లాక్డౌన్‌లో వీడియో కాన్ఫరెన్సింగ్ అవసరాలకు జూమ్ యాప్ ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలుసు. అయితే జూమ్ యాప్‌లో సెక్యూరిటీపరంగా ఇబ్బందులున్నాయని ప్రభుత్వం దీని వాడకాన్ని పక్కనపెట్టింది. దీనికి పోటీగా యాప్ తయారుచేయాలని ఇండియన్ స్టార్టప్‌లకు పిలుపునిచ్చింది. దీంతో ఇండియాలోని చాలా స్టార్టప్‌లు వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్‌లు తయారుచేయడంలో నిమగ్నమయ్యాయి. అందులో ఒకటే సే నమస్తే యాప్. దీన్ని గూగుల్ ప్లేస్టోర్‌లో తాజాగా అందుబాటులోకి తెచ్చారు. దీని ఫీచర్లేమిటో, ఎలా వాడుకోవాలో చూద్దాం.
వెబ్ నుంచి యాప్ డెవలప్‌మెంట్
సే నమస్తే అనేది ఇంతకు ముందు వెబ్ సర్వీస్‌గా ఉండేది. వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ తయారుచేయాలన్న గవర్నమెంట్ పిలుపు మేరకు దీనికి మొబైల్ యాప్ కూడా డెవలప్ చేశారు. గూగుల్ ప్లే స్టోర్‌తోపాటు యాపిల్ యాప్ స్టోర్‌లోనూ ఈ యాప్ అందుబాటులోకి వచ్చింది. దీనిలో ప్రైవసీ, సెక్యూరిటీ ఫీచర్లన్నీ పక్కాగా ఉన్నా సే నమస్తే సీఈవో అనూజ్ గార్గ్ ప్రకటించారు.
సే నమస్తే యాప్ ఫీచర్లు
* సే నమస్తే యాప్ ద్వారా ఒకేసారి 50 మంది వీడియో కాన్ఫరెన్సింగ్‌లో పార్టిసిపేట్ చేయొచ్చు.
* స్క్రీన్ షేరింగ్ ఆప్షన్ ఉంది.
* ఫైల్ షేరింగ్ ద్వారా పార్టిసిపెంట్స్ పీడీఎఫ్, ప్రజంటేషన్స్, ఇమేజ్‌లు, వీడియో ఫైల్స్‌ను మిగతావారితో షేర్ చేసుకోవచ్చు.
* వీడియో కాల్ నడుస్తుండగానే పార్టిసిపెంట్స్ టెక్స్ట్ మెసేజ్ కూడా సెండ్ చేయొచ్చు.
* దీంతోపాటు జూమ్‌లో ఉన్న ఇతర ఫీచర్లన్నీ దాదాపుగా ఇందులో ఉన్నాయి.
సే నమస్తే యాప్‌ను వాడుకోవడం ఎలా?
* సే నమస్తే యాప్‌ను వాడుకోవడం చాలా ఈజీ.
* యాప్ ఓపెన్ చేసి జాయిన్ మీటింగ్ క్లిక్ చేస్తే కాల్‌లో మీరు యాడ్ కావచ్చు.
* స్టార్ట్‌ను క్లిక్ చేస్తే వీడియో కాన్ఫరెన్సింగ్ కాల్‌ను ప్రారంభించవచ్చు.