• తాజా వార్తలు

గైడ్‌: యాప్‌కి, విడ్జెట్‌కి ఏంటి తేడా? ఒక బేసిక్ గైడ్

స్మార్ట్‌ఫోన్లో మ‌నం యాప్‌లు ఉప‌యోగిస్తుంటాం.  అందులో ఇన్‌బిల్ట్‌గా వచ్చే యాప్‌లు కూడా ఉంటాయి అయితే యాప్‌ల‌తో పాటు విడ్జెట్ అనే మ‌రో ఆప్ష‌న్ మ‌న‌కు క‌నిపిస్తుంది. ఇవి కూడా యాప్‌ల మాదిరిగానే ప‌ని చేస్తాయి. కానీ యాప్‌లు కావు. మ‌రి విడ్జెట్‌ల‌కు యాప్‌ల‌కు ఏంటీ తేడా?... మీ స్మార్ట్‌ఫోన్‌లో హోమ్‌స్క్రీన్‌పై చిన్న చిన్న ఐకాన్‌లా ఉండే ఈ విడ్జెట్‌లు చాలా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఫోన్‌ను మ‌రింత ఆక‌ర్ష‌ణీయంగా అందంగా త‌యారు చేయ‌డంలో వీటిదే కీల‌క‌పాత్ర‌. యాప్‌ల‌కు విడ్జెట్‌ల‌కు కొన్ని ప్ర‌ధాన తేడాలు ఉన్నాయి.. అవేంటో చూద్దాం..


ఏంటి తేడా?
యాప్ అంటే పూర్తి అర్ధం అప్లికేష‌న్ అని. ఫోన్లోనో లేక కంప్యూట‌ర్లో మ‌నం భిన్న‌మైన టాస్క్‌లు పూర్తి చేయ‌డం కోసం ఉప‌యోగించే అప్లికేఫ‌న్ల‌నే యాప్‌లు అంటారు. ఈ యాప్‌లను ఎక్కువ‌గా  ఆండ్రాయిడ్‌, ఐవోఎస్ ఫ్లాట్‌ఫాంల‌లో యూజ్ చేస్తారు. వాటికి అనుగుణంగానే వీటిని డెవ‌ల‌ప్ చేస్తారు. క్రోమ్‌,మొజెల్లా లాంటి ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌ల‌లో కూడా వెబ్ యాప్స్‌, డెస్క్‌టాప్ యాప్స్ లాంటివి పుట్టుకొచ్చాయి.  విడ్జెట్‌లు అంటే ప్రొగ్రామ్స్‌.  అయితే ఇవి యాప్‌కు ఎక్స్‌టెన్ష‌న్‌గా డివైజ్ చేశారు. టాస్క్‌ల‌ను కంప్లీట్ చేయ‌డానికి యాప్‌లు పుడితే... యాప్‌లు టాస్క్‌ల కంప్లీట్ చేయ‌డానికి విడ్జెట్లు త‌యార‌య్యాయి.

ఎలా ప‌ని చేస్తాయంటే.
ఏ ఆండ్రాయిడ్ ఫోన్ అయినా మోడ‌ల్‌తో సంబంధం లేకుండా క్లాక్ యాప్ అనేది వ‌స్తుంది. అంటే మ‌నం స‌మ‌యం చూసుకోవ‌డానికి , అలారం సెట్ చేసుకోవ‌డానికి ఇది ప‌ని చేస్తుంది. అలాగే క్లాక్ విడ్జెట్ కూడా ఉంటుంది.  క్లాక్ యాప్ ఓపెన్ చేస్తే మీరు కొన్ని టాస్క్‌లు చేయ‌చ్చు. మ‌ల్టీపుల్ అలార‌మ్స్‌, టైమ‌ర్‌, స్టాప్‌వాచ్ ఇలా భిన్న‌మైన టాస్క్‌లు ఉంటాయి.  అంటే ఒక యాప్‌లో మ‌నం ఎన్నో టాస్కులు చేసుకోవ‌చ్చు. కానీ అదే విడ్జెట్ అయితే కేవ‌లం ఒక ప‌ని మాత్ర‌మే చేయ‌గ‌లం.  అంటే ఈరోజు స‌మ‌యం చూపించ‌డం, తేదీ చూపించ‌డం మాత్ర‌మే ఇది చేస్తుంది. టైమ‌ర్‌, స్టాప్‌వాచ్ లాంఇ ప‌నులు చేయ‌దు.  అంటే  ఒక యాప్‌లు మ‌ల్టీపుల్ విడ్జెట్‌లు ఉండొచ్చు. కానీ ఒక విడ్జెట్‌లో యాప్‌లు ఉండ‌వు. 


బ్యాక్‌గ్రౌండ్‌లో
యాప్‌లకు, విడ్జెట్‌ల‌కు ఉన్న మ‌రో ప్ర‌ధాన తేడా. యాప్‌లు బ్యాక్ గ్రౌండ్‌లో ఎక్కువ ప‌ని చేయ‌వు. కానీ విడ్జెట్‌లు అలా కాదు బ్యాక్‌గ్రౌండ్‌లోనే ఎక్కువ ప‌ని చే్స్తాయి. 24 గంట‌లు ఇవి యాక్టివ్‌గానే ఉంటాయి. అన్నిటిక‌న్నా ముఖ్యంగా ఇవి మొబైల్ రీసోర్సులు అయిన సీపీయూ, ర్యామ్‌ల‌ను ఎక్కువ‌గా వాడుకుంటాయి. దీని వ‌ల్ల ఫోన్ స్లో అయిపోయే అవ‌కాశాలు కూడా ఉన్నాయి.  అయితే యాప్‌, విడ్జెట్ దేని ప్ర‌త్యేక‌త దానిదే. కానీ లాభం చూసుకుంటే మాత్రం యాప్‌లే విడ్జెట్‌ల క‌న్నా న‌యం అనిపిస్తాయి. 

జన రంజకమైన వార్తలు