• తాజా వార్తలు

ఆన్‌లైన్ క్లాసుల కోసం ఫోన్ కొనాలా.. ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ డేస్ సేల్‌పై ఓ లుక్కేయండి

లాక్‌డౌన్‌లోఆన్‌లైన్ క్లాసెస్ అంటూ పిల్ల‌లంద‌రికీ ఇప్పుడు సెల్‌ఫోన్ త‌ప్ప‌నిస‌రిగా మారింది. ఒక‌వేళ మీ పిల్ల‌ల అవ‌స‌రాల‌కు కూడా సెల్‌ఫోన్ కొనాల‌నుకుంటున్నారా? అయితే ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ సేల్ న‌డుస్తోంది. నిన్న‌టి నుంచి మొద‌లైన ఈ సేల్ నాలుగు రోజులుపాటు (జూన్ 12 వ‌ర‌కు) ఉంటుంది. శాంసంగ్ సెల్‌ఫోన్ల‌తో పాటు ఇత‌ర ప్రొడ‌క్ట్‌ల‌పైనా క్యాష్‌బ్యాక్‌లు, నో కాస్ట్ ఈఎంఐలు, ఫోన్ డ్యామేజ్ ప్రొటెక్ష‌న్ వంటి ఆఫ‌ర్లు ల‌భిస్తున్నాయి.  

శాంసంగ్ గెలాక్సీ ఎస్‌20 సిరీస్‌పై 4వేల క్యాష్‌బ్యాక్‌
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 20 సిరీస్‌లో వ‌చ్చిన శాంసంగ్ గెలాక్సీ ఎస్‌20 అల్ట్రా, శాంసంగ్ గెలాక్సీ ఎస్‌20, శాంసంగ్ గెలాక్సీ ఎస్‌20 ప్ల‌స్‌ల మీద కూడా  4వేల రూపాయ‌ల ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ ఇస్తుంది. అయితే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్‌తో కొనేవారికే ఈ ఆఫ‌ర్‌. 12 నెల‌ల నోకాస్ట్ ఈఎంఐ ఆఫ‌ర్ కూడా దీని మీద ల‌భిస్తుంది. అంతేకాదు శాంసంగ్ గెలాక్సీ ఫోన్ల‌పై అద‌నంగా మ‌రో 2 సంవ‌త్స‌రాలు వారంటీ ఇచ్చే శాంసంగ్ కేర్ ప్ల‌స్ స‌ర్వీస్‌ను రూ.2,299 రూపాయ‌ల త‌క్కువ ధ‌ర‌కే పొంద‌వ‌చ్చు. దీనిలో వారంటీతోపాటు రెండేళ్ల‌పాటు యాక్సిడెంట‌ల్, లిక్విడ్ డ్యామేజ్ అయినా క‌వ‌రేజి  ల‌భిస్తుంది. 

శాంసంగ్ గెలాక్సీ ఎస్‌10 మోడ‌ల్స్‌పైనా త‌గ్గింపు
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 10 లైట్.. 128 జీబీ వేరియంట్‌పై హెచ్‌డీఎఫ్‌సీ కార్డుదారుల‌కు 4వేల ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్‌, 12 నెల‌ల నో కాస్ట్ ఈఎంఐ ల‌భిస్తుంది. అలాగే శాంసంగ్‌ గెలాక్సీ ఎస్ 10 లైట్‌.. 512 జీబీ వేరియంట్‌ఫై 2వేల రూపాయ‌ల ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ ఆఫ‌ర్ చేస్తోంది. శాంసంగ్ గెలాక్సీ నోట్ 10 లైట్‌పైనా 2వేల త‌గ్గింపు పొంద‌వ‌చ్చు.  గెలాక్సీ ఎస్ 10 లైట్‌, గెలాక్సీ నోట్ 10 లైట్ యూజ‌ర్ల‌కు కూడా శాంసంగ్ కేర్ ప్ల‌స్ స‌ర్వీస్‌ను రూ.2,299 త‌గ్గింపు ధ‌ర‌కే అందిస్తుంది.  

శాంసంగ్ గెలాక్సీ ఏ సిరీస్ ఫోన్ల‌పైనా ఆఫ‌ర్లు
శాంసంగ్ గెలాక్సీ ఏ31, శాంసంగ్ గెలాక్సీ ఏ51, శాంసంగ్ గెలాక్సీ ఏ71 ఫోన్ల‌ను 12 నెల‌ల నో కాస్ట్ ఈఎంఐ ఆఫ‌ర్‌ను ఇస్తుంది. అలాగే శాంసంగ్ గెలాక్సీ ఏ71 ఫోన్‌కు శాంసంగ్ కేర్ ప్ల‌స్ అద‌న‌పు వారంటీని 1,149 రూపాయ‌ల‌కే అందిస్తుంది.  గెలాక్సీ ఏ 31, గెలాక్సీ ఏ 51 మోడ‌ల్స్‌కు రూ.699కే ఈ అద‌న‌పు వారంటీ ల‌భిస్తుంది. అలాగే గెలాక్సీ ఎం11 ఫోన్ల‌కు రూ.499కే కేర్ ప్ల‌స్ వారంటీని పొంద‌వ‌చ్చు.  


 

జన రంజకమైన వార్తలు