• తాజా వార్తలు

స్మార్ట్ ఫోన్ లో మోసపూరిత ప్రకటనల రహిత వీక్షణకు గైడ్

చైనా కు చెందిన ప్రముఖ మొబైల్ ఇంటర్నెట్ కంపెనీ అయిన చీతా మొబైల్స్ యొక్క అనాలసిస్ ప్రకారం మొబైల్ మాల్ వేర్ అనేది ఇండియా లో చాలా వేగంగా విస్తరిస్తుంది. ప్రపంచం లోనే అత్యధికమంది స్మార్ట్ ఫోన్ యూజర్ లతో స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో ఇండియా రెండవ స్థానo లో ఉంది. ఈ చీతా మొబైల్స్ సేకరించిన సమాచారం ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా వైరస్ దాడికి గురైన స్మార్ట్ ఫోన్ లలో 17. 8 శాతం ఒక్క ఇండియా లోనే ఉన్నాయి. ఇండియా లో ఉన్న స్మార్ట్ ఫోన్ యూజర్ ల సంఖ్య తో పోల్చితే ఇది చాలా ఎక్కువ.
ఇంతకీ ఈ చీతా మొబైల్స్ ఎవరు?
మనం ముందు చెప్పుకున్నట్లు ఇది ఒక చైనీస్ కంపెనీ. బీజింగ్ హెడ్ క్వార్టర్ గా పనిచేసే ఇది 2010 లో స్థాపించబడింది. ఇది ప్రపంచo లోనే రెండవ అతి పెద్ద ఇంటర్ నెట్ సెక్యూరిటీ సాఫ్ట్ వేర్ ప్రొవైడర్. ప్రముఖ యాoటి వైరస్ అయిన క్లీన్ మాస్టర్ ఈ కంపెనీ యొక్క ఉత్పాదనే. ఇది జంక్ ఫైల్ లను ఎరేజ్ చేయడం, మెమరీ ని ఆప్టిమైజ్ చేయడం, వైరస్ ల నుండి పూర్తీ రక్షణ ను ఇవ్వడం ద్వారా స్మార్ట్ ఫోన్ పెర్ఫార్మన్స్ ను ఇంప్రూవ్ చేస్తుంది.బ్యాటరీ డాక్టర్, దుబా యాంటి వైరస్ లు కూడా ఈ కంపెనీ ఉత్పాదనలే.
ఇంతకీ ఇది ఏం చెబుతుంది?
ఇండియా లో సగానికి పైగా బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లే. ఇక్కడ ఇవే పాపులర్. అయితే దురదృష్టవశాత్తూ వీటిలో కొన్ని వినియోగదారునికి చేరే ముందే వైరస్ ల తో ప్రీ లోడ్ అయి వస్తున్నాయి. పోర్న్ హబ్ యొక్క సమాచారం ప్రకారం ప్రపంచం లో ఎక్కువ పోర్న్ చూసే వారిలో ఇండియా మూడవ స్థానం లో ఉంది. ఈ పోర్న్ హబ్ లాంటి వెబ్ సైట్ లు విస్తారంగా మాల్ వేర్ ను వ్యాప్తి చేస్తాయి. అలాగే యూజర్ లు అనేకరకాల యాప్ లను తమ స్మార్ట్ ఫోన్ లలో ఇన్ స్టాల్ చేసుకుంటూ ఉంటారు. ఈ యాప్ లతో పాటే వైరస్ లు మాల్ వేర్ లు కూడా డౌన్ లోడ్అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ మాల్ వేర్ వ్యాప్తి అనేది సరికొత్త పంథాను ఎంచుకుంది. మోసపూరిత ప్రకటనలను వెబ్ యూజర్ లకు ఇవ్వడం ద్వారా వారి డివైస్ లలోకి వైరస్ లను పంపించడం మొదు అయింది. స్మార్ట్ ఫోన్ యూజర్ లు ఎన్ని రకాలుగా ఈ తరహా ఎటాక్ లకు గురి కావచ్చో క్రింద ఇవ్వడం జరిగింది.
