ఫేస్‌బుక్ యూజర్ల పర్సనల్ డేటాను కేంబ్రిడ్జి అనలిటికా అనే డేటా మైనింగ్ కంపెనీ యూజర్లకు తెలియకుండానే సేకరించి అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో వాడుకుందన్న వార్తలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనమయ్యాయి. రాజకీయ పార్టీలు తమ ప్రచారానికి, ప్రత్యర్థి పార్టీలను విమర్శించడానికి ఫేస్‌బుక్‌ను మించిన సాధనం లేదనుకుంటున్నాయి. ఎందుకంటే చౌకగా, అందరికీ చేరిపోయే మీడియాగా ఫేస్‌బుక్ ఇప్పుడు అందరికీ కనిపిస్తోంది. అయితే మీరు కూడా ఇలాంటి డేటా స్కాంలో చిక్కుకోకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలియజెప్పేందుకు కంప్యూటర్ విజ్ఞానం ప్రత్యేకంగా ఈ ఆర్టికల్‌ను అందిస్తోంది.
పర్సనల్ డేటాను ఇలా కాపాడుకోండి
పర్సనల్ డేటాను ఇలా తమకు చెప్పకుండా ఇష్టారాజ్యంగా ప్రపంచవ్యాప్తంగా చాలా మంది యూజర్లు #deletefacebook ఉద్యమానికి మద్దతిస్తున్నారు. అయితే ఫేస్‌బుక్‌తో ఉన్న సౌలభ్యాలు, ఫ్రెండ్స్, బంధువులు, కొలీగ్స్‌తో సంబంధాలు కొనసాగించడంలో ఫేస్‌బుక్‌కు ఉన్న వెసులుబాట్ల నేపథ్యంలో దాన్నిరిమూవ్ చేయడానికి ఎక్కువ మంది ఇష్టపడరు. అందుకే మీ ఫేస్‌బుక్‌లో పర్సనల్ డేటాను యాప్స్ యాక్సెస్ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలంటే..
1. వెబ్‌బ్రౌజర్‌లో మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వండి.
2. టాప్‌లో రైట్ సైడ్ ఉన్నడ్రాప్‌డౌన్ మెనూలోకి వెళ్లి Settingsలోకి ఎంటరవ్వండి
3. లెఫ్ట్ సైడ్‌లో ఉన్నApps మీద క్లిక్ చేయండి.
4. ప్రతి యాప్‌ను సెలెక్ట్ చేసి ఏ ఇన్ఫర్మేషన్‌ను వాటితో మీరు షేర్ చేసుకుంటున్నారో చూడండి.
5.info you provide to this app అనే దాని తర్వాత ఉన్న బ్లూ అండ్ వైట్ చెక్‌మార్క్‌ను క్లిక్ చేసి మీరుఇచ్చిన పర్మిషన్లను ఎడిట్ చేసుకోవచ్చు.
6. అసలు ఆ యాప్ మీకు అవసరం లేదనుకుంటే దానిమీద క్లిక్ చేయండి.కార్నర్‌లో కనిపించే X బటన్‌ను నొక్కండి. తర్వాత రిమూవ్ అని వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే ఆ యాప్ రిమూవ్ అయిపోతుంది.
యాప్స్‌లోనే ఎడిట్ చేయండి..
ఇది కాక మరో పద్ధతి కూడా ఉంది.
1. మీ ఫేస్‌బుక్ హోం పేజీలో ఉన్నడ్రాప్ డౌన్ మెనూలోకి వెళ్లి సెట్టింగ్స్‌లోకి వెళ్లండి.
2. ఇప్పుడు మీ ఫేస్‌బుక్ పేజీలో ఎడమవైపు మెనూలో Apps మీద క్లిక్ చేయండి.
3. యాప్స్ సెట్టింగ్స్ పేజీలో కింద భాగంలో Apps Others Use అనే బాక్స్ కనిపిస్తుంది. దానిలో ఉన్న Edit బటన్ క్లిక్ చేయండి.
4. ఇప్పుడు దానిలో మీ బర్త్‌డే, బయోడేటా, హోం టౌన్, కరెంట్ లివింగ్ ఇలా అన్ని వివరాలు కనిపిస్తాయి. టిక్ మార్క్ ఉంటే ఆ వివరాలన్నీ యాప్స్ షేర్ చేసుకుంటున్నాయన్నమాట. ఆ టిక్ మార్క్‌ను తీసేసి సేవ్ చేయండి. అంటే ఆ వివరాలేవీ ఆ యాప్స్ యాక్సెస్ చేయలేవు.
మీ పోస్ట్‌ల విషయంలోనూ జాగ్రత్త
మీ పోస్ట్‌లు లేదా పర్సనల్ ఇన్ఫర్మేషన్ చూసే ఫ్రెండ్స్ లిస్ట్‌లోనూ జాగ్రత్తలు తీసుకోండి. లేదంటే ఆ ఆప్షన్లలో ఫ్రెండ్స్‌తోపాటు పబ్లిక్ కూడాచూడవచ్చనే ఆప్షన్ ఉంటే అందరికీ మీ వివరాలుయాక్సెస్ అయ్యే ప్రమాదముంది. దీనికి ఏం చేయాలంటే
1. వెబ్‌బ్రౌజర్‌లో ఫేస్‌బుక్‌కు లాగిన్ అవ్వండి.
2. Settings వెళ్లి Privacyని క్లిక్ చేయండి. దానిలో లెఫ్ట్ సైడ్ కనిపించే Timeline and Taggingను సెలెక్ట్ చేయండి.
3.సెట్టింగ్స్‌లోకి వెళ్లి Friendsను మాత్రమే క్లిక్ చేయండి. అప్పుడు మీ పోస్ట్‌లు, షేరింగ్‌లు, ట్యాగ్స్ మీ ఫ్రెండ్స్‌కు మాత్రమే కనిపిస్తాయి.