• తాజా వార్తలు

రీఫ‌ర్బిష్డ్ ల్యాప్‌టాప్స్ కొనడంలో మంచీ చెడుల‌పై వ‌న్‌స్టాప్ గైడ్‌

రీఫ‌ర్బిష్డ్ ల్యాప్‌టాప్స్ కొనొచ్చా లేదా ల్యాప్‌టాప్ త‌క్కువ రేటులో కొనాలనుకునేవారికి త‌లెత్తే సందేహం ఇది. అస‌లు ఇంత‌కీ రీఫ‌ర్బిష్డ్ ల్యాప్‌టాప్స్ అంటే ఏంటి?  వాటిని కొన‌డం క‌రెక్టా.. కాదా తెలుసుకోవ‌డానికి మీకోసం ఈ వ‌న్‌స్టాప్ గైడ్‌

రీఫ‌ర్బిష్డ్ ల్యాప్‌టాప్స్ అంటే ఏంటి?
ఏదైనా మాన్యుఫాక్చ‌రింగ్ లోపాలు ఉన్న‌వి, లేదా కొన్నాక క‌స్ట‌మ‌ర్‌కి న‌చ్చ‌క రిట‌ర్న్ చేసిన ల్యాప్‌ట్యాప్స్‌ను కంపెనీలు లేటెస్ట్ సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ల‌తో అప్‌డేట్ చేసి రీఫ‌ర్బిష్డ్ ల్యాప్‌టాప్స్‌గా అమ్మ‌కానికి పెడ‌తాయి. అంటే ఇవి సెకండ్ హ్యాండ్ (వేరేవాళ్లు వాడి ప‌క్క‌న పెట్టేసిన‌)వి కాద‌ని గుర్తుంచుకోండి. అంటే ఒక‌ర‌కంగా చెప్పాలంటే ఇవి కొత్త ల్యాప్‌టాప్స్‌తో స‌మానం. తేడా అల్లా ధ‌ర‌లోనే.

రీఫ‌ర్బిష్డ్ ల్యాప్‌టాప్స్ త‌క్కువ ధ‌ర‌కు ఎందుకు వ‌స్తాయి? 
యూజ‌ర్ కొన్నాక దానిలో త‌యారీ లోపాలుంటే రిట‌ర్న్ చేస్తారు. కొంద‌రు న‌చ్చ‌లేద‌ని రిట‌ర్న్ చేస్తారు. అలాంట‌ప్పుడు వాటిని కంపెనీ కొత్త ల్యాపీల్లా అమ్మ‌లేదు. లోపాలు స‌రిదిద్ది లేటెస్ట్ అప్‌డేట్స్‌తో దాన్ని ఉన్న‌తీక‌రిస్తుంది. అయితే అప్ప‌టికే మార్కెట్‌లో కొత్త మోడ‌ల్స్ వ‌స్తుంటాయి కాబ‌ట్టి వాటిని కొత్త ల్యాపీల రేటుకి అమ్మ‌లేరు కాబ‌ట్టి ధర కొత్త ల్యాపీల‌కంటే క‌చ్చితంగా త‌క్కువ‌గా ఉంటుంది.  అందుకే కొత్త ల్యాపీ కొనేంత డబ్బులు పెట్ట‌లేనివారు రీఫ‌ర్బిష్డ్ ల్యాప్‌టాప్స్‌ను ఎంచుకుంటారు. 

రీఫ‌ర్బిష్డ్ ల్యాప్‌టాప్స్ కొన‌డంలో లాభాలేంటి?
* కొత్త ల్యాపీ కంటే ఇవి త‌క్కువ ధ‌ర‌కు వ‌స్తాయి. 

* దాదాపు కొత్త‌వాటిలాగానే రీఫ‌ర్బిష్డ్ ల్యాప్‌టాప్స్ కూడా మ‌న్నిక ఇస్తాయి. వీటికి కంపెనీలు గ్యారంటీ కూడా ఇస్తాయి.

