• తాజా వార్తలు

మీరే వెబ్ యాప్స్ క్రియేట్ చేసుకోవ‌డానికి 4స్టెప్స్‌ గైడ్‌

యాప్స్ వాడుతున్నారు స‌రే.. అస‌లు మీరే యాప్ క్రియేట్ చేసుకుంటే ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఊహించారా?  అబ్బో చాలా క‌ష్టం అనుకుంటున్నారు. ఆల్గో బై ఎయిర్‌డేవ్ (Algo by AirDev ) అనే ఫ్రీ వెబ్‌సైట్  ద్వారా గూగుల్ షీట్స్‌ను ఉప‌యోగించి మీ వెబ్ యాప్‌ను మీరే క్రియేట్ చేసుకోవ‌చ్చు. దీనికి మీకు కావాల్సింద‌ల్లా జ‌స్ట్ ఓ గూగుల్ అకౌంట్ మాత్ర‌మే. 

ఏ సినిమా బాగుంది? మ‌హేష్‌దా? ప‌వ‌న్‌దా? ఐపీఎల్‌లో ఎవ‌రు నెగ్గుతారు?  సీఎస్‌కేనా? స‌న్‌రైజ‌ర్సా?  కాబోయే సీఎం ఎవ‌రు?  ఇలాంటి ఒపీనియ‌న్ పోల్స్‌,  క్విజ్‌లు పెట్టే యాప్స్ చాలా చూసే ఉంటారు. అలాంటి వెబ్ యాప్స్‌ను మీరు కూడా క్రియేట్ చేసుకోవ‌చ్చు. దీన్ని యూఆర్ ఎల్‌తో ఇత‌రుల‌కు షేర్ చేయొచ్చు. ప‌బ్లిక్‌గానూ, ప్రైవేట్‌గానూ వాడుకోవ‌చ్చు. అది ఎలాగో స్టెప్ బై స్టెప్ తెలుసుకోండి.

ఈ నాలుగు స్టెప్స్‌

1. algo.airdev.co వెబ్‌సైట్‌ను మీ బ్రౌజ‌ర్‌లో ఓపెన్ చేయండి.  హోం పేజీలో కుడివైపు పైన ఉన్న సైన్ ఇన్ బ‌ట‌న్ నొక్కి మీ గూగుల్ అకౌంట్‌తో సైన్ ఇన్  అవ్వండి.  ఇప్పుడు ఒక పాప్ అప్ వ‌స్తుంది. ఈ వెబ్‌సైట్ మీ గూగుల్ ప్రొడ‌క్ట్స్‌కి యాక్సెస్ కావాల‌ని అడుగుతుంది. యాక్సెస్ ఇవ్వండి.

2. ఇప్పుడు మీ యాప్‌కు ఒక పేరు పెట్టండి. త‌ర్వాత నెక్స్ట్ పేజీలోకి వెళ్లి అది అడిగిన వివ‌రాలివ్వండి. ఇందులో మీరు మీ గూగుల్ స్ర్పెడ్  షీట్‌ను అటాచ్ చేయాలి. మీరు యాప్‌లో పెట్టాల‌నుకున్న ఇన్‌పుట్స్ గూగుల్ షీట్స్ ద్వారానే ఇవ్వాల్సి ఉంటుంది.

3. త‌ర్వాత పేజీలో అవుట్ పుట్ ఫీల్డ్స్  ఏమి ఉండాల రాయండి. కావాలంటే మ‌ల్టిపుల్ అవుట్‌పుట్ ఫీల్డ్స్‌ను  యాడ్ చేసుకోవ‌చ్చు.

4.  ఈ ప్రాసెస్ంత పూర్త‌య్యాక యాప్‌ను లాంచ్ చేయాలి. use the app ట‌ట‌న్ నొక్కితే మీ యాప్ పేజీకి వెళ్లొచ్చు. మీ వెబ్‌పేజీ నుంచే ఈ యాప్‌ను ప‌బ్లిక్ యూజ్‌కి కూడా వీల‌య్యేలా వాడుకోవ‌చ్చు.

ఈ ప్రాసెస్ అంతా  5 నిముషాల్లో అయిపోతుంది.  త‌ర్వాత ఈ యాప్‌ను ఆన్‌లైన్‌లో ర‌న్ చేయొచ్చు. యాప్ యూఆర్ఎల్‌ను ఎవ‌రితోన‌యినా షేర్ చేసుకోవ‌చ్చు. ఎన్నియాప్స్ కావాల‌న్నా క్రియేట్ చేసుకోవ‌చ్చు.

జన రంజకమైన వార్తలు