• తాజా వార్తలు

ఆండ్రాయిడ్ ఫోన్‌లో వెబ్‌సైట్లు, యాప్స్‌ను బ్లాక్ చేయ‌డానికి గైడ్‌


మ‌న దేశంలో కోట్ల మంది ఆండ్రాయిడ్ ఫోన్లు వాడుతున్నారు. ఈ ఫోన్‌ను బ్యాంకింగ్‌, చాటింగ్‌, ఈటింగ్‌, డేటింగ్ ఇలా అన్ని అవ‌స‌రాల‌కు ఉప‌యోగ‌పడేలా గూగుల్ ప్లేస్టోర్‌లో కొన్ని ల‌క్ష‌ల యాప్స్ ఉన్నాయి. ఇవి కాక బ్రౌజ‌ర్‌లో వెబ్‌సైట్లు కూడా వాడ‌తాం. అయితే ఇందులో ప‌ర్స‌న‌ల్ ఇన్ఫ‌ర్మేష‌న్ ఉండొచ్చు. ఎవ‌రికీ క‌న‌పడ‌కూడ‌ని ఫైనాన్షియ‌ల్, బ్యాంకింగ్‌ యాప్స్‌, వెబ్‌సైట్లు  కూడా ఉండొచ్చు. అయితే మ‌న ఫోన్ల‌ను పిల్ల‌లు వాడుతున్న‌ప్పుడు వీటిని యాక్సెస్ చేయ‌కుండా చూసుకోవాలి. ఇందు కోసం మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో వెబ్‌సైట్లు, యాప్స్ బ్లాక్ చేయ‌డానికి గైడ్ ఇది.

బ్లాక్‌సైట్‌ను వాడండి
బ్లాక్‌సైట్ అనే యాప్‌తో మీరు మీ ఫోన్‌లో యాప్స్ లేదా వెబ్‌సైట్ల‌ను ఎవ‌రూ ఓపెన్ చేయ‌కుండా అడ్డుకోవ‌చ్చు. ఈ బ్లాక్ సైట్ అనేది ఒక క్రాస్ బ్రౌజ‌ర్ లేదా యూఆర్ ఎల్ బ్లాక‌ర్ అని చెప్పాలి.  దీన్ని మీరు యాక్సెస్ చేసుకుంటే యాప్స్‌, వెబ్‌సైట్ల‌ను బ్లాక్ చేయొచ్చు. మీరు వాడాల‌నుకున్న‌ప్పుడు అన్‌బ్లాక్ చేసుకోవ‌చ్చు. అంతేకాదు షెడ్యూల్డ్ బ్లాకింగ్ కూడా చేసుకోవ‌చ్చు. అంటే మీరు ఆఫీస్ టైమ్‌లో లేదా పిల్ల‌లు ద‌గ్గ‌ర‌లో లేని టైంలో ఆ యాప్స్‌, వెబ్‌సైట్ల‌ను యాక్సెస్ చేసుకునేలా.. మామూలు స‌మ‌యంలో బ్లాక్ అయి ఉండేలా సెట్ చేసుకోవ‌చ్చ‌న్న‌మాట‌. 

బ్లాక్‌సైట్ ఫీచ‌ర్లు ఇవీ.. 
* బ్లాక్‌సైట్  యాప్‌తో మీ ఫోన్‌లో ఉన్న ఏ యాప్‌నైనా బ్లాక్ చేసుకోవ‌చ్చు.

* మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లోని కంటెంట్‌ను కేవ‌లం మీరు మాత్ర‌మే చూడ‌గ‌లిగేలా మేనేజ్ చేయొచ్చు.  

* సోష‌ల్ మీడియా, ఇత‌ర యాప్స్‌ను మీరు చూసే టైమ్ సెట్ చేసుకోవ‌చ్చు.  అంటే స‌మ‌యం కూడా ఆదా అవుతుంది. 

* పోర్న్ సైట్ల వంటి పెద్ద‌లు మాత్ర‌మే చూడ‌గ‌లిగే కంటెంట్ ఉన్న యాప్స్ వెబ్‌సైట్ల‌ను బ్లాక్ చేయొచ్చు. 

* ఈ బ్లాక్‌సైట్ యాప్‌కు పాస్వ‌ర్డ్ ప్రొటెక్ష‌న్ కూడా ఉంటుంది.
 

జన రంజకమైన వార్తలు