• తాజా వార్తలు

ఫొటోల‌ను అనిమేటెడ్ ఎమోజీలుగా మార్చ‌డానికి ఒన్ అండ్ ఓన్లీ గైడ్‌

ఇత‌రుల‌కు పంపే సందేశాల‌తో అర్థ‌వంత‌మైన ఇమోజీల‌ను వాడ‌టం మ‌న‌కు అల‌వాటే... అయితే, స‌రికొత్త‌గా ఫొటోల‌నే ఎమోజీలుగా వాడ‌టం ఎలాగో ఈ వ్యాసంలో తెలుసుకుందామా!
   ఇప్పుడు మ‌నం వాడుతున్న ఎమోజీ రూప‌క‌ర్త‌లు మ‌న‌కు చాలానే అందుబాటులో ఉంచుతున్నారు. అంతేకాకుండా కొన్నిసార్లు వాటిలో మ‌న ముఖాన్ని యాడ్ చేసుకోవ‌డానికీ అనుమ‌తిస్తున్నారు. కానీ, అలా మార్చిన ఎమోజీని అనిమేట్ చేసుకునే ఆప్ష‌న్ మాత్రం ఇవ్వ‌డం లేదు. అయితే, ఇప్పుడు అలాంటి ఆప్ష‌న్‌ను “EmotiYou” ఉచిత ఆన్‌లైన్ వేదిక మ‌న‌కు అందుబాటులోకి తెచ్చింది. అంటే... మ‌న సాధార‌ణ ఫొటోను కూడా ఇక‌పై అనిమేటెడ్ ఎమోజీగా మార్చేయొచ్చు! ఇందుకోసం ఈ వెబ్‌సైట్‌ కొన్ని సుల‌భ‌మైన మార్గాల‌ను చూపుతోంది. ఆ మేర‌కు మీ ద‌గ్గ‌రున్న ఫొటోల‌ను ‘క్రాప్’ చేసి ఏదైనా ఎమోజీ టెంప్లేట్‌ను ఎంచుకుంటే చాలు. ప్ర‌స్తుతం ఇలాంటి 9 టెంప్లేట్‌లు మాత్ర‌మే ఈ వెబ్‌సైట్‌లో ల‌భిస్తున్నాయి. వాటిద్వారా ఫొటోను అనిమేటెడ్ ఎమోజీగా మార్చి.. డౌన్‌లోడ్ చేసుకుని మ‌న‌వారితో షేర్ చేసుకోవ‌చ్చు.
మ‌నం చేయాల్సింది ఏమిటంటే...
ముందుగా EmotiYou వెబ్‌సైట్ హోమ్ పేజీలోకి వెళ్లి “Create an Emoticon” ఆప్ష‌న్‌పై క్లిక్ చేయాలి. వెంట‌నే అందులో ఎమోజీ ఎడిట‌ర్ పేజీ ఒపెన్ అవుతుంది. త‌క్ష‌ణ‌మే మీరు ఫొటోల‌ను అనిమేటెడ్ ఎమోజీలుగా మార్చుకోవ‌డం ప్రారంభించ‌వ‌చ్చు. ఇందుకోసం ఎమోజీ ఎడిట‌ర్ పేజీలో 4 సుల‌భ‌మైన ద‌శ‌ల విజార్డ్ మీకు సాయ‌ప‌డుతుంది. 

STEP 1: మీరు అనిమేటెడ్ ఎమోజీ మార్చ‌ద‌ల‌చుకున్న ఫొటోను విజార్డ్ కోరిన మేర‌కు అప్‌లోడ్ చేయాలి. ఆ ఫొటోను మీరు సైట్‌లోకి డ్రాగ్ & డ్రాప్‌ చేయొచ్చు లేదా కిందిభాగంలోకి క‌నిపించే ‘అప్‌లోడ్‌’ బ‌ట‌న్‌ను క్లిక్ చేయాలి. ఈ ఆప్ష‌న్‌ను ఎంచుకున్న‌పుడు మీరు అప్‌లోడ్ చేసే ఫొటో PNG, JPG వ‌గైరా ఫార్మాట్ల‌లో ఉన్నా ప‌ర్వాలేదు. 
STEP 2: అప్‌లోడ్ పూర్తికాగానే ఆటోమేటిక్‌గా స్క్రీన్‌ రెండో ద‌శ‌లోకి తీసుకెళ్తుంది. అక్క‌డ ఫొటో చుట్టూ క‌నిపించే ఫ్రేమ్‌ను అవ‌స‌ర‌మైన‌ట్లుగా డ్రాగ్ చేస్తూ మీకు కావాల్సిన సైజుకు ఫొటో అంచుల‌ను క్రాప్ చేసుకోవాలి. 
STEP 3: అటుపైన స్క్రీన్ కిందిభాగంలో క‌నిపించే “Next Step” బ‌ట‌న్‌ను క్లిక్ చేస్తే మూడో ద‌శ‌లోకి తీసుకెళ్తుంది. అక్క‌డ మీకు అనిమేటెడ్ ఎమోజీ టెంప్లేట్‌లు క‌నిపిస్తాయి. వాటిలోంచి మీకు న‌చ్చిన‌దాన్ని ఎంపిక చేసుకోండి. ప్ర‌తి టెంప్లేట్‌నూ మీ ఫొటోతో క‌లిపి ఒక న‌మూనాను కూడా చూసుకోవ‌చ్చు.
STEP 4: ఈ ప‌ని పూర్త‌య్యాక స్క్రీన్ దిగువ‌న “Next step” బ‌ట‌న్‌ను క్లిక్‌చేస్తే మీ ఫొటో కాస్తా అనిమేటెడ్ ఎమోజీగా మీకు ద‌ర్శ‌న‌మిస్తుంది. ఈ చివ‌రి ద‌శ‌లో కూడా మీ అనిమేటెడ్ ఎమోజీ ప్రివ్యూ చూసుకుని, దాన్ని GIF ఫైల్‌గా డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. ఇలా మీరు సృష్టించిన అనిమేటెడ్ ఎమోజీని మీ స‌న్నిహితులు కూడా వాడుకునేలా మీరు షేర్ చేసుకోవ‌చ్చు. పూర్తి ఉచిత సేవ‌లందించే ఈ వెబ్‌సైట్‌లో మీరు ఎన్ని అనిమేటెడ్ ఎమోజీలైనా త‌యారుచేసుకోవ‌చ్చు. ఇంకెందుకు ఆల‌స్యం... మొద‌లెట్టండి మ‌రి!

జన రంజకమైన వార్తలు