• తాజా వార్తలు

ఐసీఐసీఐ వాట్సాప్ బ్యాంకింగ్‌.. ఎలా వాడుకోవాలో తెలియ‌జెప్పే గైడ్

టెక్నాల‌జీని వాడుకోవ‌డంలో ప్రైవేట్ బ్యాంకులు ముందుంటున్నాయి. ఆ దారిలో ఐసీఐసీఐ బ్యాంక్ ఇప్పుడు వాట్సాప్ బ్యాంకింగ్‌ను కూడా తెర‌మీద‌కు తెచ్చింది.  జ‌స్ట్ వాట్సాప్ మెసేజ్‌తోనే బ్యాంకింగ్ సేవ‌ల‌న్నీ అందుకునే సౌక‌ర్యం ఐసీఐసీఐ క‌స్ట‌మ‌ర్ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది.
ఫిక్స్‌డ్ డిపాజిట్ కూడా
ఐసీఐసీఐ బ్యాంక్‌ వాట్సాప్‌ బ్యాంకింగ్‌లో విశిష్ట‌మైన ఫీచ‌ర్ ఏమిటంటే ఇంట్లో కూర్చునే  జ‌స్ట్ ఒక వాట్సాప్ మెసేజ్‌తో ఫిక్స్‌డ్ డిపాజిట్‌లు కూడా చేయొచ్చు.   మొత్తం 25 ర‌కాల సేవ‌ల‌ను దీని ద్వారా పొంద‌వ‌చ్చు.
* ప‌వ‌ర్ బిల్‌, గ్యాస్ బిల్‌‌, పోస్ట్‌ పెయిడ్‌ మొబైల్‌ బిల్లు వాట్సాప్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించ‌వచ్చు.  
* క‌స్ట‌మ‌ర్లు తమ అకౌంట్‌లో బ్యాలెన్స్ ఎంతుందో కూడా వాట్సాప్ బ్యాంకింగ్‌తో తెలుసుకోవ‌చ్చు. 
కార్పొరేట్ యూజ‌ర్ల‌కూ సౌక‌ర్య‌లు
వాట్సాప్ బ్యాంకింగ్ ఐసీఐసీఐ వ్య‌క్తిగ‌త క‌స్ట‌మ‌ర్ల‌కే కాదు కార్పొరేట్ యూజ‌ర్ల‌కు కూడా అందించ‌నుంది.  కార్పొరేట్‌ కంపెనీలు, చిన్న‌,మ‌ధ్య త‌ర‌హా ఇండ‌స్ట్రీలు  కస్టమర్‌ ఐడీ, ఇంపోర్ట్ ఎక్స్‌పోర్ట్ (ఐఈ) కోడ్‌ను తెలుసుకోవ‌చ్చు.
 బ్యాంకులో లోన్‌కు సంబంధించిన ఇన్ఫో కూడా తెలుసుకోవ‌చ్చు.  

ఎలా స్టార్ట్ చేయాలి?
*  మీ మొబైల్‌లో 86400 86400 నెంబ‌ర్‌ను ఐసీఐసీఐ పేరుతో సేవ్ చేసుకోండి. ఇది మీరు బ్యాంక్‌లో ఇచ్చిన రిజిస్ట‌ర్ మొబైల్ నెంబ‌ర్ అయి ఉండాలి. 
* నెంబ‌ర్ సేవ్ చేసుకున్నాక మీ మొబైల్ నుంచి ఆ నెంబ‌ర్‌కు  Hi అని మెసేజ్ పెట్టండి
* రెస్పాన్స్‌గా బ్యాంక్ నుంచి మీకు వాట్సాప్ బ్యాంకింగ్ ద్వారా అందే సేవ‌ల లిస్ట్ మెసేజ్‌గా వ‌స్తుంది.
* ఇందులో ప్ర‌తి సేవ‌కు కీ వ‌ర్డ్ ఉంటుంది
* మీరు ఏ స‌ర్వీస్‌ను వినియోగించుకోవాలంటే ఆ స‌ర్వీస్ కీవ‌ర్డ్ కొడితే ఆ స‌ర్వీస్ పొంద‌వ‌చ్చు.

జన రంజకమైన వార్తలు