• తాజా వార్తలు

ఆధార్ నెంబ‌ర్‌తో చిటికెలో పాన్‌కార్డ్ పొంద‌డానికి సింపుల్ గైడ్

ప‌ర్మినెంట్ అకౌంట్ నెంబ‌ర్  (పాన్) కార్డ్ కావాలా.. మీ ద‌గ్గ‌ర ఆధార్ కార్డ్, ఆధార్‌లో న‌మోదు చేసుకున్న ఫోన్ నెంబ‌ర్ ఉంటే ప‌దంటే ప‌దే నిమిషాల్లో పాన్ కార్డ్ చేతికి వ‌చ్చేస్తుంది. ఇన్‌స్టంట్ పాన్ కార్డ్ పేరుతో కేంద్ర ప్ర‌భుత్వం ఈ కార్య‌క్ర‌మాన్ని రెండు రోజుల కిందట అధికారికంగా ప్రారంభించింది.   ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం అధికారికంగా ప్రారంభించారు.

ఇన్‌స్టంట్ ఆధార్
ఆధార్‌ వివరాలు ఇచ్చిన వారికి అప్పటికప్పుడే ఆన్‌లైన్‌లో పాన్‌ నంబర్‌ కేటాయించే ఈ సదుపాయాన్నిఫిబ్రవరి 12న పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. బీటా వెర్ష‌న్‌లో పాన్ కార్డులు ఇవ్వ‌డం ప్రారంభించారు. అప్ప‌ట నుంచి మే 28 వ‌ర‌కు 6,77,680 పాన్‌ నంబర్లు ఆన్‌లైన్‌లో కేటాయించిన‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

ఇవీ ప్ర‌త్యేక‌త‌లు
* పేప‌ర్ లెస్ అప్లికేష‌న్‌
* రియ‌ల్ టైమ్ ఇష్యూ
* ఉచిత స‌ర్వ‌స్‌

ఎలా అప్లయి చేసుకోవాలి?
* ఇన్‌క‌మ్ ట్యాక్స్ ఈ- ఫైలింగ్‌ వెబ్‌సైట్‌కు వెళ్లండి

* దీనిలో ఎడ‌మ‌వైపు మెనూలో ఇన్‌స్టంట్ పాన్ త్రూ ఆధార్ అనే ఆప్ష‌న్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి

* ఇప్పుడు కొత్త పేజీ ఓపెన్ అవుతోంది. ఇందులో గెట్ న్యూ పాన్ ఆప్ష‌న్ క్లిక్ చేయండి.

* ఆధార్ నెంబ‌ర్, ఆ పేజీలో ఇచ్చిన క్యాప్చా ఎంట‌ర్ చేసి టర్మ్స్ అండ్ కండిష‌న్స్ ఓకే చేయండి. కింద జ‌న‌రేట్ ఆధార్ ఓటీపీ అనే ఆప్ష‌న్ క్లిక్ చేయండి.

* మీ మొబైల్‌కు ఓటీపీ వ‌స్తుంది. అది ఎంట‌ర్ చేయ‌గానే మీ అప్లికేష‌న్ ప్రాసెస్ పూర్తవుతుంది.

* అప్లికేష‌న్ పెట్ట‌గానే 15 అంకెల ఎక‌నాలెడ్జ్‌మెంట్ నెంబ‌ర్ వ‌స్తుంది. ‌కావాలంటే మీ అప్లికేష‌న్ స్టేట‌స్‌ను దీని ద్వారా తెలుసుకోవ‌చ్చు.

*  అవసరమైన వివరాలు అందించిన 10 నిమిషాల్లోనే వారికి పాన్‌ నంబర్‌ వస్తుంది.  మీ మొబైల్‌కు, మెయిల్ ఐడీకి మీ పాన్ కార్డ్ డౌన్‌లోడ్ లింక్ వ‌స్తుంది.

* ఈ ఫైలింగ్ వెబ్‌సైట్‌లో ఇన్‌స్టంట్ పాన్ త్రూ ఆధార్ అనే ఆప్ష‌న్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే డౌన్‌లోడ్ పాన్ ఆప్ష‌న్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మీ పాన్ కార్డ్ డౌన్‌లోడ్ అవుతుంది.  

జన రంజకమైన వార్తలు