కరోనా వ్యాప్తి చెందుతున్న వేళ అన్నింటికి టెక్నాలజీనే వాడుతున్నాం. పిల్లలకు ఆన్లైన్ క్లాసులు, ఉద్యోగులకు మీటింగులు ఇలాంటి వాటి కోసం గూగుల్ తీసుకొచ్చిన గూగుల్ మీట్ బాగా ఉపయోగపడుతోంది. ఇప్పుడు గూగుల్ మీట్‌లో జరిగే మీ మీటింగ్‌ని టీవీలో కూడా చూస్కొవచ్చు . గూగుల్ క్రోమ్ కాస్ట్ ఉంటే మీ వీడియో కాన్ఫెరెన్సును పెద్ద టీవీ తెరపై చూడొచ్చు.
ఎలా వాడుకోవాలి?
1) గూగుల్ మీట్ వీడియో కాన్ఫెరెన్సుని స్టార్ట్ చేయండి.
2) కాస్ట్ అనేబుల్డ్ డిస్‌ప్లేని ఆన్ చేయండి.
3) ఇప్పుడు మీ సిస్టం కాస్ట్ డివైస్‌ను డిటెక్ట్ చేస్తుంది. కాస్ట్ ట్యాబ్‌లో కాస్ట్ దిస్ మీటింగ్‌ను సెలక్ట్ చేయండి.
4) తర్వాత కాస్ట్ అనేబుల్డ్ డివైస్ ను సెలెక్ట్ చేయండి.
మీటింగ్ జరుగుతుండగా జాయిన్ అవ్వాలంటే
* గూగుల్ మీట్ స్క్రీంలో కింద ఉన్న త్రీ డాట్ మెనూని క్లిక్ చేయండి.
* కాస్ట్ దిస్ మీటింగ్‌ను సెలక్ట్ చేయండి.
* తర్వాత కాస్ట్ అనేబుల్డ్ డివైస్‌ను క్లిక్ చేయండి. అంతే ఇప్పటికే టీవీలో కాస్ట్ అవుతున్న మీటింగ్‌లో మీరు కూడా జాయినైపోతారు.
టీవిలో లైవ్ ఆపాలనుకుంటే కుడి వైపున కింద ఉన్న స్టాప్ కాస్టింగ్ మీటింగ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి.