• తాజా వార్తలు

ప్రీ ఆర్డర్లలో శాంసంగ్ గెలాక్సీ ఎస్ 8 ఆల్ టైం రికార్డ్


శాంసంగ్ కంపెనీకి చెందిన ప్రతిష్ఠాత్మక ఫోన్ గెలాక్సీ ఎస్ 8 ప్రపంచవ్యాప్తంగా దుమ్ముదులిపేసిందట. విక్రయాల్లో అదరగొట్టేసిందని ఆ సంస్థే తాజాగా ఒక ప్రకటనలో వెల్లడించింది. ఆ సంస్థ చరిత్రలో ఇదే బెస్టు పర్ఫార్మెన్సు అని అంటున్నారు.
౩౦ శాతం అదనం
ఎస్ 8, ఎస్ 8+ మోడళ్లను శాంసంగ్ మొన్న మార్చిలో తొలిసారి రిలీజ్ చేసింది. వీటికోసం ప్రీ ఆర్డర్స్ తీసుకున్నారు. అయితే... ఈ ప్రీఆర్డర్లలో ఎస్ 8 గత రికార్డులన్నీ తిరగరాసేసిందట. గత ఏడాది తీసుకొచ్చిన గెలాక్సీ ఎస్ 7 కంటే ఎస్ 8 కు 30 శాతం అధికంగా ప్రీ ఆర్డర్లు వచ్చాయట. ఒక్క దక్షిణ కొరియాలో ఎస్ 8 ప్రీ ఆర్డర్లు 10 లక్షలు దాటిపోయాయి.
డిస్ ప్లే ప్రాబ్లమ్స్ క్లియర్
నిజానికి ఈ ఫోన్ అమెరికాలో, మరికొన్ని దేశాల్లో అందుబాటులోకి వచ్చిన వెంటనే పలు లోపాలు బయటపడ్డాయి. డిస్ ప్లే ఎర్రగా మారుతోందంటూ ప్రచారం జరిగింది. పలువురు ఆధారాలుకూడా చూపించారు. వెంటనే సంస్థ దాన్ని ఫిక్స్ చేసేందుకు మార్గాలు సూచించింది. సాఫ్ట్ వేర్ అప్ డేట్ ఇచ్చింది.
ఫ్లిప్ కార్టులో అందుబాటులో
కాగా ఎస్ 8 రూ.57,900... ఎస్ 8+ రూ. 64,900 ధరకు విక్రయిస్తున్నారు. వీటితో రూ.4,499 విలువ చేసే వైర్ లెస్ ఛార్జింగ్ యాక్సెసరీస్ ఇస్తున్నారు. ప్రముఖ ఈ కామర్స్ సైట్ ఫ్లిప్ కార్టులో ఈ రెండు ఫోన్ల ప్రీ బుకింగ్స్ ఇంకా జరుగుతున్నాయి. మే 2 నుంచి మన దగ్గర ఫోన్లు అందుబాటులోకి వస్తాయి.

జన రంజకమైన వార్తలు