* మాన్యుఫాక్చ‌రింగ్‌లో లోపాలుంటే కంపెనీయే స‌రిదిద్ది ఇస్తుంది కాబ‌ట్టి ప్రాబ్ల‌మ్స్ వ‌స్తాయ‌ని భ‌య‌ప‌డ‌క్క‌ర్లేదు.

* లేటెస్ట్ ఓఎస్‌, హార్డ్ వేర్‌ల‌తో వీటిని అప్‌డేట్ చేస్తాయి కాబ‌ట్టి పెర్‌ఫార్మెన్స్ ప‌రంగానూ నో ప్రాబ్ల‌మ్‌.

* వాడేసిన సెకండ్ హ్యాండ్‌లాంటివి కాదు కాబ‌ట్టి ప్రాబ్ల‌మ్స్ వ‌స్తాయేమో, మెయింట‌నెన్స్ భార‌మ‌వుతుందేమోన‌న్న భ‌యం అక్క‌ర్లేదంటున్నారు నిపుణులు. 

రీఫ‌ర్బిష్డ్ ల్యాప్‌టాప్స్ కొన‌డంలో న‌ష్టాలేంటి? 
కొత్తల్యాపీ కంటే త‌క్కువ ధ‌ర‌కు వ‌చ్చిన‌ప్ప‌టికీ రీఫ‌ర్బిష్డ్ ల్యాప్‌టాప్స్ కొన‌డంలోనూ కొన్ని మైన‌స్‌లున్నాయి.  స్పెసిఫికేష‌న్స్ కొత్త ల్యాపీ స్థాయిలో ఉండ‌వు.  ర్యామ్‌, ప్రాసెస‌ర్ స్పీడ్‌, హార్డ్ డ్రైవ్‌, ప్రీ ఇన్‌స్టాల్డ్ సాఫ్ట్‌వేర్ విష‌యంలోనూ రీఫ‌ర్బిష్డ్ ల్యాప్‌టాప్స్ కొత్త‌వాటికంటే వెనుకే ఉంటాయి. 
* ఫీచ‌ర్లు ఒకేలా ఉన్నా ఇలాంటి స్పెక్స్ విష‌యంలో రీఫ‌ర్బిష్డ్ ల్యాపీలది వెనుక‌బాటే. 

పాత‌వాటికంటే బెట‌ర్‌
మొత్తంగా చూస్తే కొత్త ల్యాపీల కంటే రీఫ‌ర్బిష్డ్ ల్యాప్‌టాప్స్ కాస్త వెనుక‌బ‌డినా సెకండ్ హ్యాండ్ వాటి కంటే ఇవి చాలా బెట‌ర్‌. అందునా ప్రైస్ కూడా పాత‌వాటి కంటే కాస్త ఎక్కువ ఉంటుంది. కానీ ఇవి కొత్త‌వాటిలా ప‌ని చేస్తాయి. పాత ల్యాపీలు కొంటే దాన్ని యూజ‌ర్ అప్ప‌టికే మాగ్జిమం వాడేసి ఉంటారు. కాబ‌ట్టి పెర్‌ఫార్మెన్స్‌, లుక్ వంటి విష‌యాల్లో ఇవి త‌క్కువ స్థాయిలో ఉంటాయి. కానీ రీఫ‌ర్బిష్డ్‌లో ఆ బాధ లేదు. అదీకాక కంపెనీ వారంటీ కూడా ఉంటుంది కాబ‌ట్టి ఏదైనా ప్రాబ్ల‌మ్ వ‌స్తే ఫ్రీగా చేసిచ్చే ఆప్ష‌న్ కూడా ఉంటుంది. కాబ‌ట్టి మరీ లేటెస్ట్ స్పెక్స్ అవ‌స‌రం లేదు.. కాస్త త‌క్కువ ధ‌ర‌కు వ‌స్తే చాల‌నుకునే సాధార‌ణ యూజ‌ర్ల‌కు రీఫ‌ర్బిష్ట్ ల్యాప్‌టాప్స్ మంచి ఆప్ష‌నే అంటున్నారు నిపుణులు. 


 

జన రంజకమైన వార్తలు