• తాజా వార్తలు

జీపీఎస్‌ను మ‌రిపించే మ‌న దేశ‌పు సృష్టి.. నావిక్‌పై తొలి గైడ్‌

జీపీఎస్ అంటే జియో పొజిష‌నింగ్ సిస్ట‌మ్ అని మ‌నంద‌రికీ తెలుసు. మ‌న మొబైల్ ట్రాకింగ్‌, క్యాబ్ బుకింగ్‌, ట్రైన్‌,బ‌స్ ట్రాకింగ్ ఇలాంటి జియో లొకేష‌న్ స‌ర్వీస్‌ల‌న్నీ మ‌నం వాడుకుంటున్నామంటే వాటికి బ్యాక్‌గ్రౌండ్ జీపీఎస్సే. అయితే ఇది అమెరిక‌న్ నావిగేష‌న్ స‌ర్వీస్‌. అందుకే మ‌న ఇస్రో శాస్త్రవేత్త‌లు జీపీఎస్‌కు పోటీగా నావిక్‌ను త‌యారుచేశారు. మ‌న నావిక్ క‌థేంటో జ‌స్ట్ ఓ చిన్న ప‌రిచ‌యం చేసుకుందాం ప‌దండి.

ఏమిటీ నావిక్‌?
నావిక్ అనేది ఇండియా అభివృద్ధి చేసిన నావిగేష‌న్ స‌ర్వీస్‌. మ‌న ఇస్రో శాస్త్రవేత్త‌లు దీన్ని త‌యారుచేశారు. ఇది మ‌న దేశానికే ప‌రిమితం. ప్ర‌స్తుతం దేశంలో 1500 మైళ్ల మేర‌కే ఈ నావిక్ స‌ర్వీస్ క‌వ‌ర్ చేస్తోంది.

 

నావిక్ డెవ‌ల‌ప్ చేయాల్సిన అవ‌స‌ర‌మేంటి?
ఇప్ప‌టికే జీపీఎస్ ఉండ‌గా నావిక్ డెవ‌ల‌ప్ చేయ‌డం దండ‌గ క‌దా అని మీకు డౌట్ రావ‌చ్చు.  జీపీఎస్ అమెరిక‌న్ స‌ర్వీస్‌. కాబ‌ట్టి దాన్ని మ‌న ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌కు వాడుకోవ‌డంలో ఇబ్బంది లేదు కానీ మిల‌ట్రీ అవ‌స‌రాల‌కు వాడుకోవ‌డం ఎంత వ‌ర‌కు సేఫ్ అని ఇస్రో ఆలోచించింది.  1999లో కార్గిల్ వార్ స‌మ‌యంలో పాకిస్థాన్ సైన్యం ఎలా వ‌స్తుందో తెలుసుకోవ‌డానికి జీపీఎస్ డేటా ఇమ్మ‌ని అమెరికాను అడిగితే వాళ్లు నో అన్నారు. అందుకే మ‌న సైన్యం అవ‌స‌రాల‌కు సొంత నావిగేష‌న్ సిస్టం కావాల‌ని నావిక్ డెవ‌ల‌ప్ చ‌శారు.

 

 నావిక్ ఎలా ప‌ని చేస్తుంది?
మీ డివైస్‌లోని లొకేష‌న్ బేస్డ్ స‌ర్వీస్ ఒక శాటిలైట్ ఆధారంగా ప‌ని చేస్తుంది. మ‌న వైఫై రూటర్ నుంచి సిగ్న‌ల్స్ ఎలా కొంత ప‌రిఇ వ‌ర‌కూ వెళతాయో అలాగే ఈ నావిగేష‌న్ స‌ర్వీస్ కూడా శాటిలైట్ ఆధారంగా ఫ్రీక్వెన్సీ వేవ్‌లెంత్ మీద ఆధార‌ప‌డి ప‌ని చేస్తుంది.
* నావిక్ డ్యూయ‌ల్ బాండ్ జీఎన్ఎస్ఎస్ సిస్ట‌మ్‌.  

* ఇందులో ఎల్‌, ఎస్ అనే రెండు బాండ్లు ఉంటాయి.

* ఎల్‌5 బాండ్‌ను పౌర అవ‌స‌రాల కోసం అంటే మన క్యాబ్‌, బ‌స్‌, ట్రైన్ ట్రాకింగ్ వంటివాటికి ఉప‌యోగిస్తారు.  

* ఎస్ బాండ్‌ను సైనిక అవ‌స‌రాల కోసం వాడ‌తారు.

* ఆర్బిట్‌లో 6 శాటిలూట్లు ఉంటాయి. ఇందులో 5 శాటిలైట్లు ఎల్ 5 బాండ్‌కు క‌నెక్ట్ అయి ఉంటాయి. ఆరోది ఎస్ బాండ్‌ను క‌నెక్ట్ చేస్తుంది.

* ఇస్రో త్వ‌ర‌లో 11 శాటిలైట్ల‌తో నావిక్ ద్వారా మొత్తం భూమి అంత‌టినీ క‌వ‌ర్ చేయాల‌ని భావిస్తోంది.
 

జీపీఎస్ క‌న్నా నావిక్ ఏవిధంగా ప్ర‌త్యేకం?
జీపీఎస్ జియో సింక్రోన‌స్ శాటిలైట్లు ఉప‌యోగించుకుని నావిగేష‌న్ స‌ర్వీస్ అందిస్తుంది. అంటే ఒకచోట ఉండ‌కుండా ఈ శాటిలైట్లు ఆర్బిట్‌లో క‌దులుతూ ఉంటాయి. అదే నావిక్‌లో శాటిలైట్లు ఒకే పొజిషన్‌లో ఫిక్స్‌డ్‌గా ఉండే జియో స్టేష‌న‌రీ శాటిలైట్లు కాబ‌ట్టి సిగ్న‌ల్ బ‌లంగా ఉంటుంది.  అంత‌రాయాలు త‌క్కువ‌గా ఉంటాయి.

జన రంజకమైన వార్తలు