• తాజా వార్తలు

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియ‌న్ డేస్‌.. ఈ మొబైల్స్‌పై భారీ త‌గ్గింపు ధ‌రలు 

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియ‌న్ డేస్ నేటి నుంచి మొద‌ల‌వబోతోంది. స్మార్ట్‌ఫోన్స్‌పై భారీ త‌గ్గింపు ధ‌ర‌లు ప్ర‌క‌టించింది. అవేంటో చూడండి.

శాంసంగ్ గెలాక్సీ ఏ80
శాంసంగ్ గెలాక్సీ ఏ 80 ధ‌ర 41,999 రూపాయ‌ల నుంచి 21,99కి తగ్గించింది. స్నాప్‌డ్రాగ‌న్ 730 ఎస్‌వోసీ ప్రాసెస‌ర్‌, నాలుగు కెమెరాల సెట‌ప్ ఉంది. 48 ఎంపీ, 8 ఎంపీ, 8 ఎంపీతో 3డీ డెప్త్ రొటేటింగ్ కెమెరాలు దీనిలో ప్ర‌త్యేక‌త‌లు. 

రియ‌ల్‌మీ ఎక్స్‌2 ప్రో
రియ‌ల్‌మీ ఎక్స్‌2 ప్రో ధ‌ర 29,999 రూపాయ‌ల నుంచి 25,999 రూపాయ‌లకు త‌గ్గించింది.  6జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్ల‌స్ ప్రాసెస‌ర్‌, 64 ఎంపీ మెయిన్ కెమెరాతోపాటు నాలుగు కెమెరాల సెట‌ప్ ఉంది. 4వేల ఎంఏహెచ్ బ్యాట‌రీ 50 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్  ఫీచ‌ర్లు దీనిలో ప్ర‌త్యేక‌త‌లు. 
వివో జెడ్‌1 ఎక్స్ 

వివో జెడ్‌1 ఎక్స్ మొబైల్ ధ‌ర 16,990 రూపాయ‌ల‌ను 14,990 రూపాయ‌ల‌కు త‌గ్గించింది.  6జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌,   స్నాప్‌డ్రాగ‌న్ 712 చిప్‌సెట్‌, సూప‌ర్ అమోల్డ్ డిస్‌ప్లే, 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతోపాటు ట్రిపుల్ కెమెరాలున్నాయి.  4,500 ఎంఏహెచ్ బ్యాట‌రీ 22.5 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచ‌ర్ దీని ప్ర‌త్యేక‌త‌లు. 

ఒప్పో ఏ9 
ఇది లేటెస్ట్ మోడ‌ల్‌. ఒప్పో ఏ9 మోడ‌ల్ ఫోన్ 15,999 రూపాయ‌ల నుంచి 12,990 రూపాయ‌ల‌కు త‌గ్గించింది. 4జీబీ ర్యామ్ బేస్  మోడ‌ల్‌. 48 ఎంపీ మెయిన్ కెమెరాతో పాటు వెనుక‌వైపు నాలుగు కెమెరాల సెట‌ప్‌. 5,000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, స్నాప్‌డ్రాగ‌న్ 665 ప్రాసెస‌ర్ దీనిలో ఫీచ‌ర్లు. 

ఐక్యూ 3
గేమింగ్ మొబైల్ ఐక్యూ3లోనూ ధ‌ర త‌గ్గించింది.  34,990 రూపాయ‌ల నుంచి 32, 990 రూపాయ‌లకు త‌గ్గించింది.  క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 865 ప్రాసెస‌ర్, 48 ఎంపీ క్వాడ్ కెమెరా సెట‌ప్ ఉంది. 4400 ఎంఏహెచ్ బ్యాట‌రీ 55 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచ‌ర్లున్నాయి.  

జన రంజకమైన వార్తలు