• తాజా వార్తలు

జీమెయిల్ త‌ప్పుగా పంపించారా.. అయితే రీకాల్ చేయ‌డానికి గైడ్‌

జీమెయిల్ అనేది దాదాపు అంద‌రికీ బేసిక్ ఈమెయిల్ ఆప్ష‌న్ అయిపోయింది. అయితే ఎప్పుడ‌న్నా పొర‌పాటుగా ఒక‌రికి పంప‌బోయి వేరొక‌రి మెయిల్ పంపించారా?  ఈమెయిల్‌లో ఎటాచ్‌మెంట్స్ అవీ లేకుండానే పంపేశారా? అలాంటి సంద‌ర్భాల్లో మీరు పంపిన మెయిల్‌ను రీకాల్ చేయ‌డానికి జీమెయిల్‌లో ఆప్ష‌న్ ఉంది. దాన్ని ఎలా వాడుకోవాలో చూద్దాం. 

జీమెయిల్ రీకాల్ చేయ‌డానికి  స్టెప్ బై స్టెప్ గైడ్ 
1. మీ జీమెయిల్ అకౌంట్‌లో సైన్ ఇన్ అవ్వండి

2. త‌ర్వాత సెట్టింగ్స్‌లోకి వెళ్లి  అందులో ఉన్న జ‌న‌ర‌ల్ ఆప్ష‌న్‌ను క్లిక్ చేయండి.

3. జ‌న‌ర‌ల్ సెక్ష‌న్‌లో మీకు Undo send option కనిపిస్తుంది. దాన్ని అనేబుల్ చేసుకోండి (ఇంత‌కు ముందే మీరు దాన్ని అనేబుల్ చేసి ఉంటే ఓకే) 

4. send cancellation period ఆప్ష‌న్ క్లిక్ చేసి మీరు జీమెయిల్ రాక‌ల్ చేయ‌డానికి టైం సెట్ చేయండి. ఐదు సెక‌న్ల నుంచి ముప్పై సెక‌న్ల‌లోపు మాత్ర‌మే మీరు టైమ్ సెట్ చేసుకోగ‌ల‌రు. 

5. టైమ్ సెట్ చేసుకున్నాక పేజీ కింద భాగంలో ఉన్న సేవ్ ఛేంజెస్‌ను క్లిక్ చేయండి.

6. ఇప్పుడు మీరు మీ జీమెయిల్‌ను రీకాల్ చేసుకోవ‌డానికి సిద్ధ‌మ‌య్యార‌న్న‌మాట‌. 

7. ఇప్పుడు ఒక టెస్ట్ మెయిల్ ఎవ‌రికైనా పంపండి. మీరు సెట్ చేసుకున్న టైం ఫ్రేమ్ కంటే ముందు కింద భాగంలో ఎడ‌మ‌వైపు ఉన్న  Undo ఆప్ష‌న్ క్లిక్ చేయండి.

8.ఇప్పుడు మీకు మెయిల్ రీకాల్ అవుతుంది. sending undone అనే మెసేజ్ కూడా ఫ్లాష్ అవుతుంది.

9. అయితే మీరు సెట్ చేసుకున్న టైం ఫ్రేం (5 నుంచి 30 సెక‌న్ల‌లోపు) లోపులో మాత్ర‌మే మీరు మీజీమెయిల్‌ను రీకాల్ చేయ‌గ‌ల‌ర‌ని గుర్తు పెట్టుకోండి. ఆ టైం దాటాక అన్ డూ టాప్ చేసినా మీ మెయిల్ అప్ప‌టికే సెండ్ అయిపోతుంది. 
 

జన రంజకమైన వార్తలు