• తాజా వార్తలు

గూగుల్ మెసేజ్ యాప్‌తో మీ మెసేజ్‌ను షెడ్యూల్ చేయొచ్చు.. ఎలాగో చెప్పే గైడ్

ఎవ‌రికైనా మెసేజ్ పంపాలంటే టైప్ చేసి పంపిస్తాం. అదే ఇప్పుడు మెసేజ్ టైప్ చేసి త‌ర్వాత పంపించాలంటే దాన్ని డ్రాఫ్ట్‌గా సేవ్ చేసి పెట్టుకుంటాం. కానీ ఆ టైమ్‌కు పంప‌డం మ‌ర్చిపోతే.. లేదంటే ఆ టైమ్‌ మెసేజ్ సెండ్  చేయ‌డం మ‌ర్చిపోతే ఇబ్బంది ప‌డాల్సి వ‌స్తుంది క‌దా.. అందుకే గూగుల్ ఈ స‌మ‌స్య‌కు ఓ సొల్యూష‌న్ తీసుకొచ్చింది. షెడ్యూల్ మెసేజింగ్ ఫీచర్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. దీనిలో మీరు మెసేజ్ టైప్ చేసి అవ‌త‌లి వ్య‌క్తికి పంపాల్సిన స‌మ‌యం సెట్ చేసుకోవ‌చ్చు. ఆ టైమ్‌కు ఆ మెసేజ్ వారికి సెండ్ అయిపోతుంది. అయితే ఈ  సౌక‌‌ర్యం గూగుల్‌  'మెసేజింగ్ యాప్‌లో మాత్ర‌మే అందుబాటులో ఉంటుంది.    

మెసేజ్ ఎలా షెడ్యూల్ చేసుకోవాలంటే..
* గూగుల్ షెడ్యూల్ మెసేజింగ్ యాప్‌ ప్లే స్టోర్‌ లో ఉంది. ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకున్నత‌ర్వాత దాన్ని ఓపెన్ చేయాలి. 
* త‌ర్వాత ఈ యాప్‌ను డీఫాల్ట్‌ యాప్‌గా  సెట్ చేసుకోవాలి. 
* ఇప్పుడు మీ పాత‌ మెసేజ్‌ యాప్‌లో ఉన్న మెసేజ్‌లన్నీ ఇందులోకి వచ్చేస్తాయి. 
* త‌ర్వాత కింద కుడి వైపు ఉన్న మెసేజ్ ఐకాన్‌ను క్లిక్‌ చేయాలి. 
* ఇప్పుడు మీరు ఎవ‌రికైతే మెసేజ్ పంపాల‌నుకుంటున్నారో ఆ నంబర్ ఎంటర్ చేసి.. మెసేజ్‌ బాక్స్‌లో మన‌ మెసేజ్‌ను టైప్‌ యాలి.  ఇప్పుడు ఎస్‌ఎంఎస్‌ సెండ్‌ బటన్‌పై కొన్ని సెకండ్ల పాటు లాంగ్ ప్రెస్‌ చేయాలి. 
* దీంతో మనకు షెడ్యూల్‌ సెండ్‌ అనే ఆప్షన్‌ స్క్రీన్ పై కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి మనం ఏ సమయానికి ఆ మెసేజ్‌ వెళ్లాలనుకుంటున్నామో ఎంటర్ చేయాలి. 
* ఇప్పుడు సెండ్‌ కొడితే ఆ మెసేజ్‌ షెడ్యూల్‌ అయిపోతుంది. 

షెడ్యూల్ డిలీట్ చేయాలంటే
* మనం షెడ్యూల్ చేసిన మెసేజ్‌ను డిలీట్ చేయాలనుకుంటే తొలగించే అవకాశం కూడా ఉంది.  
* అంతేకాదు  షెడ్యూల్ చేసిన సమయాన్ని కూడా మార్చుకోవచ్చు.

జన రంజకమైన వార్తలు