ప్రపంచంలో ఎన్ని స్మార్ట్‌ఫోన్లు ఉన్నా మనకు అన్ని నంబర్లూ ఒకేలా ఉండవు. ఒక్కో ఫోన్‌కు ఒక యూనిక్ నంబర్ ఉంటాయి. కానీ చాలామందికి తమ నంబర్ ఏమిటో కూడా మర్చిపోతుంటారు. ఎవరికైనా చెప్పాలన్నా చాలా కష్టపడుతుంటారు. ఎందుకంటే పదే పదే నంబర్లు మార్చడమే దీనికి కారణం. మరి సొంత నంబర్ ఏమిటో తెలుసుకోవడం చాలా మందికి తెలియదు. మరి ఒకరికి డయిల్ చేయకుండానే మన నంబర్ ఏంటో తెలుసుకుందామా!
యూఎస్ఎస్‌డీ కోడ్ ద్వారా..
యూఎస్ఎస్‌డీ కోడ్‌ను ఉపయోగించి మన నంబర్ ఏమిటో వెంటనే తెలుసుకోవచ్చు. దీని కోసం మన ఆండ్రాయిడ్ ఫోన్లో కాల్ డయిలర్‌ను ఓపెన్ చేయాలి. మీ ఆపరేటర్ ఏంటో సెలక్ట్ చేసుకోవాలి. అంటే జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్, టాటా ఇలా ఏ ఆపరేటరో ఆ ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తర్వాత ఆ ఆపరేటర్‌కు సంబంధించిన యూఎస్ఎస్‌డీ కోడ్‌ని ఎంచుకోవాలి. డయల్ చేయాలి అంతే మీరు వాడుతున్న మొబైల్ నంబర్ ఏంటో తెలిసిపోతుంది.
ఏ నెట్‌వర్క్‌కు ఏ కోఢ్
ఎయిర్‌టెల్ *121#
బీఎస్ఎన్ఎల్ *1#
వొడాఫోన్ *111*2#
టాటా డొకొమో *580#
రిలయన్స్ జియో *1#
ఐడియా *147#
టెలినార్ *1#