• తాజా వార్తలు

ఫేస్‌బుక్ లైక్స్‌ని హైడ్ చేయ‌నుందా..! ఎందుక‌లా చెప్మా!

సోష‌ల్ మీడియాను ఉప‌యోగించేవాళ్లు ఫేస్‌బుక్ వాడ‌కుండా ఎవ‌రూ ఉండ‌రు. స్నేహితులు, సన్నిహితుల‌తో క‌నెక్ట్ అయి ఉండ‌డం కోసం ఫేస్‌బుక్‌ను మించిన ఫ్లాట్‌ఫాం మ‌న‌కు దొర‌క‌దు. అయితే ఫేస్‌బుక్‌లో మ‌నం ప్ర‌ధానంగా చూసే ఫీచ‌ర్ లైక్స్‌.. ఏదౌనా ఫొటో పెట్టినా లేదా కామెంట్ చేసినా వెంట‌నే మ‌న‌కో లైక్ వ‌స్తుంది. అయితే ఈ లైక్‌ల‌ను రాబోయే రోజుల్లో ఫేస్‌బుక్ హైడ్ చేస్తుందా? ఎందుకో తెలుసుకోవాల‌ని ఉందా!

ప్ర‌పోజ‌ల్ వ‌చ్చేసింది
ఫేస్‌బుక్‌లో ప్ర‌తిరోజూ న‌మోద‌య్యే కోట్లాది లైక్స్‌ని హైడ్ చేయాల‌ని ఇటీవ‌లే ఎఫ్‌బీ ప్ర‌పోజ‌ల్ చేసింద‌ట‌. ఇటీవ‌ల ఆస్ట్రేలియా ఫేస్‌బుక్ యూజ‌ర్ల నుంచి వ‌చ్చే లైక్స్‌ను ఎఫ్‌బీ హైడ్ చేసింది. ఇది కేవ‌లం ట్ర‌యిల్ మాత్ర‌మేన‌ని.. త్వ‌ర‌లో ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ హైడింగ్ జ‌రుగుతుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి.  చాలామంది వ్య‌క్తులు ఫేస్‌బుక్లో వ‌చ్చిన లైక్స్‌ని బ‌ట్టి వారి పాపులారిటీని లెక్కేసుకుంటారు.  ఇలాంటి వారికి తాజా న్యూస్ పెద్ద షాకే. ఇక‌పై వేరే వాళ్ల‌కు వ‌చ్చిన లైక్స్‌ని, రియాక్ష‌న్స్‌ని మ‌నం చూడ‌లేం. వారి పోస్టుల‌కు వ‌చ్చిన లైక్స్‌ని మాత్రమే చూడ‌గ‌ల‌గుతారు. 

కాంపిటేష‌న్ త‌గ్గించ‌డానికా!
ఫేస్‌బుక్‌ని ఏదో కాంపిటేషన్‌కి వేదిక‌గా చూడాల‌నుకోవ‌ట్లేద‌ని ఆ సంస్థ తెలిపింది. అందుకే లైక్స్ మీద దృష్టి పెట్టామ‌ని త్వ‌ర‌లో ఈ లైక్స్ కాంపిటేష‌న్‌కు తెర‌ప‌డుతుంద‌ని కంపెనీ ప్ర‌తినిధులు చెబుతున్నారు. కానీ ఈ కొత్త నిబంధ‌న అమ‌లు చేస్తే యూజ‌ర్లు ఎలా రియాక్ట్ అవుతారోన‌ని ఎఫ్‌బీ ఆందోళ‌న‌గా ఉంది. లైక్స్ లేక‌పోతే ఆ ప్ర‌భావం జ‌నాల‌పై మాన‌సికంగా కూడా ఉంటుంద‌ని కూడా కొన్ని స‌ర్వేలు చెబుతున్నాయి. ఈ నేప‌థ్యం ఎఫ్‌బీ ఎలా స్పందిస్తుంద‌నేది ఆస‌క్తిక‌రం. 

జన రంజకమైన వార్తలు