• తాజా వార్తలు

ఫేక్ అకౌంట్లు, పేజీలు, గ్రూపులను తొలగిస్తున్న ఫేస్‌బుక్ , నెక్స్ట్ ఏంటి ?

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ఏరివేత కార్యక్రమాన్ని షురూ చేసింది. ఇందులో భాగంగా వాడకుండా అలాగే తప్పుడు సమాచారంతో నడుపుతున్న ఫేక్ అకౌంట్లు, పేజీలు, గ్రూపులను తొలగిస్తోంది. ఇప్పటికే ఎన్నో ఫేక్ అకౌంట్లు, పేజీలను తొలగించింది. థాయిలాండ్, యూఎస్‌లో ఫేక్ అకౌంట్లపై అనుమానాస్పద అకౌంట్లపై కన్నేసిన ఫేస్‌బుక్ తమ ప్లాట్ ఫాంలైన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లలో మల్టీపుల్ పేజీలను తొలగిస్తోంది. ఇప్పటికే థాయ్‌లాండ్, రష్యా, ఉక్రేయిన్, హుండారస్ కేంద్రంగా నిర్వహించే ఫేక్ అకౌంట్లను ఫేస్‌బుక్ తొలగించింది. ఇప్పటివరకూ 12 ఫేస్ బుక్ అకౌంట్లు, 10 పేజీలను డిలీట్ చేసింది. 

కాగా తొలగించిన అకౌంట్లలో క్యాంపియన్స్ మధ్యలో ఎలాంటి లింక్స్ గుర్తించలేదు. కానీ, క్రియేట్ చేసిన అన్ని రకాల నెట్ వర్క్ అకౌంట్లు ఇతరులను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని గుర్తించినట్టు సైబర్ సెక్యూరిటీ పాలసీ హెడ్ నాథనెయిల్ గ్లెచర్ తెలిపినట్టు ఫేస్‌బుక్ బ్లాగ్ పోస్టులో పేర్కొంది. ఉక్రేయిన్‌లో ఎన్నికలకు ముందు ఫేస్‌బుక్ 18 అకౌంట్లతో పాటు 9 పేజీలు, 3 గ్రూపు పేజీలను తొలగించింన సంగతి విదితమే. 

ఈ ఏరివేత కార్యక్రమాన్ని ముందుగా రష్యాలో ప్రారంభించి ఆ తర్వాత ఉక్రేయిన్‌పై తన దృష్టిని పెట్టింది. ఉక్రేయిన్లో రష్యా కేంద్రంగా నడిచే 83 ఫేస్ బుక్ అకౌంట్లు, 2 పేజీలు, 29 గ్రూపులు, 5 ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లను తొలగించినట్టు ఫేస్ బుక్ తెలిపింది. మొత్తంగా దేశీయ కేంద్రీకృత అనాధికార యాక్టివిటీ ఉన్న హోండరస్ ప్రాంతంలో నిర్వహించే 181 అకౌంట్లు, 1,488 ఫేస్‌బుక్ పేజీలను తొలగించినట్టు ఫేస్‌బుక్ పేర్కొంది. కాగా ఈ ఏరివేత కార్యక్రమం ఇతర దేశాలకు కూడా విస్తరించే అవకాశంపై  ఫేస్‌బుక్ ఇంకా ఎలాంటి సమాచారాన్ని ఇవ్వలేదు. అయితే త్వరలోనే దీనిపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది. 

జన రంజకమైన వార్తలు