వాట్సాప్ తెచ్చిన ప్రైవసీ పాలసీ సిగ్నల్ యాప్ పాలిట వరంగా మారింది. వాట్సాప్ ప్రైవసీ పాలసీ ద్వారా మన వివరాలను ఫేస్బుక్‌తో పంచుకుంటుందన్న సమాచారం తో చాలామంది సిగ్నల్ యాప్‌కు మారిపోతున్నారు. ఇప్పటికే ఇండియాలో లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. గత వారం ఐవోఎస్ యాప్ స్టోర్‌లో అయితే ఇది టాప్ ట్రెండింగ్ కూడా. ఈ యాప్‌లో మన సెక్యూరిటీ పరంగా వాట్సాప్ కంటే చాలా ఎక్కువ ఫీచర్లున్నాయి. వాటిని ఎలా వాడుకోవాలో చెప్పే గైడ్ మీకోసం..
ప్రొఫైల్ పిక్చర్ లేకుండానే లాగిన్
వాట్సాప్‌లో మన పేరు, డీపీగా ఫోటో పెట్టుకుంటాం. ఇప్పుడు అది అందరికీ చేరిపోయింది. వాట్సాప్ డేటా సర్వర్‌లో కూడా ఫీడ్ అయిపోయింది. కాబట్టి కొత్తగా సిగ్నల్ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నప్పుడు మీ పేరు, డీపీ పెట్టుకోకుండా ప్రయత్నించవచ్చు. అయితే పేరు తెలియకపోతే ఇబ్బంది అనుకుంటే సింపుల్‌గా చిన్నపేరు పెట్టుకోండి. దానివల్ల మీ పేరు, ఫోటో సిగ్నల్ యాప్ సర్వర్‌లో స్టోర్ కాకుండా చూసుకోవచ్చు.
అపరిచితులను అడ్డుకోండి.
మీకు తెలియని వ్యక్తులు మిమ్మల్ని కాంటాక్ట్ చేయకుండా ఆపాలనుకుంటున్నారా. ప్రైవసీ సెట్టింగ్స్‌లోకి వెళ్లండి. | Allow from Anyone ఆప్షన్ డిజేబుల్ చేయండి. అంతే ఇక మీకు తెలియని వ్యక్తులు ఎవరూ మిమ్మల్ని సిగ్నల్ యాప్‌లో సంప్రదించలేరు.
ఫోన్ బుక్ యాక్సెస్ కంట్రోల్
సిగ్నల్ యాప్‌లో Appearance సెట్టింగ్‌లో ఉంటే యూజ్ సిస్టమ్ కాంటాక్ట్ ఫోటోస్ ఆప్షన్‌లోకి వెళ్లి దాన్ని డిజేబుల్ చేయండి. అంతే మీ ఫోన్‌లో ఉన్నకాంటాక్ట్స్‌ను , ఫోటోలను సిగ్నల్ యాప్‌లో కనపడవు.
పిన్, రిజిస్ట్రేషన్ లాక్
మీ సిగ్నల్ అకౌంట్ మీ ఫోన్ నంబర్‌కు లింక్ చేయబడదు. దీంతో మీ డేటా మరింత సేఫ్‌గా ఉంటుంది. మీ అకౌంట్‌ను ఎవరూ యాక్సెస్ చేయకుండా పిన్ సెట్ చేసుకోవచ్చు.
మీ అకౌంట్ మరింత సెక్యూర్ గా ఉండాలంటే ప్రైవసీ సెట్టింగ్స్‌లోకి వెళ్లి Registration lock ఆన్ చేయండి. దీంతో మరే ఇతర ఫోన్ల నుంచి ఎవరూ మీ యాప్ డేటాను హ్యాక్ చేయలేరు.
రీడ్ రెసిపెంట్ ఆప్షన్
మీ ఐపీ అడ్రస్ , మీ ఫోన్ కాంట్రాక్ట్‌ను బయటపెట్టకుండా అడ్డు్కోవాలనుకుంటే రీడ్ రిసిపెంట్ ఆప్షన్ బ్లాక్ చేయండి. Always Relay Calls ఆప్షన్ అనేబుల్ చేస్తే చాలు. దీనివల్ల మీ ఫోన్లోని అన్‌వాంటెడ్ మెటా డేటా ఇన్ఫర్మేషన్‌ను డిలెట్ చేసేస్తుంది.
వాయిస్ కాల్ హిస్టరీ క్లియర్
మీరు ఐఫోన్లో సిగ్నల్ యాప్ వాడుతున్నారా? అయితే ప్రైవసీ సెట్టింగ్స్‌లోకి వెళ్లి Show calls in Recent ఆప్షన్ బ్లాక్ చేస్తేచాలు సిగ్నల్ యాప్ ద్వారా మీరు చేసిన వాయిస్, వీడియో కాల్స్‌ను హిస్టరీలో లేకుండా చేసుకోవచ్చు.
స్క్రీన్ టైమ్ సెట్టింగ్
ఇతరులు మీ చాట్ యాక్సెస్ చేయకుండా నిరోధించాలనుకుంటున్నారా? అయితే సిగ్నల్ యాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి Screen timeout ఆప్షన్ టాప్ చేయండి. ఇప్పడు స్క్రీన్ టైమింగ్‌ను 1 నిమిషానికి సెట్ చేసుకోండి. అంటే 1 నిమిషం తర్వాత ఎవరూ మీ చాట్‌ను చూడడానికి వీల్లేకుండా యాప్ లాక్ అయిపోతుంది.
డిజప్పియరింగ్ మెసేజెస్
Disappearing messages ఫీచర్ సిగ్నల్ యాప్‌లో మరో పెద్ద అడ్వాంటేజ్. వాట్సాప్‌లో కూడా ఈ ఫీచర్ ఉన్నా అంత బాగా పని చేయదు. ఈ ఆప్షన్ కింద మెసేజ్‌లను కనీసం 5 సెకన్లకు సెట్ చేయవచ్చు. అంటే మీరు 5 సెకన్ల పాటు మెసేజ్ చూసిన తర్వాత అది అదృశ్యమవుతుంది. అంటే మీ చాట్‌కు మరింత రక్షణ అన్నమాట.