1. మీ స్మార్ట్ ఫోన్ ను టర్న్ ఆన్ చేసేటపుడు లేదా ఛార్జింగ్ చేసేటపుడు వచ్చే పాప్ అప్ ల ద్వారా
2. యాప్ లను ఇన్ స్టాల్ లేదా అన్ ఇన్ స్టాల్ చేసేటపుడు
3. యాప్ రన్నింగ్ లో ఉన్నపుడు
4. యాప్ నుండి బయటకు వచ్చేటపుడు
5. డెస్క్ టాప్ పై యాప్ కి సంబందించిన రికమండేషన్ లు ఉన్నపుడు
అయితే కొన్ని జాగ్రత్తలను తీసుకోవడం ద్వారా ఈ తరహా మోసపూరిత యాడ్ ల ద్వారా వైరస్ బారిన పడే ప్రమాదాన్ని నివారించవచ్చు.
వీటిని నిరోధించడం ఎలా?
1. యాప్ లకు నమ్మకమైన సోర్స్ లను ఉపయోగించడం.
మీకు అంతగా అవగాహన లేని యాప్ లను ఇన్ స్టాల్ చేయకపోవడమే మంచిది. గూగుల్ ప్లే స్టోర్ కాకుండా మిగతా సోర్స్ లనుండి వచ్చే యాప్ లలో మాల్ వేర్ లు ఉండడానికి అవకాశం ఎక్కువ. కాబట్టి నమ్మకమైన యాప్ స్టోర్ లనుండి మాత్రమే యాప్ లను డౌన్ లోడ్ చేసుకోవాలి. ప్లే స్టోర్ కాకుండా మరొక నమ్మకమైన యాప్ స్టోర్ అమజాన్ యాప్ స్టోర్. అయితే వీటికి నకిలీ స్టోర్ లు కూడా ఉంటాయి. కాబట్టి మీరు వాడుతున్న ప్లే స్టోర్ అసలైనదా, నకిలీదా చెక్ చేసి వాడుకోవలసిన అవసరం ఉంది.
2. ఫైల్ మేనేజ్ మెంట్
ఫైల్ లు లేదా మీడియా యొక్క ట్రాన్స్ ఫర్ కు ఎప్పుడూ ఒక నమ్మకమైన కంప్యూటర్ ను మాత్రమే వాడాలి. మీ ఫైర్ వాల్స్, యాంటి వైరస్ మొదలైన సెక్యూరిటీ ఫీచర్ లు అన్నీ ఒకే సిస్టం లో ఉండే విధంగా చూసుకోవాలి.
3. రీడ్ పర్మిషన్ లు
ఆండ్రాయిడ్ మార్ష్ మాలో రాకముందు ఇది కొంచెం కష్టం గా ఉండేది. అయితే ఆండ్రాయిడ్ యొక్క లేటెస్ట్ వెర్షన్ లైన మార్ష్ మాలో మరియు తర్వాత వస్తున్న వెర్షన్ లలో ఈ పర్మిషన్ లను ఇవ్వడం అనేది చాలా సులభంగా మారింది. కాబట్టి ఈ అంశం లో కూడా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది.
4. యాంటి వైరస్ అప్లికేషను లను ఉపయోగించడం
యాంటి వైరస్ అప్లికేషన్ లను ఉపయోగించడం వలన కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అయితే ఇది అంతగా అవసరం లేదనే వాదన కూడా ఉంది. ఎందుకంటే యాప్ డౌన్ లోడ్ అయ్యేటపుడే గూగుల్ తన ప్లే స్టోర్ ద్వారా దీనిని స్కాన్ చేసి పంపిస్తుంది. అయితే యాంటి వైరస్ ఉండడం వలన ఇబ్బంది అయితే ఏదీ లేదు కదా!

జన రంజకమైన వార్తలు