• తాజా వార్తలు

ఎమర్జెన్సీ లలో ఫేస్‌బుక్ ద్వారా ఫండ్ రైజ్ చేయ‌డం ఎలా?

ఏదైనా విప‌త్త‌లు ఏర్ప‌డిన‌ప్పుడు.. ఏదైనా ప్ర‌మాదాలు సంభ‌వించినప్పుడు నిధులు స‌మీక‌రించి న‌ష్ట‌పోయిన వారిని ఆదుకోవ‌డం అనేది సాధార‌ణంగా జ‌రిగే ప్ర‌క్రియే. ఒక‌ప్పుడు ఇంటింటికి వెళ్లి ఇలా నిధులు క‌లెక్ట్ చేసేవాళ్లు. కానీ సోష‌ల్ మీడియా పెరిగిన త‌ర్వాత నిధుల సేక‌ర‌ణ రూపే మారిపోయింది. జ‌స్ట్ కొన్ని స్టెప్‌ల సాయంతో మ‌నం ఫండ్స్‌ను రైజ చేయచ్చు. ఈ విష‌యంలో ఫేస్‌బుక్ ముందంజ‌లో ఉంటుంది.  మరి ఎఫ్‌బీ ద్వారా నిధుల‌ను ఎలా సేక‌రించాలంటే...

ఏం చేయాలంటే..
ఫేస్‌బుక్‌లో ఫండ్ రైజింగ్ చేయ‌డానికి కొన్ని ఆప్ష‌న్లు ఉన్నాయి. ముందుగా ప‌ర్స‌నల్ ఫండ్ రైజ‌ర్‌లో పాల‌సీల‌ను మీరు జాగ్ర‌త్త‌గా చ‌దివి ఓకే చేయాలి. ఫేస్‌బుక్ ద్వారా మీకు వ‌చ్చే ఫండ్స్‌ను సేక‌రించే థ‌ర్డ్ పార్టీ పేమెంట్ ప్రాసెస‌ర్ 6.9, 0.0 డాల‌ర్లు డొనేష‌న్ ఫీజుల రూపంలో తీసుకుంటుంది. అయితే దీనిపై ఎలాంటి ట్యాక్స్‌లు ప‌డ‌వు. మీరు ఎంత అమౌంట్ రైజ్ చేయాల‌నుకుంటున్నారో గోల్ సెట్ చేసుకోవాలి.  ముందుగా ఫేస్‌బుక్ సేఫ్టీ చెక్ సెక్ష‌న్‌కు వెళ్లాలి. అందులో డిజాస్ట‌ర్ ఆప్ష‌న్‌ను సెల‌క్ట్ చేసుకోవాలి.  లేక‌పోతే మీకు ఫండ్ రైజ్ చేయాల‌నుకుంటున్న ఈవెంట్ గురించి సెల‌క్ట్ చేయాల్సిన అవ‌స‌రం ఉంది.   పేజీకి కుడి చేతి భాగంలో మీకు ఫండ్ రైజ్ చేసి ఎవ‌రికి డొనేట్ చేయాల‌నుకుంటున్నారో వారికి సంబంధించిన సైడ్‌బార్ ఉంటుంది.  డిజాస్ట‌ర్ మెనేజ్‌మెంట్ కోసం ఫండ్ రైజ్ చేస్తే మీరు ప్ర‌త్యేక కార‌ణాలు మెన్ష‌న్ చేయ‌క్క‌ర్లేదు. మీ సొంత ఫండ్ రైజ‌ర్ క్రియేట్ చేసి రైజ్ మ‌నీ ఆప్ష‌న్ మీద క్లిక్ చేయాలి. 

ఫ్రెండ్ లేదా నాన్ ప్రాఫిట్‌
స్సేహితుల కోసం లేదా నాన్ ఫ్రాఫిట్ కోసం ఫండ్ రైజ్ చేస్తే ఫ్రెండ్ అనే ఆప్ష‌న్‌ను క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీకు టాప్ కార్న‌ర్‌లో ఒక సెర్చ్‌బార్ ఉంటుంది. దానిలో మీరు ఏ స్నేహితుడు కోసం ఫండ్ రైజ్ చేస్తున్నారో వారిని వెతికి సెల‌క్ట్ చేయాల్సి ఉంటుంది. ఫండ్ రైజ‌ర్‌కు  ఒక టైటిల్ పెట్టాలి. కేట‌గిరి సెలెక్ట్ చేయాలి.  ఒక పిక్చ‌ర్ యాడ్ చేయాలి. ఒక ఎండ్ డేట్‌ను సెట్ చేయాలి. గోల్ అమౌంట్ కూడా మెన్ష‌న్ చేయాలి. మీ ఫండ్ రైజ‌ర్‌కు ఒక డిస్క్రిప్ష‌న్ కూడా యాడ్ చేయాలి. 


 

జన రంజకమైన వార్తలు