• తాజా వార్తలు

క‌రోనా వైర‌స్ గురించి అందరు చ‌ద‌వాల్సిన కంప్యూటర్ విజ్ఞానం గైడ్‌

చైనా నుంచి చెన్నై వ‌ర‌కు, అమెరికా నుంచి అమీర్‌పేట వ‌రకు ఇప్పుడు అంద‌రినీ క‌ల‌వ‌ర‌పెడుతున్న పేరు క‌రోనా.  ఈ పేరు వింటే చాలు జ‌నం వ‌ణికిపోతున్నారు.  ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా బారిన ప‌డిన‌వారి సంఖ్య ల‌క్ష దాటేసింది. ఇండియాలోనూ 70కి పైనే ఉంది.  లేటెస్ట్‌గా ఇండియాలో తొలి క‌రోనా మ‌ర‌ణం నిన్నే న‌మోదైంది. ఈ ప‌రిస్థితుల్లో క‌రోనా గురించిన ముఖ్య‌మైన స‌మాచారం మీకోసం..

ఇండియాలో 74 మందికి 
ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ మెడిక‌ల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్‌) లెక్క‌ల ప్ర‌కారం దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో 6వేల మంది అనుమానితుల నుంచి శాంపిల్స్ తీసుకుని క‌రోనా ప‌రీక్ష‌లు చేశారు.  వీరిలో 74 మందికి మాత్ర‌మే క‌రోనా వైర‌స్ ఉన్న‌ట్లు గుర్తించారు.  ఇండియ‌న్స్‌కి 57 మందికి, ఇండియాకి వ‌చ్చిన విదేశీయుల‌కు17 మందికి క‌రోనా వైర‌స్ సోకిన‌ట్లు తేల్చారు. 

ప‌రీక్షా కేంద్రాలు ఇవిగో
క‌రోనా వైర‌స్ ల‌క్ష‌ణాలుంటే వెంట‌నే ప‌రీక్ష చేయించుకోవాలి. ఇందుకోసం ప్ర‌తి రాష్ట్రంలోనూ కొన్ని కేంద్రాలు పెట్టారు.

ఆంధ్రప్ర‌దేశ్‌లో.. 
1. శ్రీ వెంక‌టేశ్వ‌ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (స్విమ్స్), తిరుప‌తి
2. ఆంధ్రా మెడిక‌ల్ కాలేజ్‌, విశాఖ‌ప‌ట్నం
3. జీఎంసీ, అనంత‌పురం

తెలంగాణ‌లో
1. గాంధీ హాస్పిట‌ల్‌, సికింద్రాబాద్‌

త‌మిళనాడులో
1. కింగ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ అండ్ రీసెర్చ్‌, చెన్నై 
2. గ‌వ‌ర్న‌మెంట్ మెడిక‌ల్ కాలేజ్‌, తేని

క‌ర్ణాట‌క‌
1. బెంగుళూర్ మెడిక‌ల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌, బెంగుళూర్ 
2. నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాల‌జీ ఫీల్డ్ యూనిట్‌, బెంగ‌ళూరు 
3.మైసూర్ మెడిక‌ల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ యూనిట్‌, మైసూర్ 
4. హ‌స‌న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్‌, హ‌స‌న్ 
5. షిమోగా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్‌, శివ‌మొగ్గ 

ఒరిస్సా
1. రీజ‌న‌ల్ మెడిక‌ల్‌ రీసెర్చ్ సెంట‌ర్‌, భువ‌నేశ్వ‌ర్ 

పుణే ఫైన‌ల్ 
ఈ సెంట‌ర్స్‌లో ప‌రీక్ష చేయించుకున్నాక క‌రోనా పాజిటివ్ అని తేలితే పుణేలోని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాల‌జీకి పంపిస్తారు. అక్క‌డ మ‌ళ్లీ టెస్ట్ చేసి అక్క‌డ కూడా క‌న్ఫ‌ర్మ్ అయితేనే క‌రోనా ఉంద‌ని తేలుస్తారు.  క‌రోనా వైర‌స్ వ్యాప్తికి నోడ‌ల్ ఏజెన్సీగా పుణే ఇనిస్టిట్యూట్ ఉంది. వీళ్లిచ్చిన స‌మాచారంతోనే కేంద్ర ప్ర‌భుత్వం క‌రోనా కేసుల గురించి ప్ర‌క‌టిస్తుంది.

స‌హాయం కోసం సంప్ర‌దించండి..
* క‌రోనా వైర‌స్ బాధితులు స‌హాయం కోసం సంప్ర‌దించాల్సిన ఫోన్ నెంబ‌ర్ 91-11-23978046
* ఈమెయిల్ ఐడీ ncov2019@gmail.com
* కేంద్ర ప్ర‌భుత్వ ఆరోగ్య, కుటుంబ‌సంక్షేమ శాఖ వెబ్‌సైట్‌ mohfw.gov.inలోనూ కరోనా గురించిన స‌మాచారం ఉంటుంది.
 

జన రంజకమైన వార్తలు