బిజీ షెడ్యూల్‌లో చాలా విషయాలు మర్చిపోతుంటాం. అందుకే వాటిని నోట్స్ యాప్స్‌లోకి రాసుకోవచ్చు.అంతేకాదు వాటినిఎక్కడి నుంచయినా వాడుకోవచ్చు కూడా.అలాంటి క్లౌడ్ నోట్ టేకింగ్ యాప్స్ డిటెయిల్స్ మీకోసం..
క్లౌడ్ నోట్ టేకింగ్ యాప్స్ అంటే..
నోట్ టేకింగ్ యాప్స్‌లో రెండురకాలున్నాయి. మొదటిది యాప్ బేస్డ్ సొల్యూషన్. రెండోది క్లౌడ్ బేస్డ్ సొల్యూషన్. మీరు నోట్స్ తయారుచేసుకోవడానికి వెబ్‌సైట్ వాడితే అది క్లౌడ్ నోట్ టేకింగ్ యాప్. ఈ తరహా యాప్స్‌చాలా ఉన్నప్పటికీ అందులో బెస్ట్ ఇవీ..
1. గూగుల్ కీప్ (Google Keep)
ఆండ్రాయిడ్ నుంచి ఐవోఎస్ వరకు అన్ని డివైస్‌ల్లోనూ గూగుల్ కీప్ అందుబాటులో ఉంటుంది. దీన్ని ఆండ్రాయిడ్, ఐఫోన్, ఐప్యాడ్‌లో అయినా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్ ద్వారా కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రీ యాప్ కావడం, గూగుల్‌తో పవర్ అయి ఉండడంతో క్లౌడ్ నోట్ టేకింగ్ యాప్స్‌లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పుకోవాలి. ఈ యాప్ ఇంటర్‌ఫేస్‌చాలా ఈజీగా, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది.మీరు దీనిలో నోట్ రాసుకోవడం ఈజీ. దీనిలో ఉండే థీమ్స్ ఆప్షన్ ద్వారా మీ నోట్స్‌లో రాసుకునే అంశాలను కలర్స్‌తో స్పెసిఫై చేసుకోవచ్చు. దానికి సంబంధించిన ఇమేజ్‌ను కూడా అటాచ్ చేసుకోవచ్చు. అంతేకాదు ఆ పని పూర్తయ్యాక దాన్ని రిమూవ్ చేసి లిస్ట్‌ను ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా ఉంచుకోవచ్చు.
2. ఎవర్ నోట్ (Evernote)
ఎవర్‌నోట్ కూడా ఫ్రీ యాప్. ఏ మొబైల్‌లో అయినా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అంతేకాదు విండోస్, మ్యాక్, వెబ్ ఫ్లాట్‌ఫామ్స్‌లో కూడా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫీచర్స్ పరంగా చూస్తే ఎవర్‌నోట్..గూగుల్ కీప్ కంటే బెటర్ ఆప్షన్. అయితే గూగుల్ కీప్ అంత సింపుల్‌గా ఉండదు. అయితే మీరు ఈ యాప్‌లో రాసుకునే నోట్స్‌ను ఈజీగా కస్టమైజ్ చేసుకోవచ్చు. కానీ ఫ్రీ వెర్షన్‌ను మీరు ఒక్క డివైస్‌లో మాత్రమే వాడుకోగలరు. అదే పెయిడ్ వెర్షన్ అయితే ఎన్ని డివైస్‌ల్లో అయినా ఒకే ఎవర్‌నోట్‌ను వాడుకోవచ్చు. పెయిడ్ అకౌంట్ అయితే పీడీఎఫ్ ఫైల్స్‌ను కూడా వాడుకోవచ్చు.
3. వన్ నోట్ (OneNote)
మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్స్‌ను ఇష్టపడేవారికోసం వచ్చిన క్లౌడ్ టేకింగ్ యాప్ వన్ నోట్. ఇది కూడా ఫ్రీనే. ఐవోఎస్, ఆండ్రాయిడ్ మొబైల్స్, విండోస్, మ్యాక్‌ల్లో కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంటర్ ఫేస్ చాలా బాగుంటుంది. యూఐతో కంపాక్ట్ అయి ఉంటుంది. నోట్స్ రాసుకోవడమే కాదు ఇంపార్టెంట్ వాటిని బుల్లెట్ పాయింట్స్‌గా కూడా పెట్టుకోవచ్చు. యాప్ కంటే వెబ్ వెర్షన్ స్పీడ్‌గా లోడవుతుంది.స్మూత్‌గా కూడా పనిచేస్తుంది. అయితే దీనిలో ఉన్న సమస్యల్లా మీరు మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఉంటేనే వన్‌నోట్ వాడుకోగలరు.అంటే @outlook.com లేదా @hotmail.comతో ఉండే అకౌంట్ దీనికి తప్పనిసరి. ఎలాంటి విండోస్ డివైస్‌లో అయినా వాడుకోగలగడం దీనికి ఉన్న ప్లస్‌పాయింట్.
4. సింపుల్ నోట్ ( Simplenote)
పైన చెప్పిన ఆప్షన్లేవీ మీకు నచ్చకపోతే సింపుల్ నోట్ మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. సింపుల్ నోట్ పేరుకు తగ్గట్లే సింపుల్ ఇంటర్‌ఫేస్‌తో ఉంటుంది. ఆండ్రాయిడ్, ఐవోఎస్, మ్యాక్, విండోస్, లినక్స్ ఇలా ఏఫ్లాట్‌ఫాంలో అయినా దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వెబ్ వెర్షన్ కూడా ఉండడంతో ఏ బ్రౌజర్‌లో అయినా వాడుకోవచ్చు. ఫ్రీ వెర్షన్‌లోనే ఎన్ని డివైస్‌లకైనా దీన్నివాడుకోవచ్చు. సింపుల్ ఇంటర్‌ఫేస్, మినిమమ్ ఫీచర్లుంటే నోట్ యాప్ కావాలనుకుంటే సింపుల్ నోట్ మీకు బెస్ట్ ఛాయిస్ అవుతుంది.