మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్ ఇప్పుడు అందరికీ బాగా అలవాటయింది. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, జాతీయ నేతలు మాత్రమే ఒకప్పుడు ట్విటర్ వాడేవారు. ఇప్పుడు మన గల్లీ లీడర్స్ కూడా ట్వీట్లు చేస్తున్నారు. ఇక యూత్ సంగతి సరేసరి. ఇలాంటి పరిస్థితుల్లో ట్విటర్ కూడా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు తెస్తోంది. అందులో భాగంగానే ఇటీవల వాయిస్ ట్వీట్‌ను ప్రవేశపెట్టింది. ట్వీట్‌కు వీడియోలు యాడ్ చేయడం ఇంతకు ముందే ఉంది. ఇప్పుడు వాయిస్ ఫైల్స్ కూడా ఎటాచ్ చేయొచ్చన్నమాట.
ప్రస్తుతం ఐవోఎస్‌లోనే.. త్వరలో ఆండ్రాయిడ్‌లోనూ
మొదట ట్విటర్ ఐవోఎస్ యాప్ వాడుతున్నవారిలో కొంతమందిని సెలెక్ట్ చేసి ఈ వాయిస్ ట్వీట్ ఫీచర్‌ను ట్విటర్ అందజేసింది. అది సక్సెస్ కావడంతో మరికొందరికి లేటెస్ట్‌గా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. త్వరలో చివరికల్లా ఆండ్రాయిడ్ ఫోన్లకూ అందుబాటులోకి తేవచ్చు.
ఎలా వాడుకోవాలి?
* మీ ట్విటర్ ఐవోఎస్ యాప్‌ను ఓపెన్ చేయండి.
* ట్వీట్ కంపోఎజ్ ఐకాన్‌ను టాప్ చేయండి.
* దానికింద వాయిస్ ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని టాప్ చేయండి.
* ఇప్పుడు రెడ్ కలర్‌లో ఉన్న రికార్డింగ్ బటన్ నొక్కండి. మీ వాయిస్ మెసేజ్ చెప్పేశాక డన్ బటన్ టాప్ చేయండి.
* మీరు ప్రతి ట్వీట్‌కు 2 నిమిషాల 20 సెకన్లపాటు వాయిస్ ట్వీట్ చెప్పి యాడ్ చేయొచ్చు.
* వాయిస్ ట్వీట్ పూర్తవయ్యాక ట్వీట్ టూ సెండ్‌ను టాప్ చేస్తే మీ ట్వీట్ వాయిస్ మెసేజ్‌తో కలిసి వెళుతుంది.
* కంటి చూపు లేనివారికి కూడా మీ ట్వీట్ చేరుతుంది.