• తాజా వార్తలు

మీ స్మార్ట్‌ఫోన్ హ్యాక‌ర్ల బారిన ప‌డ‌కుండా తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌కు గైడ్‌

స్మార్ట్‌ఫోన్ అంటే ఓ చిన్న సైజ్ కంప్యూట‌రే. అందులో ఇప్పుడు బ్యాంకింగ్ స‌హా మ‌న ఇంపార్టెంట్ డేటా అంతా ఫోన్‌లోనే ఉంటుంది కాబ‌ట్టి ఫోన్‌ను కూడా కంప్యూట‌ర్‌లానే అనుకోవాలి. హ్యాక‌ర్ల బారిన‌ప‌డ‌కుండా చూసుకోవాలి. ఇందుకోసం ఏం చేయాలో చూద్దాం.

ఏ సెక్యూరిటీ యాప్ కాపాడ‌లేదు

నా ఫోన్‌లోసెక్యూరిటీ యాప్ ఉంది. హ్యాక్ కాదు అని గుడ్డిగా న‌మ్మ‌కండి. ఏ ఎల‌క్ట్రానిక్ గాడ్జెట‌యినా ఫుల్ సెక్యూర్ ఎప్ప‌టికీ కాదు. అందుకే కొన్ని సూత్రాలు పాటించండి. ఆండ్రాయిడ్‌, ఐవోఎస్ ఏ ఫోన్‌క‌యినా ఇవే సూత్రాలు ఫాలో అవ్వాలి.

అప్‌డేట్ మ‌స్ట్‌

మీ ఫోన్‌ను, అందులో ఉన్న యాప్స్‌ను ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్ చేయండి. ఎందుకంటే ప్ర‌తి అప్‌డేట్‌లోనూ కొత్త సెక్యూరిటీ ప్యాచెస్ వ‌స్తాయి. ఇవి మీ ఫోన్ సెక్యూరిటీనిపెంచుతాయి.

ప్లేస్టోర్ నుంచి మాత్ర‌మే డౌన్‌లోడ్ చేయండి

మీరు ఏదైనా యాప్‌ను ఫోన్‌లో డౌన్‌లోడ్ చేయాల‌న్నా ఆండ్రాయిడ్ యూజ‌ర్ల‌యితే గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యూజ‌ర్ల‌యితే ఐవోఎస్ స్టోర్ నుంచి మాత్ర‌మే డౌన్‌లోడ్ చేయండి. ఇవి త‌ప్ప ఎలాంటి సోర్స్ లేదా లింక్ నుంచి యాప్స్ డౌన్‌లోడ్ వ‌ద్దంటే వ‌ద్దు.

స్ట్రాంగ్ స్క్రీన్‌లాక్ వాడండి

స్మార్ట్‌ఫోన్‌కు స్ట్రాంగ్ స్క్రీన్‌లాక్ త‌ప్ప‌నిస‌రి.

పిన్ పెట్టాల‌నుకుంటే డేట్ ఆఫ్ బ‌ర్త్, 1234, 9999, 0000 లాంటి ఈజీ పాస్‌వ‌ర్డ్‌లు పెట్ట‌కండి. ఆరు అంకెల పాస్‌వ‌ర్డ్ ఉంటే మ‌రింత మంచిది. స్క్రీన్‌లాక్ కూడా వీలైనంత జిగ్‌జాగ్‌గా పెట్టండి. మీ పేరు, ఇంట్లో వాళ్ల పేర్లు వ‌చ్చేలా స్క్రీన్ లాక్ పెట్ట‌డం సేఫ్ కాదు.

బ‌యోమెట్రిక్స్ వాడండి

ఐఫోన్ అయితే ఫేస్ అన్‌లాక్‌, ఆండ్రాయిడ్ అయితే ఫింగ‌ర్‌ప్రింట్ సెన్స‌ర్‌, ఫేషియ‌ల్ రిక‌గ్నైజేష‌న్ మ‌స్ట్‌గా వాడండి.

ప‌బ్లిక్ వైఫై వాడ‌వ‌ద్దు

ప‌బ్లిక్ వైఫైను వాడ‌క‌పోవ‌డ‌మే బెట‌ర్‌. ఎందుకంటే ప‌బ్లిక్ వైఫై సెక్యూరిటీప‌రంగా చాలా వీక్‌గా ఉంటుంది. మాల్వేర్స్ చొర‌బ‌డే ప్ర‌మాదం ఉంటుంది. ఒక‌వేళ ప‌బ్లిక్ వైఫై వాడాల్సిన ప‌రిస్థితే వ‌స్తే వీపీఎన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని దాని ద్వారా వాడండి.

నాన్ డేటా కేబుల్స్‌తో ఛార్జింగ్

బ‌య‌ట ఏదైనా కంప్యూట‌ర్తో మీ ఫోన్‌ను ఛార్జ్ చేయాల్సి వ‌చ్చిన‌ప్ప‌డు నాన్ డేటా కేబుల్‌నే వాడండి . ఎందుకంటే ఈ కేబుల్‌లో డేటాను ట్రాన్స్ఫ‌ర్ చేసే అవ‌కాశం ఉండ‌దు. అదే మామూలు చార్జింగ్ కేబుల్ వాడితే అందులో మీ డేటాను ట్రాన్స్ఫ‌ర్ చేసుకునే అవ‌కాశం ఉంటుంది. అది సెక్యూరిటీ స‌మ‌స్య‌లు తెచ్చిపెడుతుంది.

జన రంజకమైన వార్తలు