ చర్చించకండి.
క్రూరంగా ఉండకండి
ఎవరైనా వ్యక్తుల శారీరక, మానసిక లోపాలు, వ్యాధులు రోగాల గురించి కానీ హేళన చేస్తూ కామెంట్లు, పోస్ట్‌లు పెట్టకండి. ఎవరైనా అకాల మరణంచెందినప్పుడూ నెగిటివ్‌గా స్పందించినా ఆ పోస్ట్ తీసివేస్తామని ఫేస్బుక్ హెచ్చరిస్తోంది.
* నగ్నంగా ఉన్న పిరుదుల ఫొటోలు పెట్టకండి.
* ఎన్నికల తర్వాత జరిగే గొడవల ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేయకండి.
* హాస్యం,వ్యంగ్యం లేదా ఎడ్యుకేషన్ పర్పస్ అయితే తప్ప సెక్సువల్ యాక్టివిటీ గురించిన పోస్ట్‌లు పెట్టకండి.
* విద్వేషాలను రగిలించే ప్రసంగాలు, ఫొటోలు పెట్టకూడదు.