మనం మన సన్నిహితులు, కుటుంబ సభ్యులతో రోజూ ఫోన్‌లో టచ్‌లో ఉంటాం. రోజూ వాళ్లతో మాట్లాడుతూనే ఉంటాం. కానీ మీకు కావాల్సిన వాళ్లు దూరంగా ఉన్నప్పుడు వాళ్లు ఎలాంటి ఆపదలో చిక్కుకోకుండా ఎక్కడ ఉన్నారో ఏం చేస్తున్నారో తెలుసుకోవడం ఎలా?.. సాంకేతికత పెరిగిన తర్వాత ఇందుకు చాలా మార్గాలు వచ్చాయి. అందులో కీలకమైంది ట్రాకింగ్. అంటే వాళ్ల ఫోన్‌ను ట్రాక్ చేయడం ద్వారా ఎక్కడ ఉన్నారు.. ఎంతసేపు ఉన్నారు ఎవరితో మాట్లాడుతున్నారు లాంటి విషయాలను మనం కనిపెట్టొచ్చు. మరి ఇలా కనిపెట్టడానికి ఉన్న మార్గాలేమిటో తెలుసా!
లైఫ్ 360
మన కుటుంబ సభ్యులను లేదా స్నేహితులను ట్రాక్ చేయడానికి లైఫ్ 360 యాప్ చాలా కీలకమైంది. మరి ఈ కీలకమైన ఎలా పని చేస్తుంది.. ఎలా మనకు సమాచారం అందిస్తుంది అనుకుంటున్నారా? .. దీనిలో ఉండే లొకేషన్ ట్రాకర్ మీకు సంబంధించిన వారి నెంబర్లను గుర్తించి వారి లొకేషన్‌ను మీకు షేర్ చేస్తుంది. మీ ఫ్యామిలీ సర్కిల్స్‌లో ఎవరు ఉన్నారు ఎంత మంది ఉన్నారు అన్నదాన్ని బట్టి ఈ యాప్‌ను ఉపయోగించుకోవచ్చు. లైష్ 36- యాప్ చాలా కచ్చితంగా పని చేస్తుంది. అయితే మీ సన్నిహితులకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉండడం ముఖ్యం.
గూగుల్ మ్యాప్స్
ఇతరుల ఫోన్‌లను ట్రాక్ చేయడానికి గూగుల్ మ్యాప్స్ కూడా బాగా యూజ్ అవుతుంది. దీని వల్ల మీ సన్నిహితులే కాదు మీ సొంత లొకేషన్ హిస్టరీ కూడా తెలుసుకోవచ్చు. ఈ ట్రాకింగ్ యాప్ మీకు పూర్తిగా ఉచితం దీన్ని సెటప్ చేయడం యూజ్ చేయడం చాలా సులభం కూడా. లైఫ్ 360 మాదిరిగానే గూగుల్ మ్యాప్స్ ద్వారా మీ స్నేహితులకు సంబంధించి ఫోన్ ఎక్కడ ఉందో లొకేషన్ ద్వారా కనిపెట్టే అవకాశం ఉంది. లొకేషన్ షేరింగ్ ఆప్షని ఆన్‌లో పెట్టుకోవాలి. మీకు కావాల్సిన వారికి లొకేషన్ షేర్ చేయాలి. లేకపోతే వారిని లొకేషన్ షేర్ చేయమని సూచించాలి.
గ్లింప్స్
మీన వాళ్ల ఆచూకిని కనిపెట్టడానికి వాడే మరో యాప్ గ్లింప్స్. ఆండ్రాయిడ్, ఐవోఎస్, విండోస్ ఫోన్‌లో కూడా ఈ యాప్ పని చేస్తుంది. దీన్ని మీ కార్‌తో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. గ్లింప్స్ ద్వారా మీ లొకేషన్‌ను షేర్ చేస్తే చాలు.. మీరు ఎక్కడికి వెళ్లినా ఇది మీ సన్నిహితులకు మీకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది. ఇది 5 నిమిషాల నుంచి 12 గంటల వరకు సమాచారాన్ని అందించడం మరో విశేషం. మీరు దూర ప్రయాణాలు వెళుతున్నప్పుడో లేదా ఒంటరిగా వెళుతున్నప్పుడో ఈ యాప్ బాగా యూజ్ అవుతుంది.