• తాజా వార్తలు

వాట్సాప్‌లో పేమెంట్స్ చేయ‌డానికి తొలి గైడ్

మెసేజింగ్ స‌ర్వీస్‌గా ప్ర‌పంచ‌వ్యాప్తంగా పాపుల‌ర‌యిన వాట్సాప్ ఇప్పుడు పేమెంట్ ఆప్ష‌న్‌ను కూడా ప్రారంభించింది. రెండేళ్ల కింద‌టే దీన్ని ప్రారంభించినా నేష‌నల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) అనుమ‌తి తాజాగా ల‌భించింది. దీంతో 2 కోట్ల మంది యూజ‌ర్ల‌తో పేమెంట్ ఆప్ష‌న్‌ను ప్రారంబించ‌బోతున్న‌ట్లు వాట్సాప్ ప్ర‌క‌టించింది. వాట్సాప్‌లో పేమెంట్ ఎలా చేయాలో చూద్దాం.

వాట్సాప్  పేమెంట్ సెట్ చేయ‌డం ఎలా? 
* వాట్సాప్ ఓపెన్ చేయండి.
* త్రీ డాట్స్ మెనూలోకి వెళ్లి పేమెంట్స్‌ను క్లిక్ చేయండి.  
* యాడ్ న్యూ పేమెంట్ మెథ‌డ్‌ను సెలెక్ట్ చేయండి.
*  యాక్సెప్ట్ అండ్ కంటిన్యూను సెలెక్ట్  చేయండి.
* ఇప్పుడు వ‌చ్చే లిస్ట్‌లో నుంచి మీకు ఖాతా ఉన్న బ్యాంక్‌ను సెలెక్ట్ చేసుకోండి. ఈ బ్యాంక్ అకౌంట్‌కు యూపీఐ అకౌంట్ త‌ప్ప‌నిస‌రిగా ఉండాలి.   
* ఇప్పుడు మీ ఫోన్ నెంబ‌ర్‌ను సెలెక్ట్ చేయండి. మీ వాట్సాప్ ఫోన్ నెంబ‌ర్ మీరు బ్యాంక్ అకౌంట్‌కు లింక్ చేసిన రిజిస్ట‌ర్డ్ మొబైల్ నెంబ‌ర్ ఒక‌టే అయి ఉండాలి.  
* వెరిఫై ఎస్ఎంఎస్‌ను క్లిక్ చేస్తే మీ బ్యాంక్ అకౌంట్ అథెంటికేట్ అవుతుంది.
* ఇప్ప‌డు హిట్ బ‌ట‌న్ నొక్కితే మీ సిమ్ కార్డ్‌ను వాట్సాప్ అథెంటికేగ‌ట్ చేస్తుంది.  
* అలౌ బ‌ట‌న్‌ను క్లిక్ చేస్తే వాట్సాప్ పేమెంట్స్ మెసేజ్‌లు మీ మొబైల్ నెంబ‌ర్‌కు వ‌స్తాయి.  
* డ‌న్ బ‌ట‌న్ నొక్కితే వాట్సాప్ పేమెంట్ సెట‌ప్ అవుతుంది.  

వాట్సాప్ ద్వారా మ‌నీ సెండ్ చేయ‌డం రిసీవ్ చేసుకోవ‌డం ఎలా?
వాట్సాప్ పేమెంట్ పూర్త‌య్యాక మీరు పేమెంట్స్‌చేయ‌డం చాట్ చేసినంత సులువు.  
* మీ చాట్ విండోలోనే పేమెంట్ ఆప్ష‌న్ క‌నిపిస్తుంది. 
* పేమంట్స్ బ‌ట‌న్‌ను క్లిక్ చేసి మీ కాంటాక్ట్ లిస్ట్‌లో ఎవ‌రికి డ‌బ్బులు పంపాలో సెల‌క్ట్ చేయండి. 
 * ఎంత అమౌంట్ సెండ్ చేయాలో ఎంట‌ర్ చేయండి. ఏదైనా నోట్ రాయాల‌న్నా రాయొచ్చు.  
* ఇప్పుడు మీ యూపీఐ పిన్ ఎంట‌ర్ చేయండి.  
* అంతే మీ బ్యాంక్ అకౌంట్ నుంచి ఆ మ‌నీ మీ కాంటాక్ట్‌కు సెండ్ అవుతుంది.

జన రంజకమైన వార్తలు