వర్క్ ఫ్రం హోమ్.. ఇండియాలో కొంత మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులకు మాత్రమే తెలిసిన పదం ఇది. ఐటీ, బీపీవో ఎంప్లాయిస్‌కు అదీ పరిమితంగానే వర్క్ ఫ్రం హోం ఆప్షన్లు ఉంటాయి. కానీ కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో జనం ఎక్కువ గుమిగూడకుండా అన్ని దేశాలూ చర్యలు తీసుకుంటున్నాయి. అవకాశం ఉన్న ప్రతి కంపెనీ కూడా తమ ఉద్యోగులను ఇంటి నుంచే పని చేసేలా చూడమని సలహా ఇస్తున్నాయి. ఇప్పటికే ఇండియాలో ఇన్ఫోసిస్, యాక్సెంచర్ లాంటి చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు వర్క్ ఫ్రం హోం చేయమని ఎంప్లాయిస్‌కు చెప్పేశాయి. దేశంలోనే అతిపెద్ద మీడియా సంస్థ అయిన టైమ్స్ గ్రూప్ కూడా తమ రిపోర్టర్లను, ఫీల్డ్ స్టాఫ్‌ను ఇంట్లో నుంచే పని చేసుకొమ్మని చెప్పేసింది. ఇలాంటి పరిస్థితుల్లో వర్క్ ఫ్రం హోం చేయాలంటే మన దగ్గర ఏముండాలనే ప్రశ్న వస్తుంది. వర్క్ ఫ్రం హోం చేయడానికి కావాలసిన గేర్ ఏంటో చూద్దాం.
పీసీ లేదా ల్యాపీ విత్ వైఫై
మంచి వర్కింగ్ కండిషన్లో ఉన్న పీసీ లేదా ల్యాపీ ఉండాలి. వాటితో మనం పనిచేసుకునేలా ఇంట్లో ఓ గది ఉండాలి.
మంచి కీబోర్డు, మౌస్
ఆఫీస్‌లో కీబోర్డులు, మౌస్‌లు ఎప్పటికప్పుడు మారుస్తుంటారు. కాబట్టి టైపింగ్‌లో, ఏదైనా బ్రౌజ్ లేదా డ్రాగ్ అండ్ డ్రాప్ లాంటివి చేయాలన్నా పెద్దగా ఇబ్బంది అనిపించదు. అయితే ఇంట్లో అంత మంచి కీబోర్డు, మౌస్ ఉండవు. కాబట్టి మంచి కీబోర్డు, మౌస్ దగ్గర పెట్టుకోండి. లాగిటెక్ కే480 (Logitech K480) కీబోర్డు చాలా బాగుంటుంది. చాలా స్మూత్‌గా పనిచేస్తుంది. మాక్, విండోస్, ఐవోస్, ఆండ్రాయిడ్, క్రోమ్ ఓఎస్ ఇలా దేనికైనా కంపాటబుల్. ధర 2,199, Logitech G102 Prodigy మౌస్ దీనికి మంచి పెయిర్. ధర 1,395 రూపాయలు.
వైఫై ఎక్స్టెండర్
స్టేబుల్ వైఫై కనెక్షన్ తప్పనిసరి. లేకపోతే పని మధ్యలో ఉండగా నెట్ డిస్కనెక్ట్ అయితే ప్రొడక్టివిటీ మొత్తం పోయినట్లే. మీ వైఫై కనెక్షన్ వీక్‌గా ఉండకుండా చూసుకోవడానికి వైఫై ఎక్స్టెండర్ బాగా పని చేస్తుంది. వీక్‌గా ఉన్న స్పాట్లో వైఫై సిగ్నల్‌ను ఇది బూస్టప్ చేస్తుంది. Netgear EX3110 AC750 లాంటి క్వాలిటీ వైఫై ఎక్స్టెండర్లు మార్కెట్లో చాలా దొరుకుతున్నాయి. దీని ధర 2,079.
ఆన్ ఇయర్ హెడ్‌ఫోన్స్
ఇన్ ఇయర్ (చెవిలో బడ్స్‌లా పెట్టుకునేవి), ఓవర్ ఇయర్ (తల మీద నుంచి పెట్టుకునేవి), ఆన్ ఇయర్ ( చెవి పైన పెట్టుకునేవి) అని రకరకాల ఇయర్‌ఫోన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఆన్ ఇయర్ హెడ్‌ఫోన్స్ వర్క్ ఫ్రం హోమ్‌కు అనువుగా ఉంటాయి. దీనికి మైక్ కూడా తప్పనిసరిగా ఉండాలి. లేదంటే క్లయింట్తోనే ఆఫీస్ వాళ్లతోనే మాట్లాడటం కష్టం.
సోనీ డబ్ల్యూహచ్-సీహెచ్150 వైర్లెస్ ఆన్ ఇయర్ హెడ్‌ఫోన్స్ ఇటీవల మార్కెట్లోకి వచ్చాయి. స్లీక్ డిజైన్, మంచి కంఫర్ట్, మంచి సౌండ్ క్వాలిటీతో 35 గంటల బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. ధర 3,500. వర్క్ ఫ్రం హోమే కాదు మ్యూజిక్ ఎంజాయ్ చేయాలన్నా మొబైల్లో ఏదన్నా వీడియోలు చూడాలన్నా బాగా పనికొస్తుంది.
వెబ్ కెమెరా
టీమ్‌గా పనిచేసేవాళ్లు కూడా ఇప్పుడు వర్క్ ఫ్రం హోమ్ అంటే విడివిడిగా ఉన్నట్లే. టీమ్‌తో మీరు కలిసి పని చేయడం తప్పనిసరి. కాబట్టి వాళ్లతో టచ్‌లో ఉండాలంటే వెబ్‌కెమెరా తప్పనిసరి. Logitech C310 a 720p HD web camera మార్కెట్లో ఉన్న బెస్ట్ కెమెరాల్లో ఒకటి. వైడ్స్క్రీన్తో వస్తుంది. వీడియో కాలింగ్ కూడా చేసుకోవచ్చు. ల్యాపీ, పీసీలకు మంచి కంపానియన్. ధర 1979.
ఆల్ ఇన్వన్ ప్రింటర్
మీ వర్క్‌ను ప్రింటవుట్ తీసుకోవాల్సిన అవసరం ఉందా. అయితే ఇప్పుడు తక్కువ ధరలోనే స్కాన్ అండ్ ప్రింట్ ఆప్షన్లున్న ప్రింటర్లు దొరుకుతున్నాయి. HP DeskJet 2131 లేదా Canon Pixma MG 3070S మల్టిపుల్ ఫంక్షన్ ప్రింటర్లు ట్రై చేయొచ్చు. హెచ్‌పీ ప్రింటర్ ధర 3,074. కెనాన్ అయితే 3,299కు దొరుకుతుంది.