• తాజా వార్తలు

ఫేస్‌బుక్ అంటే విరక్తి కలుగుతోందా, అయితే ఇలా పూర్తిగా డిలీట్  చేయండి

మీ ఫేస్‌బుక్ అకౌంట్‌ను శాస్వుతంగా డిలీట్ చేసేద్దామని నిర్ణయించుకున్నారా..? అయితే మీరో విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి గనుక ఫేస్‌బుక్ అకౌంట్‌ను డిలీట్ చేసినట్లయితే మళ్లీ అదే అకౌంట్‌ను రీయాక్టివేట్ చేసుకోవటం కుదరదు. కాబట్టి, మీ అకౌంట్‌ను డిలీట్ చేసుకునే ముందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి. మీ ఫేస్‌బుక్ అకౌంట్‌ను శాస్వుతంగా క్లోజ్ చేద్దామని నిర్ణయం తీసుకున్నట్లయితే ఈ ప్రొసీజర్‌ ఫాలో అవ్వండి..

ముందుగా మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వండి.
ఆ తరువాత మెనూలోని సెట్టింగ్స్‌ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి.
General Account Settings'లో క్రింద కనిపించే 'Download a copy of all your Facebook data' ఆప్షన్ పై క్లిక్ చేయండి.
ఇప్పుడు https://www.facebook.com/help/delete_account  లింక్‌లోకి వెళ్లి Delete My Account option పై క్లిక్ చేయండి.
ఇలా చేసిన తరువాత Final Confirmation నిమిత్తం మీ ఫేస్‌బుక్ అకౌంట్ పాస్‌వర్డ్‌తో పాటు అక్కడ డిస్‌ప్లే అయ్యే captcha codeను ఎంటర్ చేయవల్సి ఉంటుంది.
Final Confirmation పూర్తి అయిన వెంటనే 14 రోజుల‌లోపు మీ అకౌంట్‌ డిలీట్ కాబడుతుంది. ఈ 14 రోజుల్లోపు మీరు ఎప్పుడైనా మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లోకి లాగినై deletion requestను క్యాన్సిల్ చేసుకోవచ్చు.

జన రంజకమైన వార్తలు