• తాజా వార్తలు

పాత ఆర్టిక‌ల్స్ షేర్ చేస్తున్నారా.. అయితే ఫేస్‌బుక్ మిమ్మ‌ల్ని హెచ్చ‌రిస్తుంది

ఫేస్‌బుక్‌లో పాత ఆర్టిక‌ల్స్ మీకు క‌నిపిస్తుంటాయి.  ఏడాది కింద‌ట‌, రెండేళ్ల కింద‌ట మీరు ఇది షేర్ చేశారు అంటూ ఫేస్‌బుక్‌లో వ‌స్తుంది. దాన్ని మీకు నచ్చితే మ‌ళ్లీ షేర్ చేస్తుంటారు. అయితే ఇక‌పై ఇలా చేసేట‌ప్పుడు ఫేస్‌బుక్ అది పాత ఆర్టిక‌ల్ అని మీకు మ‌రోసారి గుర్తు చేస్తుంది.

ఎందుకంటే..
మీరు పాత ఆర్టిక‌ల్ పెట్టిన‌ప్ప‌టికి, దాన్ని మ‌ళ్లీ షేర్ చేసేట‌ప్ప‌టికి ఏడాదో, రెండేళ్లో, మూడేళ్లో గ‌డిచిపోయి ఉంటాయి.  అప్ప‌టికి ఇప్ప‌టికీ ప‌రిస్థితులు మారిపోయి ఉండొచ్చు.  ఆ పోస్ట్‌లోని వివ‌రాలు ఇప్ప‌టి ప‌రిస్థితికి పూర్తి భిన్నంగా ఉండొచ్చు. ఉదాహ‌ర‌ణ‌కు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు సంబంధించి ఏడాది కింద‌ట మీరో ఆర్టిక‌ల్ షేర్ చేయ‌డ‌మో, పోస్ట్ చేయ‌డ‌మో చేసి ఉండొచ్చు. అయితే ఇప్పుడు సుశాంత్ జీవించి లేరు. మీరు పాత ఆర్టిక‌ల్‌ను షేర్ చేస్తే అందులో ఆయ‌న బ‌తికున్న‌ట్లే ఉంటుంది. ఇది త‌ప్పు స‌మాచారం ఇచ్చిన‌ట్లు ఉంటుంద‌ని ఫేస్‌బుక్ భావిస్తుంది. అందుకే అది మిమ్మ‌ల్ని పాత ఆర్టిక‌ల్ షేర్ చేసేట‌ప్పుడు ఇది పాత ఆర్టిక‌ల్ అని మీకు మ‌రోసారి గుర్తు చేస్తుంద‌ట‌. 


 

జన రంజకమైన వార్తలు