• తాజా వార్తలు

అమెజాన్‌లో ట్రైన్ టికెట్స్ బుక్  చేసుకోవ‌డానికి  గైడ్‌

ప్ర‌ముఖ ఈకామ‌ర్స్ వెబ్‌సైట్ అమెజాన్ త‌న వినియోగ‌దారుల‌కు త‌న యాప్వెబ్‌సైట్‌లో ట్రైన్ టికెట్స్ బుక్  చేసుకునే అవ‌కాశం క‌ల్పించింది. ఇందుకోసం ఐఆర్‌సీటీసీతో ఒప్పందం కుదుర్చుకుంది. అమెజాన్ ఆండ్రాయిడ్‌ యాప్‌లతోపాటు అమెజాన్‌.ఇన్ వెబ్‌సైట్‌లోకూడా ఈ అవ‌కాశం ఉంది. త్వ‌ర‌లో ఐవోఎస్ యాప్‌లో కూడా ఈ ఫీచ‌ర్‌ను తీసుకురాబోతోంది.

స్పెష‌ల్ పేజ్‌

ట్రైన్ టికెట్స్ బుకింగ్ కోసం అమెజాన్ యాప్‌లో స్పెష‌ల్ పేజీని క్రియేట్ చేసింది.

* అమెజాన్ పేను క్లిక్ చేసి మీకు కావాల్సిన ట్రైన్ డిటెయిల్స్ చూసుకుని టికెట్ బుక్ చేసుకోవ‌చ్చు.

* యాప్ నుంచి నేరుగా పేమెంట్ గేట్‌వేకి వేళ్లి మ‌నీ పే చేయొచ్చు. 

* అమెజాన్ పే క్రెడిట్ ఉన్నా వాడుకోవ‌చ్చు.

* టికెట్ క్యాన్సిల్ చేసుకోవాలంటే మై ఆర్డ‌ర్స్ సెక్ష‌న్‌లోకి వెళ్లి క్యాన్సిల్ చేసుకోవ‌చ్చు

 

ఉప‌యోగాలు

* ఎలాంటి స‌ర్వీసు ఛార్జీ ఉండ‌దు.

* తొలి సారి అమెజాన్ ద్వారా ట్రైన్ టికెట్స్ బుక్  చేసుకున్న‌ప్పుడు  10% (గ‌రిష్టంగా 100 రూపాయ‌ల) వ‌ర‌కు క్యాష్‌బ్యాక్ ల‌భిస్తుంది.

* అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్ల‌క‌యితే తొలిసారి టికెట్ బుక్ చేసుకున్న‌ప్పుడు 12% (గ‌రిష్టంగా 120 రూపాయ‌ల‌) వ‌ర‌కు క్యాష్‌బ్యాక్ ల‌భిస్తుంది.

* ఈ క్యాష్‌బ్యాక్ ఆఫ‌ర్ కొంత‌కాలం వ‌ర‌కే ప‌రిమితం

* బెర్త్ లభ్య‌త‌, పీఎన్ఆర్ స్టేట‌స్ చెక్ చేసుకో్వ‌చ్చు.

 

జన రంజకమైన వార్తలు