మనం ప్రస్తుతం ఎలాంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లు చేయాలన్నా, ఐటీ ఫైల్ చేయాలన్నా అన్నింటికీ పాన్ కావాలి. పర్మినెంట్ అకౌంట్ నంబర్ (పాన్)లో ఏ మాత్రం తేడా ఉన్నా అది మీకు భవిష్యత్తులో ఇబ్బందే. అంటే మీ పేరు, తండ్రి పేరు, పుట్టిన సంవత్సరం ఇలా డిటెయిల్స్ అన్నీ పక్కాగా ఉండాలి. అయితే ఒకవేళ మీ పాన్‌లో అలాంటి వివరాలు ఏమైనా తప్పుగా నమోదయితే వాటిని మీరే సొంతంగా ఎడిట్ చేసుకోవచ్చు.
అది ఎలా చేసుకోవాలో చెప్పే గైడ్ మీకోసం..
1) మీ ఇంటర్నెట్ బ్రౌజర్‌లో https://www.tin-nsdl.com/ అనే వెబ్‌సైట్ ఓపెన్ చేయండి
2) వెబ్‌సైట్‌లోకి వెళ్లాక సర్వీసెస్ సెక్షన్‌లో PAN అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి.
3) దానిలో Change/ Correction in PAN data Apply అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
4) మెనూను కిందికి లాగి అందులో ఉన్న ఆప్షన్లలో Changes or Correction in existing PAN data? Reprint of PAN Cardని సెలెక్ట్ చేయండి.
5) ఇప్పుడు మీ పాన్ కార్డ్ కేటగిరీ సెలెక్ట్ చేయండి.
6) మీపర్సనల్ డిటెయిల్స్ ఎంటర్ చేయాలి.
7) కేప్చా ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టండి
8) ఇప్పుడు మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడీకి ఒక టోకన్ నంబర్ వస్తుంది. దాని కింద ఉన్న బటన్ క్లిక్ చేస్తే కంటిన్యూ అవుతారు.
9) Submit sacnned Images through e-sign on NSDL e-govను క్లిక్ చేయండి. ఇప్పుడు మిమ్మల్ని మరో పేజీలోకి డైరెక్ట్ చేస్తుంది.
10) ఆ పేజీలో అడిగిన వివరాలు ఇచ్చి నెక్స్ట్ నొక్కండి
11) ఇప్పుడు మరోపేజీలోకి తీసుకెళుతుంది. అక్కడ మీరు మీ అడ్రస్ చేంజ్ చేసుకోవచ్చు.
12) మీ అడ్రస్ ప్రూప్, ఏజ్ ప్రూఫ్, ఐడెంటిటీ ప్రూఫ్ ని అప్‌లోడ్ చేయాలి.
13) డిక్లరేషన్ సైన్ చేసి సబ్మిట్ నొక్కండి.
14) ఇప్పుడు మీరు పేమెంట్ గేట్‌వేకు వెళతారు. ఎందుకంటే పాన్ కార్డ్‌లో మార్పుచేర్పులు చేయాలంటే కొంత అమౌంట్ కట్టాలి. మీరు చేసుకున్న మార్పులకు ఎంత అమౌంట్ కట్టాలో చూపిస్తుంది. ఆ అమౌంట్ పే చేయండి. ఇప్పుడు మీకు అకనాలెడ్జ్‌మెంట్ స్లిప్ వస్తుంది. దాన్ని ప్రింట్ తీసి, ప్రూఫ్స్‌కి సంబంధించిన ప్రింటవుట్లు, మీ ఫోటో, దానిమీద మీ సంతకం పెట్టి, మీకు దగ్గరలోని NSDL e-gov ఆఫీస్‌కి కొరియర్ లేదా పోస్ట్ చేయాలి. అప్పుడు మీరు మార్పులు చేసిన విధంగా పాన్ మార్చి మీకు పంపిస్తారు.