• తాజా వార్తలు

గూగుల్ క్రోమ్ బ్రౌజ‌ర్‌లో క్యాషేను సింపుల్‌గా రిమూవ్ చేయ‌డానికి గైడ్

గూగుల్ క్రోమ్‌, మొజిల్లా ఫైర్‌ఫ్యాక్స్‌, ఒపెరా ఇలా ఏ బ్రౌజ‌ర్ అయినా మీరు వాడేట‌ప్పుడు దానిలో క్యాషే (cache) స్టోర్ అవుతుంది. ఇది మీరు మ‌ళ్లీ ఆ వెబ్‌సైట్ సెర్చ్ చేసేట‌ప్పుడు ఆటోమేటిగ్గా చూపిస్తుంది. అయితే ఎప్ప‌టిక‌ప్పుడు క్యాషేను తొల‌గించ‌క‌పోతే అది మీ డేటాను కొట్టేయాల‌నుకునే వారికి మంచి ఆప్ష‌న్ అవుతుంది. అందుకే ఎప్ప‌టిక‌ప్పుడు క్యాషేను తొల‌గించుకోవాలి. ఇదేమంత బ్ర‌హ్మ‌విద్య కూడా కాదు. మ‌నం ఎక్కువ‌గా వినియోగించే గూగుల్ క్రోమ్ బ్రౌజ‌ర్‌లో క్యాషేను ఈజీగా రిమూవ్ చేయ‌డానికి సింపుల్ గైడ్ ఇదిగో.. 1. క్రోమ్ బ్రౌజ‌ర్ ఓపెన్ చేయండి. ఇప్పుడు బ్రౌజ‌ర్ టాప్‌లో ఉన్న త్రీడాట్స్ లేదా త్రీబార్ మెనూను క్లిక్ చేయండి. 2. మెనూ ఓపెన్ అయ్యాక అందులో సెట్టింగ్ ఆప్ష‌న్‌ను క్లిక్ చేయండి. 3. సెట్టింగ్స్‌లోకి ఎంట‌ర‌య్యాక ప్రైవ‌సీ అండ్ సెక్యూరిటీలోకి వెళ్లి క్లియ‌ర్ బ్రౌజింగ్ డేటా అనే ఆప్ష‌న్‌ను క్లిక్ చేయండి. 4. అందులో ఇప్పుడు మీకు మూడు టైమ్ రేంజ్‌లు క‌నిపిస్తాయి. లాస్ట్ అవ‌ర్, లాస్ట్ 24 అవ‌ర్స్‌, లాస్ట్ 7 డేస్‌, లాస్ట్ 4 వీక్స్ అండ్ ఆల్ టైమ్ ఆనే ఆప్ష‌న్లుంటాయి. వీటిలో మీరు ఎంత వ‌ర‌కు క్యాషేను క్లియర్ చేయాల‌నుకుంటే ఆ టైమ్ ఫ్రేమ్ ముందున్న చెక్ బాక్స్‌ను టిక్ చేయండి. 5. త‌ర్వాత బ్రౌజింగ్ హిస్ట‌రీ, కుకీ హిస్ట‌రీ, డౌన్‌లోడ్ హిస్ట‌రీ, Cached images and files అనే ఆప్ష‌న్ల‌ను త‌ప్ప‌నిస‌రిగా టిక్ చేయండి. 6. అంతే ఇంతకు ముందు మీరు ఆబ్రౌజ‌ర్‌లో సెర్చ్ చేసిన వెబ్ అడ్ర‌స్‌ల‌న్నీ క్లియ‌ర్ అయిపోతాయి. అయితే ఇలాంట‌ప్పుడు మీరు రెగ్యుల‌ర్గా వినియోగించే జీమెయిల్ లాంటివి కూడా అడ్ర‌స్ బార్‌లో నుంచి పోతాయి. కాబ‌ట్టి వాటిని మ‌ళ్లీ సెర్చ్ చేసి సైన్ ఇన్ కావాల్సి ఉంటుంది.

జన రంజకమైన వార్తలు