కరోనా రెండో దశలో పెనుభూతంలా విరుచుకుపడుతోంది. వ్యాక్సిన్ వచ్చాక పెద్దగా దాన్ని పట్టించుకోని జనం ఇప్పుడు సెకండ్ వేవ్ ప్రాణాలు తోడేస్తుండటంతో వ్యాక్సిన్ కోసం పరుగులు తీస్తున్నారు. ప్రభుత్వం కూడా 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మొన్నటివరకు 45 ఏళ్లు పైబడిన వారికే టీకా ఇచ్చారు. ఇప్పుడు 18 ఏళ్లు దాటినవారందరికీ వ్యాక్సిన్ వేస్తారు.
ఏప్రిల్ 28 నుంచి రిజిస్ట్రేషన్
గవర్నమెంట్ సెంటర్లలో వ్యాక్సిన్ ఫ్రీ. అదే ప్రైవేట్ ఆసుపత్రుల్లో అయితే డబ్బులు కట్టాలి. అయితే ఎక్కడ వ్యాక్సిన్ వేయించుకోవాలన్నా ముందుగా కొవిన్ (CoWIN) పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి. 18 ఏళ్లు నిండినవారికి ఏప్రిల్ 28న అంటే బుధవారం నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. ఆ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో చూద్దాం.
1.బ్రౌజర్‌లో CoWIN వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. లేదా సెర్చ్‌లో https://www.cowin.gov.in/ అని టైప్ చేసి క్లిక్ చేయండి.
2. Register/Sign in yourself అనే బ్యాడ్జ్ మీద క్లిక్ చేయండి.
3. ఇప్పుడు మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. మీ మొబైల్‌కు వచ్చే ఓటీపీని అక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేసుకోండి.
4. Register for Vaccination అనే పేజీలో మీ పేరు, జెండర్, డేట్ ఆఫ్ బర్త్‌తోపాటు ఫోటో ఐడీ ప్రూఫ్ వివరాలన్నీ ఎంటర్ చేసి రిజిస్టర్ బటన్ నొక్కండి.
5. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక మీకు అపాయింట్‌మెంట్ షెడ్యూల్ చేసుకోవడానికి షెడ్యూల్ బటన్ నొక్కండి.
6.మీరు ఉంటున్న ప్రాంతం పిన్‌కోడ్ ఎంటర్ చేసి సెర్చ్ కొట్టండి. మీ ప్రాంతంలోని వ్యాక్సినేషన్ సెంటర్ల వివరాలన్నీ కనిపిస్తాయి.
7. ఇప్పుడు మీరు సెంటర్ సెలక్ట్ చేసుకుని డేట్ టైమ్ సెలక్ట్ చేసుకుని కన్ఫర్మ్ నొక్కండి.
ఒకే లాగిన్‌తో నలుగురికి రిజిస్ట్రేషన్
ఒక లాగిన్‌తో నలుగురికి వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అంతేకాదు మీకు టైమ్ కుదరకపోతే వ్యాక్సినేషన్ రీ షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు.