• తాజా వార్తలు

ఫేస్‌బుక్ కెమెరాతో ఇక మీ సొంత యానిమేటెడ్ జిఫ్ క్రియేట్ చేసుకోవ‌చ్చు..

 ఫేస్‌బుక్ కొత్త ట్రెండ్‌ను అందిపుచ్చ‌కుంది. ఎమోజీలు, ఆ త‌ర్వాత స్టిక్క‌ర్లు.. ఛాటింగ్‌ను ఫ‌న్‌గా మార్చేస్తే ఇప్పుడు కొత్త‌గా యానిమేటెడ్ జిఫ్‌లు సంద‌డి చేస్తున్నాయి.  గ‌త నెల‌లో కామెంట్స్ సెక్ష‌న్‌లో జిఫ్ ఇమేజెస్ యాడ్ చేసిన ఫేస్‌బుక్ ఇప్పుడు ఈ ఫీచ‌ర్‌ను కెమెరాకు కూడా తీసుకొచ్చింది. 
జిఫ్ ఇమేజ్‌లంటే..  
స్మార్ట్‌ఫోన్లు రాక‌ముందు క‌ల‌ర్ స్క్రీన్లు ఉన్న హైఎండ్ ఫీచ‌ర్ ఫోన్లు వాడిన‌వారంద‌రికీ జిఫ్‌ల గురించి తెలిసే ఉంటుంది. ఇమేజ్ స్టేబుల్‌గా ఉండ‌కుండా క‌దులుతూ ఉండే ఈ జిఫ్‌ను కాస్త యానిమేటెడ్‌గా మార్చి యానిమేటెడ్ జిఫ్‌గా రూపొందించారు. ఫేస్‌బుక్ యాప్‌లో కెమెరాను టాప్ చేయ‌గానే న్యూ అని జిఫ్ ఫీచ‌ర్ క‌నిపిస్తుంది. లేదంటే రైట్‌కే స్వైప్ చేసినా వ‌స్తుంది. యానిమేటెడ్ జిఫ్ ఆప్ష‌న్‌తో ఫొటో తీస్తే మీ సొంత యానిమేటెడ్ జిఫ్‌ను క్రియేట్ చేసుకోవ‌చ్చు.  చిన్న‌పాటి వీడియోను కూడా తీసుకోవ‌చ్చు. దీన్ని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయొచ్చు. వేరే ఫ్లాట్‌ఫామ్స్‌పై షేర్ చేసుకోవ‌చ్చు కూడా.
ప్ర‌స్తుతం ఐవోఎస్ యూజర్ల‌కే 

నెక్స్ట్ వెబ్ సోష‌ల్ మీడియా డైరెక్ట‌ర్ మాట్ న‌వ‌ర్రా ఈ ఫీచ‌ర్‌ను క‌నిపెట్టాడు.  అయితే ఈ ఫీచ‌ర్ ప్ర‌స్తుతం ఐవోఎస్ డివైస్‌ల‌కే అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్‌లో ప్ర‌స్తుతానికి లేదు.  

జన రంజకమైన వార్తలు