ప్రపంచవ్యాప్తంగా వాహనాల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతోంది. భారత్ లాంటి దేశాల్లో కూడా ఇంటికి రెండు వెహికల్స్ ఇప్పుడు కామన్. దీంతో పెట్రోలియం నిల్వలు వేగంగా ఖర్చయిపోతున్నాయి. దీంతో ప్రత్యామ్నాయాల వైపు టెక్నాలజీ దిగ్గజాలు, ట్రాన్స్‌పోర్ట్ కంపెనీలు దృష్టి పెట్టాయి. సోలార్ పవర్‌తో వెహికల్స్ నడిపే టెక్నాలజీపైన పరిశోధనలు జరగడమే కాదు ఈ టెక్నాలజీతో నడిచే వాహనాలు కూడా వస్తున్నాయి. అయితే ఇందులో చాలా లిమిటేషన్స్ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాన్ ముస్క్ హైపర్‌లూప్ టెక్నాలజీతో నడిచే వాహనాల డిజైనింగ్‌పై దృష్టి పెట్టారు. అండర్‌గ్రౌండ్‌లో మాగ్నటిక్ పవర్‌తో నడిచేదే హైపర్‌లూప్ కథేంటో చదవండి.
హైపర్‌లూప్ అంటే..
టెస్లా పేరిట వచ్చిన ఎలక్ట్రిక్ కార్, ఏరోస్పేస్ ఫర్మ్ స్పేస్ ఎక్స్‌ల సృష్టికర్త ఎలాన్ ముస్క్ బ్రెయిన్ చైల్డ్ ఈ హైపర్‌లూప్ ప్రాజెక్ట్. ముస్క్ అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో ట్రాఫిక్ హెవీగా ఉన్న ఓ రోడ్‌లో వెళుతున్నప్పుడు ఆల్టర్నేట్ ట్రాన్స్‌పోర్ట్ గురించి ఆలోచించాడు. అలా హైపర్‌లూప్ పురుడు పోసుకుంది. ఒక లీనియర్ ఎలక్ట్రిక్ మోటార్‌ను ఒక పాడ్ (లో ప్రెషర్ ట్యూబ్)లో యాక్సిలరేటింగ్, డీయాక్సిలరేటింగ్ చేయడం ద్వారా దాన్ని ముందుకు తీసుకెళ్లడం అనేది హైపర్‌లూప్ లోని ముఖ్యమైన మెకానిజం. ప్యాసింజర్స్‌తోపాటు ఈ పాడ్ ద్వారా సరకు రవాణా కూడా చేయొచ్చు. పాడ్ పొడవునా ఈ యాక్సిలరేట్, డీయాక్సిలరేట్ మెకానిజం కోసం మాగ్నటిక్ ఎరేస్ ఉంటాయి. దీంతోపాటు పాడ్ చుట్టూ ఓ ఎయిర్ కుషన్ కోసం మోటార్ కూడా ఉంది. ఈ కుషన్ హైస్పీడ్‌లో కూడా పాడ్‌ను స్టేబుల్‌గా ఉంచి ప్యాసింజర్‌కు కంఫర్ట్ ఇస్తుంది.
హైపర్‌లూప్ ఎందుకంటే..
ఇప్పటికే కార్లు, బస్‌లతో రోడ్ ట్రాన్స్‌పోర్ట్, ట్రైన్‌లు, షిప్‌లు, ఏరోప్లేన్‌లు, హెలికాఫ్టర్ల వంటి ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫిప్త్ జనరేషన్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టంగా హైపర్‌లూప్ పురుడు పోసుకుంది. ఇది అత్యంత సేఫ్‌గా, చీప్‌గా, స్పీడ్‌గా వెళ్లే ప్రయాణ సాధనం కాబోతోంది. గంటలకు 1,220 కి.మీ వేగంతో వెళ్లేలా హైపర్‌లూప్‌ను డిజైన్ చేస్తున్నారు. ఏవరేజ్ స్పీడ్ 970 కిలోమీటర్స్ పర్ హవర్. అంటే ఏరోప్లేన్ కంటే స్పీడ్‌గా వెళుతుంది. ఇలాన్ ముస్క్ దీన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావడానికి డిజైన్ తయారుచేయాలని ప్రపంచవ్యాప్తంగా ఇంజినీర్లకు కాంపిటీషన్ పెడితే భారీ రెస్పాన్స్ వచ్చింది. చివరకు నెదర్లాండ్స్‌లోని డెల్ఫ్ యూనివర్సిటీ విన్నర్‌గా నిలిచింది. వీళ్లు తయారుచేసిన ప్రొటోటైప్ (హైపర్‌లూప్ 1)ను ఇంజినీర్లు పట్టాలెక్కిస్తారు. ప్రస్తుతం లాస్ఏంజెల్స్ డౌన్‌టౌన్‌లో 75000 స్క్వేర్ ఫీట్‌లో హైపర్‌లూప్1ను టెస్ట్ చేస్తున్నారు. ప్రపంచంలోనే ఫస్ట్‌టైమ్ యూఏఈలో 2020 నాటికి హైపర్‌లూప్ నడుపుతారు.
ఇండియాలో కూడా వస్తుంది
ఈఏడాది మొదట్లో రైల్వే మినిస్టర్ సురేష్ ప్రభు హైపర్‌లూప్ గురించి చెప్పారు. ఇండియాలోని మేజర్ సిటీలను కవర్ చేస్తూ 5 హైస్పీడ్ కారిడార్స్‌ను ఏర్పాటు చేయాలన్నది ప్లాన్. ఇది వర్కవుట్ అయితే ఢిల్లీ- ముంబయి 55 మినిట్స్‌లో , బెంగళూరు -చెన్నై 20 మినిట్స్‌లో, బెంగళూరు- తిరువనంతపురం 41 మినిట్స్‌లో, ముంబయి నుంచి చెన్నై51 మినిట్స్‌లో వెళ్లిపోవచ్చు. 2021 నాటికి ఇండియాలో హైపర్‌లూప్‌ను చూడొచ్చని అంచనా. లేటెస్ట్‌గా ఏపీ గవర్నమెంట్ కూడా అమరావతి - విజయవాడ మధ్య హైపర్‌లూప్ ఏర్పాటుకు హైపర్‌లూప్ ట్రాన్స్‌పోర్టేషన్ టెక్నాలజీస్ తో ఎంవోయూ కూడా చేసుకుంది. దీనిమీద వచ్చే నెల నుంచి స్టడీ ప్రారంభిస్తారు.